
actual words of holy ghost
మరో సారి బయట బడిన బైబిల్ రచయితల డొల్లతనం.
దీనిని బట్టి బైబిల్ దైవ వాక్యంకాదు కొందరు వ్యక్తుల సొంత వాక్యాలు సమాహారం అని అర్ధం అవుతోంది
స్వయంగా పరిశుద్ధ ఆత్మ చెప్పిన మాటలనే సరిగ్గా వినకుండా సొంత మాటలు రాసుకున్న బైబిల్ రచయితలు
సందర్భం:
ఒకానొక సందర్భంలో, యేసు గారికి యోహాను అనే వ్యక్తి బాప్తిజం ఇచ్చిన ( నీటిలో ముంచి తీసిన) సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. యేసు నీటిలో మునిగి పైకి లేచినప్పుడు/లేచిన తర్వాత ఆకాశంలో పరిశుద్ధ ఆత్మ పావురం రూపంలో కనపడింది అని, అప్పుడు ఆకాశం నుండి యేసు “తన కొడుకే” అన్న విషయాన్ని పరిశుద్ధ ఆత్మ కన్ ఫర్మ్ చేసింది అని బైబిల్ రచయితలు రాసుకొచ్చారు.
ఐతే వాళ్ళు రాసిన సువార్తల్లో సొంత వాక్యాలు చేరాయి. అది ఎలాగో చూడండి.
- వెర్షన్ -1
“నీవు నా కొడుకువి”
ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి(లూకా 3:21)
పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. (లూకా 3:22)
and the Holy Spirit descended on him in bodily form like a dove. And a voice came from heaven: “You are my Son, whom I love; with you I am well pleased.” (Luke 3:22)
ఇక్కడ పరిశుద్ధ ఆత్మ యేసుతో “నీవు నా ప్రియ కుమారుడవు” “నీయందు నేనానందించుచున్నాను” అని అన్నట్టు రాసుకున్నారు. అంటే ఇవి యేసుతో చెప్పిన మాటలు/ పర్సన్ టు పర్సన్ ఈ సంభాషణ సాగింది అని అర్ధం. దానినే అక్కడి వారు విని ఉండాలి. తర్వాత బైబిల్లో రాసుకుని ఉండాలి.
- వెర్షన్-2 “ఈయనే నా ప్రియ కుమారుడు”
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.(మత్తయి 3:16)
మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.(మత్తయి 3:17)
And a voice from heaven said, “This is my Son, whom I love; with him I am well pleased.”(Matthew 3:17)
అంతక ముందు “నువ్వు నా ప్రియ కుమారుడవు” అన్న పరిశుద్ధ ఆత్మ ” ఈయనే నా ప్రియా కుమారుడు అని ప్రజలతో అన్నట్టుగా బైబిల్ రచయితలు ఇక్కడ రాసుకున్నారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?
యేసుతో చెప్పబడిన “నువ్వు నా ప్రియ కుమారుడవు” “నీయందు నేనానందించుచున్నానని” అన్నది బైబిల్ రచయితలు/ప్రజలు విన్నారా?
లేక
ప్రజలతో ఈయనే నా ప్రియా కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని అన్నది ప్రజలు/బైబిల్ రచయితలు విన్నారా?
లేక రెండూ కల్పితాలేనా?
లేక బైబిల్ రచయితలకి ఏమైనా వినికిడి సమస్య ఉందా? లేక పరిశుద్ధ ప్రేరణలో ఏమైనా లోపం ఉందా?