బైబిల్లో మొదటి హత్యకు కారణం యెహోవా. జంతుబలి కోసం నరుల రక్తం చిందించడం, మళ్ళీ నరులనే నిందించడం యెహోవా ప్రత్యేకత!

Context:

భూమిపైన మొదటి జంట అనబడే హవ్వ ఆదాములకు ఇద్దరు మగ సంతానం. ఆడపిల్లలు ఉన్నా బైబిల్లో వారి పేర్లు లిఖించబడలేదు.

బైబిలులోని ఆదికాండము అనే మొదటి చాప్టర్లో ఉండే ఈ కథ ప్రకారం, కయూను పెద్దవాడు. హేబెలు చిన్నవాడు.

ఒకడు రైతు, ఇంకొకడు పశువుల కాపరి. అదేమిటి..? అప్పటికి భూమిపైన ఉన్నది ఒక్కటే కుటుంబం కదా ?వాళ్ళు వ్యవసాయం ఎందుకు చెయ్యాలి, జంతువులను ఎందుకు మేపాలి.. లాంటి తెలివితేటలు కాసేపు పక్కన పెట్టి కథ పూర్తిగా చదవండి.

ఒకరోజు కయూను, హేబేలు యెహోవాకి బలి అర్పణ తీసుకువచ్చారు. అంటే మొదటి కుటుంబం (ఆదాము కుటుంబం) నుండే యెహోవాకు బలులు ఇస్తూ వచ్చారు అన్నది ఇక్కడ స్పష్టం అవుతోంది.

పెద్దవాడు కయూను (Cain) కూరగాయలు, చిన్నవాడు హేబేలు (Abel) జంతు బలి యెహోవాకి అర్పించారు.


కయూను తెచ్చిన పొలం పంట (కూరగాయల) ప్రసాదాన్ని యెహోవా తిరస్కరించడమే కాకుండా తన మాటల ద్వారా కయూనుని యెహోవా బాధపెడతాడు, రెచ్చగొడతాడు.

1. "కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.

రెచ్చిపోయి హత్య చేసిన కయూను:

కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.
అర్థం అయింది కదా.. యెహోవా కయూని ప్రసాదాన్ని వద్దు అన్నాడు. పైగా నువ్వు చేసింది correct కాదు (సత్క్రియ చేయలేదు కదా అన్నాడు. ఆ కోపం తోనే కయోను హత్య చేశాడు. ఇంతకీ సత్క్రియ అంటే ఏమిటి?

  1. యెహోవాకి ఇష్టమైన జంతు బలి ఇవ్వడమా?
    అవును ఎక్కువ శాతం క్రైస్తవులు ఇదే అంటారు. యెహోవాకి జంతు బలి ఇష్టమే.
  2. పెద్దవాడైన Abel కాకుండా అతని తమ్ముడు Cain ముందుగా ప్రసాదం తేవడం.
    అంటే వరస క్రమాన్ని అనుసరించలేదని యెహోవా ఒక మనిషి చావుకి కారణం అయ్యాడా? అయి ఉండవచ్చు.

యెహోవా ఆ ప్రసాదాన్ని తిరస్కరించడానికి ఈ రెండు కారణాలు నిజమే కావచ్చు.
కానీ యెహోవానే abel చావుకి కారణం అని చెప్తున్నావు? అని కొందరు అడుగుతారు.
వారికి కూడా సమాధానం ఉంది.

Proof :1

కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు;(ఆదికాండం 4:11)

Proof -2

అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను. (ఆదికాండం 4:16)
యెహోవా వేసిన శిక్ష వలన కయూను వేరే దేశానికి వెళ్లాల్సి వచ్చింది.
మరి దీనికి యెహోవానే హత్య చేశాడు అనడటానికి సంబంధం ఏమిటి?

Final Proof:

అయితే వాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను. (నిర్గమ కాండం 21:13)

అంటే ఒకడు కావాలని హత్య చేయనప్పుడు, దైవ ప్రేరణతో హత్య జరిగినప్పుడు మాత్రమే వాడికి ఆ నేల నుండి బహిష్కరణ విధిస్తాడు యెహోవా.
కయూను విషయంలోనూ యెహోవా చేసింది అదే కాబట్టి యెహోవానే Abel హత్యకి బాధ్యుడు అని బైబిల్ ప్రకారం అర్ధం అవుతుంది.
ఒకవేళ అది దైవ ప్రేరణతో జరగకపోయి ఉంటే యెహోవా అతనికి మరణ శిక్ష వేసేవాడు.
అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. (నిర్గమకాండము 21:14)

కాబట్టి ఆది నుండి నరహంతకుడు యెహోవానే.. అని prove అయింది.

బైబిల్లో యెహోవా ప్రతి చిన్న విషయానికీ మనుషుల్ని చంపుతూ పోయాడు.

మొత్తం బైబిల్ చెప్పిన లెక్క ప్రకారం యెహోవా చంపింది 28,21,364 మందిని.

అంచనాలను కలిపి ఈ లెక్క 2,49,94,828 వరకూ మనుషులను యెహోవా చంపాడు అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *