Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బూతులు మానాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ పోస్ట్ చదవండి!


చాలా మందికి బూతులు మాట్లాడటం అనే దురలవాటు ఉంటుంది. ఎంత ప్రయత్నించినా దానిని మానుకోలేరు. వారికి “హై హై నాయక” సినిమాలో దర్శకులు జంధ్యాల గారు ఒక చక్కటి ఉపాయం చెప్పారు. అదేమిటంటే…

“ఏదైనా ఒక బూతు మాట మాట్లాడాలని అనిపించినప్పుడు, మీ ఎదురుగా ఉన్న ఏదో ఒక వస్తువు పేరు అనేయండి.”

ఉదాహరణకు, ఎవరినైనా అసభ్యంగా “అమ్మ నీ XXX” అని తిట్టాలి అనిపిస్తే “అమ్మ నీ కొబ్బరి చెట్టు” అనవచ్చు.

“నీ చేతిలో నా XXX” అనాలనిపిస్తే… “నీ చేతిలో నా కొరడా” అనవచ్చు.

కోట శ్రీనివాసరావు గారి పాత్ర బూతులు మానేయడానికి ఈ చిట్కా సినిమాలో బాగా పనిచేస్తుంది. వీలైతే ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది, ఒకసారి చూడండి.

అయితే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒకవేళ ఎవరికైనా బూతులు మాట్లాడాలని అనిపిస్తే ఏం చేయాలి? చాలా సింపుల్.. పైన చెప్పిన చిట్కాను రివర్స్‌లో చేయడమే! అర్థం కాలేదా?

ఏదైనా బూతు మాట మాట్లాడాలని అనిపించినప్పుడు, ఏదో ఒక నగరం పేరు పెట్టుకుని.. ఆ నగరాలను ఆడవాళ్లుగా, వ్యభిచారులుగా, తిరుగుబోతు స్త్రీలుగా ఊహించుకుని ఇష్టం వచ్చినట్లు తిట్టవచ్చు. ఆడవాళ్ల మర్మాంగాలను ప్రస్తావిస్తూ వాటిని పట్టుకోవడం, నలపడం, బట్టలు విప్పేయడం, నగ్నంగా మార్చడం, బట్టల చెంగులను ముఖంపైకి ఎత్తడం… ఇలా ఏమైనా అనేయవచ్చు. ఈ వింత చిట్కాను కనిపెట్టింది మరెవరో కాదు.. బైబిల్ దేవుడు యెహోవా!

ఈ ఉదాహరణలు చూడండి.

వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. (యెహెఙ్కేలు 23:4)

మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని¸ యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. (యెహెఙ్కేలు 23:8)


వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను.(యెహెఙ్కేలు 23:10)

గాడిద అంత పెద్ద జననేంద్రియాలు కలిగి, గుర్రాలంత వీర్యం కార్చే ప్రియులను ఆమె మోహించింది. (యెహెజ్కేలు 23:20)
She lusted after their genitals–as large as those of donkeys, and their seminal emission was as strong as that of horses. (Ezekiel 23:20)

యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. (యెహెఙ్కేలు 23:21)

కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను(లంగాలను) నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను. (యిర్మియా 13:26)

ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చిన వారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. (యెహెఙ్కేలు 16:25)

నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగాచేసి , పాడు పెట్టి యెండిపోయిన భూమివలెను ఉంచి, దప్పిచేత లయపరచకుండునట్లు, మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను;దాని పిల్లలు జారసంతతియైయున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను.(హోషేయ 2:2-4)


ఇలా అనేక సార్లు స్త్రీల మర్మాంగాల గురించి తన నోటితో దేవుడే మాట్లాడాడు. తిట్టాడు.

దేవుడు మనందరికీ తండ్రి అంటారు కదా? ఇవి ఒక ఆదర్శవంతమైన తండ్రి మాట్లాడాల్సిన మాటలేనా? ఎంత కోపం వస్తే మాత్రం ఇలాంటి బూతులు మాట్లాడాలా?

మరికొన్ని చోట్ల దేవుని ప్రేరణతో రాయబడిన ‘పరమగీతము’లో కూడా ఇలాంటి వర్ణనలే కనిపిస్తాయి:


అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము. (పరమగీతము 2:3)

నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. (పరమగీతము 7:7)

Your stature is like that of the palm, and your breasts like clusters of fruit. (Song of Songs 7:7)

విశ్వాసులను అడిగితే ఇదంతా ‘అలంకార భాష’ అంటారు. అలంకార భాషలో కూడా స్త్రీల అవయవాలనే ఎందుకు నలపాలి? స్త్రీలనే ఎందుకు ముక్కలుగా నరకాలి? బూతులు మాట్లాడే తండ్రి ఏ విధంగా ఆదర్శప్రాయుడు? దీనికి విశ్వాసులే సమాధానం చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *