
బైబిల్‌లో దేవుడికి అన్నీ తెలుసు అని చెబుతారు. “నీ నోట మాట రాకముందే నాకు తెలుసు,” “ఆదినుండి అంతమును తెలియజేయువాడను” – ఇలాంటి మాటలు కోకొల్లలు. సరే, అన్నీ తెలుసు అనుకుందాం. అన్నీ ముందే తెలిసినవాడికి అంత కోపం ఉండదు కదా? స్థితప్రజ్ఞత ఉంటుంది కదా? మరి దావీదు బత్షేబాను చూసి పాపం చేయబోతున్నాడని దేవుడికి ముందే తెలుసుగా? అప్పుడే ఎందుకు ఆపలేదు? పాపం చేసేవాడు మనిషే అయినా… ఆ పాపం జరగనివ్వడమే దేవుని పాలసీనా?
ఆసక్తికరంగా, దేవుడు దావీదుతో ముందే చెప్పాడు – “నీ తరువాత నీ సంతానం నా మందిరం కడతాడు” (2 సమూయేలు 7:12–13). ఆ ఆలయం కట్టేది సొలొమోను అని, అతని తల్లి బత్షేబా అని దేవుడికి తెలియదా? తెలిస్తే… ఆమెను దావీదు తీసుకున్నప్పుడు ఆ పాపానికి ఆమె తొలి బిడ్డను ఎందుకు చంపేశాడు?
దావీదు కొడుకును ఎలా చంపాడు? దావీదు, బత్షేబా పాపం చేసిన వెంటనే, ఆమె గర్భవతి అవుతుంది. ప్రవక్త నాతాను దావీదును ప్రశ్నించినప్పుడు, దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అప్పుడు దేవుడు దావీదుతో, “నీవు చేసిన పని యెహోవా దృష్టికి అసహ్యము గనుక నీకు పుట్టబోవు బిడ్డ నిశ్చయముగా చచ్చును” (2 సమూయేలు 12:14) అని చెప్పి, ఆ బిడ్డను తీవ్రమైన రోగంతో బాధపెట్టి, ఏడో రోజున చంపేశాడు (2 సమూయేలు 12:15-18). దావీదు ప్రాధేయపడినా, ఉపవాసమున్నా దేవుడు కనికరించలేదు. ఒక పక్క దేవుడు ముందే ఓ మగబిడ్డ పుట్టాలని అనుకుంటున్నాడు (సొలొమోను), మరో పక్క పక్కవాడి పెళ్లాన్ని తీసుకున్నందుకు ఓ మగబిడ్డని చంపేస్తున్నాడు. ఇదేనా దేవుని ప్లాన్? లేక ఎవడో స్క్రిప్ట్ రాసిన డార్క్ థ్రిల్లరా ఇది?
కుటుంబ సభ్యులను రేప్ చేయించే బదులు … నేరాన్ని ముందే ఆపడం గొప్ప కదా?
2 సమూయేలు 12:11–12 లో ఉంది: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – ఇదిగో నేను నీ యింటివారిలో నుండి నీకు కీడు పుట్టించెదను; నీవు చూచుచుండగా నీ భార్యలను తీసికొని నీ పొరుగువానికి ఇచ్చెదను, వాడు పగటిపూట బహిరంగముగా వారితో శయనించును.” ఇది ఎవరు చేసిన పనైనా కాదు, దేవుడు చేయించబోతున్న పనే! “నీవు రహస్యంగా పాపం చేశావు, కాబట్టి నేను పబ్లిక్‌గా నీ భార్యలతో రేప్ చేయిస్తాను.”
దావీదు ఉపపత్నులను ఎలా రేప్ చేయించాడు? తరువాత కాలంలో, దావీదు కొడుకు అబ్షాలోము తన తండ్రిపై తిరుగుబాటు చేసినప్పుడు, అహిత్తోపెలు అనే సలహాదారు “మీ తండ్రిని ఇశ్రాయేలీయులందరు అసహ్యించుకొనునట్లు అతని ఉపపత్నులలోనికి పొమ్ము” అని సలహా ఇస్తాడు. అబ్షాలోము దానికి ఒప్పుకొని, “పగటిపూట ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా తన తండ్రి ఉపపత్నులయొద్దకు పోవుటకు గుడారము వేయించెను” (2 సమూయేలు 16:21-22). ఇది బహిరంగ రేపే కదా? దేవుడే ఈ “కీడును” పుట్టించానని, రేప్‌ను ఒక శిక్షగా “డిజైన్” చేసి, దానికి తన “సంతకం” ఇచ్చాడని బైబిల్ చెబుతోంది. ఇది దేవుని న్యాయమా? లేక ప్రతీకారమా?
దేవుడు ప్రేమ స్వరూపా? లేక ప్రతీకారవాదా?
“దేవుడు ప్రేమ” (1 యోహాను 4:8), “ప్రభువు దయగలవాడు, కనికరంగలవాడు, కోపించుటకు నెమ్మదిగలవాడు” (కీర్తన 145:8) అని బైబిల్ చెబుతుంది. అయితే… పాపం చేసిన దావీదు బతికే ఉండగా, పాపం జరగగానే ఒక చిన్న పసికందుని చంపడమేంటీ? (2 సమూయేలు 12:15–18) పాపం చేసినవాడు జీవించి ఉన్నాడు, పాపం చేయని పిల్లాడి ప్రాణం తీస్తున్నాడు. ఇది దేవుని న్యాయమా? లేక క్రూరతతో నిండిన divine revenge?
అన్నీ ముందే తెలిసినా తెలియనట్టు ఎంత కోపం చూపించాడు? దావీదు పాపం చేస్తాడని దేవుడికి ముందే తెలుసు. సొలొమోను బత్షేబాకు పుడతాడని కూడా తెలుసు. అయినప్పటికీ, దావీదు పాపం చేసినప్పుడు, దేవుడు ఒక సాధారణ మనిషిలాగా “కోపం”తో రగిలిపోయి, అమాయకుడైన పసికందును చంపడం, ఆపై దావీదు ఉపపత్నులను బహిరంగంగా అవమానించేలా చేయడం చూస్తే, ఆయనకు భవిష్యత్ గురించి తెలిసినా, తెలియనివారిలా వ్యవహరించాడు అనిపిస్తుంది. ముందుగానే అన్నీ తెలిసినవాడు, ఇంత “కోపం” చూపించాల్సిన అవసరం ఏంటి? దీనివల్ల ఆయన జ్ఞానం, స్థితప్రజ్ఞత ప్రశ్నార్థకం కావా?
ఫైనల్ మైండ్‌బ్లాక్ ప్రశ్నలు:
- అన్నీ ముందే తెలిసిన దేవుడు, తప్పును ఆపలేకపోతే… ఆయనకు మనకంటే తక్కువ శక్తి ఉందా?
- పాపాన్ని శిక్షించాలన్న పేరుతో మరొక రేప్ చేయించిన దేవుడు — అదే పాపాన్ని మళ్ళీ ఎందుకు చేయిస్తాడు?
- God is love అంటే… ముద్దుగా బతికే పసికందు మీద కోపం ఎలా వస్తుంది?
ఇక చెప్పండి: ఇది దేవుని ప్రేమనా? ఇది దేవుని జ్ఞానమా? లేక… బైబిల్ పేరుతో గొప్ప divine screenplay రాసిన మనిషి మానసిక ద్వంద్వమేనా?
ఆలోచించండి!
#biblexposer.com