“పిర్యాదులు చేస్తే… తగలబెట్టేస్తా అంటున్న బైబిల్ దేవుడు!”

“దేవుడు దయామయుడు, కరుణామయుడు. ఎంత వరకూ అంటే మీరు ఆయన ఇచ్చినది స్వీకరించి ఆయనను పొగిడినంతవరకే. అలా కాదు మాకు అది కావాలి ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరితే ఒక్కొక్కడికీ తాట తీస్తాడు.”

స్టోరీలోకి వెళ్దాం

బైబిల్‌లో సంఖ్యాకాండము 11వ అధ్యాయం. అది యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించి వారిని ఎడారుల్లో నడిపిస్తున్న కాలం. ఎండ, దుమ్ము, నీళ్ల కొరతతో, ఆయాసంతో ఫుల్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు!

దాంతో వాళ్లు మోషేని చూసి గోల పెట్టారు:

“జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను.” (సంఖ్యాకాండము 11:1-2)

“ఈ పిర్యాదులు దేవుని చెవులకు చేరాయి. ఆయన ఊరుకున్నాడా? అబ్బే!

బైబిల్ ఇలా చెబుతుంది:
‘యెహోవా కోపం రగిలింది, ఆయన అగ్ని శిబిరం అంచులను దహించింది’ (సంఖ్యాకాండము 11:1).

ఎడారిలో నడకకే వారు పిర్యాదులు మొదలు పెట్టారు అంటే, బానిసత్వంలో ఉన్నా కూడా వారికి ఇంత కష్టం కలగలేదు అనుకుంటా! కథ ఇక్కడితో అయిపోలేదు.

ఆ ప్రదేశానికి పేరు ‘తబేరా’—అంటే ‘దహనం స్థలం’—అని పెట్టారు!”

వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి, “మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.” (సంఖ్యాకాండము 11:4-6)

తమను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళతారు అని ఆశపడిన అన్యజాతుల వారు ఇశ్రాయేలీయులతో కలిసి బయటకు వచ్చారు. వారికి నిరాశ ఎదురయ్యింది. వాళ్ళు ఇప్పుడు సరైన ఆహారం కోసం పిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. అది కూడా తప్పేనా? పాలు తేనెల దేశంలో ఇవి దొరకవా? ఏమో మరి.

తర్వాత మోషే తాత దేవుడికి కంప్లెయింట్ ఇస్తాడు. దేవుడు ప్రజలకు నెల రోజులకు తగ్గా మాంసం ఇస్తాడు. ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళందరిని చంపేస్తాడు.

“ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.” (సంఖ్యాకాండము 11:33)

ఆ స్థలానికి ‘కిబ్రోతు హత్తావా’ అని పేరు పెట్టారు—అంటే ‘కోరికల సమాధులు’!


విశ్లేషణ: దేవుని దయా, కోపం, శిక్ష

ఇశ్రాయేలీయులు ఎడారిలో కష్టాలతో బాధపడి పిర్యాదు చేయడం సహజమే కదా? అయినా, బైబిల్ ప్రకారం, వారి పిర్యాదులు దేవుని కోపాన్ని రగిలించాయి. మొదట అగ్ని, తర్వాత మాంసం ఇచ్చి, చివరకు తెగులు (plague) పంపి శిక్షించాడు. దేవుడు దయామయుడని చెప్పుకుంటాం, కానీ ఈ సంఘటన చూస్తే, పిర్యాదు చేస్తే ఫైర్ లేదా తెగులు రెడీ అనిపిస్తుంది! మర్యాదగా చెప్పాలంటే, కొందరు దీనిని దేవుని న్యాయంగా చూస్తారు, కానీ ఇంత తీవ్రమైన శిక్ష నిజంగా అవసరమా?


ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు

ఇప్పుడు ఆలోచించండి—దేవుడు దయామయుడు, కరుణామయుడు అని చెప్పుకుంటాం, కానీ కొంచెం పిర్యాదు చేస్తే చంపేయడం ఏమిటి? బైబిల్ ఎంత మంది చనిపోయారో చెప్పలేదు, కానీ ‘శిబిరం అంచులు దహించాయి’ అంటే, కొంతమంది బొగ్గయ్యారని ఊహించవచ్చు!?

ఇప్పుడు ఒక ఆలోచన: మనం హిందువులుగా మన దేవుళ్లపై కోప్పడ్డాం, కోరికలు నెరవేరలేదని పిర్యాదు చేశాం. మన దేవుడు మనల్ని చంపెశాడా? మనం ఇలాంటి శిక్ష ఊహించగలమా? లేక, మతం మారినవాళ్లు బైబిల్ దేవుడిని ప్రశ్నిస్తే, తబేరా లాంటి శిక్ష ఎదురవుతుందా? ఈ సంఘటన మనల్ని ఆలోచనకు తీసుకెళ్తుంది—దేవుడు నిజంగా కోరికలను వినిపించుకుంటాడా? లేక నోరుమూసుకుని ఉండండి లేకపోతే తగలబెట్టేస్తా అంటాడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *