బైబిల్లో అత్యంత క్రూరమైన ఘటనల్లో ఇది ఒకటి.
తన తండ్రి ఉపపత్నులను (concubines) అనగా మాతృ సమానురాళ్ళైన దాదాపు 10 మంది స్త్రీ మూర్తులను, దావీదు కొడుకు రేప్ చేసిన సంఘటన గురుంచి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ సంఘటనలో యెహోవా పాత్ర గురుంచి కూడా తెలుసుకుందాం.
context :
తన తండ్రి నుండి రాజ్యాధికారాన్ని లాక్కునే క్రమంలో దావీదు కొడుకు అబ్షాలోము చేసిన అనేక ఘోరమైన క్రియల్లో తన తండ్రి ఉపపత్నుల మాన భంగాలు అత్యంత వికృతమైనవి.
ఈ రిఫరెన్స్ లు చదవండి.
అహీతో పెలు “నీ తండ్రి చేత ఇంటికి కావలి యుంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను.”
(2 సమూయేలు 16:21)
కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. (2 సమూయేలు 16:22)
ఇలాంటి ఘోరానికి దావీదు కొడుకు ఎందుకు తెగబడ్డాడు? ఇంతటి ఘోరమైన పరిస్థితి దావీదుకు ఎందుకు వచ్చింది ?
ఫలించిన యెహోవా మాట
నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగా నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.
(2 సమూయేలు 12:11-12)
గతంలో దావీదు బత్సెబా అనే వివాహిత స్త్రీని (హిత్తీయుడైన ఊరియా భార్యని) తన భార్యగా స్వీకరించడం యెహోవాకు ఇష్టం ఉండక, దావీదుకి ఎన్నో శాపనార్ధాలు, వార్నింగ్ లు ఇస్తాడు అందులో ఒక్కటి. పట్టపగలే నీ పెళ్ళాళ్లను అందరూ చూస్తుండగా మాన భంగం చేయిస్తాను అని చెప్పడం. ఆ స్కీమ్ లో భాగంగా దావీదుకి బత్సెబా కి పుట్టిన వరం రోజుల పసికందుని చంపేస్తాడు. దావీదు కొడుకే దావీదు మీద తిరగబడతాడు. ఆఖరికి దావీదు కొడుకే దావీదు ఉపపత్నులను రేప్ చేస్తాడు.
కంటికి కన్ను, పంటికి పల్లు అన్న యెహోవా , రేప్ కి రేప్ యే సమాధానం అనుకున్నాడా?
ఇలాంటి ఘోరమైన శిక్ష దావీదుకు ఎందుకు వేశాడు?
ఒకడి పెళ్ళాన్ని రేప్ చేయడం దావీదు చేసిన తప్పైతే , దావీదు భార్యలను దావీదు కొడుకు తోనే రేప్ చేయించడం సమంజసమేనా?
దేవుడు యిలాంటి ఘోరాలు చేయించవచ్చునా?