Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

హవ్వ ఆదాములతో యెహోవా మాట్లాడిన భాష పై కృపారావు గారికి కౌంటర్

యెహోవా మొదటి మానవ జంట తో ఏ భాషలో మాట్లాడాడు అన్న ప్రశ్నకు Adamic లాంగ్వేజ్ లో యెహోవా హవ్వ ఆదాములతో మాట్లాడాడు అని కృపారావు గారు సమాధానం చెప్పారు.

కానీ Adamic లాంగ్వేజ్ యొక్క లిపి గురుంచి గానీ, Adamic పదలా గురుంచి కానీ, at least అలాంటి భాష ఒకటి ఉంది అని కానీ బైబిల్ నుండి ఒక్క రిఫరెన్స్ కూడా చూపించలేకపోయారు.

కాబట్టి ఆ వాదనని నిరూపించుకోవలసిందిగా కౌంటర్ పోస్ట్ పెడుతున్నాను. ఎందుకు అంటే
Adamic లాంగ్వేజ్ అని ఒకటి బైబిల్ లో ఉంది అని నిరూపించకుండా మీరు మరెన్నో ప్రశ్నలు సంధించారు.
కానీ మీరు లేవనెత్తిన Adamic లాంగ్వేజ్ అనే ఊహాగానం నిజామా ? కాదా అనేది తేలాలి కదా

నా సవాళ్ళకి సమాధానాలు చెప్పండి.

  1. హవ్వ కి ఆదాము EVE అనే పేరు పెట్టినట్టు ఇంగ్లీష్ బిల్ లో ఉంది.

కానీ హవ్వ అని హీబ్రూ , తెలుగు లో హవ్వ , హిందీ లో हौवा అని ఉంది.

ఈ హవ్వ అనే పేరు ఆదాము ఏ భాష నుండి పెట్టాడు. హీబ్రూ నుండి? Adamic లాంగ్వేజ్ నుండి?

ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి. (ఆదికాండము 3:20)

  1. అలాగే ఆదాము భూమి పై ఉన్న 8.7 million జీవరాశికి పేర్లు పెట్టాడు అని బైబిల్ చెప్తోంది.

ఈ పేర్లను ఆదాము ఏ భాషలో పెట్టాడు? హీబ్రూ లోనా? Adamic లాంగ్వేజ్ లోన?
అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. ( ఆదికాండము 2:20)

  1. అలాగే యెహోవా ఆకాశంలోని అన్ని నక్షత్రాలకు పేర్లు పెట్టాడు అని బైబిల్ చెప్తోంది.

ఆ పేర్లను యెహోవా ఏ భాషలో పెట్టాడు? హీబ్రూ లోనా? adamic లాంగ్వేజ్ లోనా?

నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.(కీర్తనల గ్రంథము 147:4)

పై మూడు ప్రశ్నలు భాషా పరమైనవే. Adamic లాంగ్వేజ్ లో హవ్వ పేరు, సమస్త జంతువుల పేర్లు, నక్షత్రాల పేర్లు పెట్టింది వీరే అని ఎవరో ఒకరి పేరు మాత్రమే చెప్పి, ఎక్కడ కూడా భాష పేరు రాయకుండా తప్పించుకుంటే ఎలా?

మీకు అవగాహనా ఉంటె కనుక సమాధానం చెప్పండి. ఆ లిస్ట్ ఏమైనా ఉంటె చూపించండి.

  1. Adamic లాంగ్వేజ్ కి లిపి ఉందా ? ఉండేదా? ఉంటే చూపించండి . ఆ భాష కనుమరుగు అయ్యి హీబ్రూ భాష వచ్చినప్పుడు దేవ భాష నశించిపోయినట్టే అంటారా? మోసేతో మాట్లాడినప్పుడు యెహోవా ఏ భాషలో మాట్లాడాడు?

Adamic లాంగ్వేజ్ కి లిపి ఉందా? అక్షర మాల ఉందా? ఆ భాష ఎలా అంతరించిపోయింది?

లేక హిందువుల దేవభాష సంస్కృతమే ఈ Adamic లాంగ్వేజ్ అనే కొత్త వాదన ఏమైనా చేయబోతున్నారా?

  1. హవ్వ ఆదాముల తర్వాత వచ్చిన మోసే, జీసస్ తో స్వర్గంలో ఏ భాషలో ఏ భాషలో మాట్లాడతాడు?

ఇవేమి చెప్పకుండా ADAMIC LANGUAGE అని ఒక పదం వాడేస్తే సరిపోతుంది అనుకున్నారా? Adamic లాంగ్వేజ్ కి అసలు ప్రామాణికత ఎక్కడ ఉంది ? రెఫరెన్సెస్ లేదా ఎవిడెన్స్ తో సమాధానం ఇవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *