
బైబిల్ దేవుడు చాలా దయామయుడు, కరుణామయుడు
ఎంత కరుణామయుడు అంటే ఆయన్ని ఒక మాట అంటే కూడా తట్టుకోలేనంత. కోపంతో మనల్ని రాళ్ళతో కొట్టి చంపించే అంత!
దైవ దూషణ నియమం (Blasphemy )
యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. (లేవీయకాండము 24:16)
Anyone who blasphemes the name of the LORD must be put to death. The entire assembly must stone him. Whether an alien or native-born, when he blasphemes the Name, he must be put to death. (Leviticus 24:16)
వివరణ:
యెహోవా ఒక నియమం పెట్టాడు. ఈ నియమం ప్రకారం ఎవరైనా తనను తిడితే ఆ వ్యక్తిని ఇజ్రాయెల్ ప్రజలు రాళ్లతో కొట్టి చంపేయాలి. ఈ నియమం తప్పితే దైవ దూషణ చేసిన స్వదేశీయులు, పరదేశీయులు కూడా మరణ శిక్షకు అర్హులు. ఇది యెహోవా స్వయంగా పెట్టిన నియమం. శిక్ష అమలు కూడా యెహోవానే చేశాడు. తన ప్రజలతో స్వయంగా ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపించాడు.
బైబిల్ రిఫరెన్సులు:
లేవీయకాండము 24:10-23
- ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను.
- ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె
- యెహోవా యేమి సెల విచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.
- అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
- శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతు లుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను.
- మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.
- యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను .పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
(మధ్యలో కొన్ని వేరే నియమాల ప్రస్తావన ఉంటుంది)
Punishment:
మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను.(లేవీయకాండము 24:22)
కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెను శపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.(లేవీయకాండము 24:23)
ఈ నియమం అత్యంత ప్రమాదకరమైనది. దీన్ని అడ్డం పెట్టుకొని ఎవరినైనా చంపేయొచ్చు. మా దేవుణ్ణి తిట్టాడు కాబట్టి మేము అతన్ని చంపేశాము అని ఇప్పటికీ కొందరు మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటారు. ఈ నియమం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది.
ఇలా తనను తిడితేనే సహించలేని దేవుడు నీకోసం తన కొడుకును చంపుకున్నాడు అంటే నువ్వు ఎలా నమ్మావు అని ఎవరిని అడగకండి. ఎందుకు అంటే వారు బుర్రవాడటం మానేసి చాలా కాలం అయింది.