
అంబేద్కర్ గారిపై విషం కక్కే కృపారావు లాంటి క్రైస్తవులకి రమణ జాతీయవాది కౌంటర్
అంబేద్కర్ గారు సమాజంలో వెనకబడిన తరగతుల ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మహాత్ముడు.
కాని అలాంటి వ్యక్తి చివరి రోజుల్లో మతం మారి బౌద్ధం వైపు ప్రయాణించారు. కాబట్టి ఆయన కూడా నరకానికే పోతారు అని ఒక మతం వారి విశ్వాసం.
ఈరోజు ఆ మతం వాళ్ళు ఆ విషయాన్ని దాచిపెట్టి ఆయనపై కపట ప్రేమని చూపిస్తూ పోస్ట్లు పెట్టడమే కాకుండా ఎప్పటిలాగే హిందువులను దూషిస్తున్నారు.
కాబట్టి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్బంగా అంబేద్కర్ గారికి క్రైస్తవులు అందించిన బహుమానం ఎమిటో తెలియబోతున్నాను.
అంబేద్కర్ గారిని నరకంలో వేసే క్రైస్తవ సిద్ధాంతం
రిఫరెన్స్ -1
యేసుని నమ్ముకోని వాళ్లు నిత్య నరకంలో పడతారు
ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు, ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.(2 థెస్సలొనీకయులకు 1:9-10)
రిఫరెన్స్ -2
యేసుని నమ్మకపోతే స్వర్గం చేరలేరు. యెహోవా స్వర్గంలో ఉంటాడు.
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. (యోహాను 14:6)
రిఫరెన్స్ -3
యేసుని నమ్మితే స్వర్గం. అంబేద్కర్ ఒక బుద్దిస్ట్. కాబట్టి అంబేద్కర్ గారికి నరకం తప్పదు
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. (అపో. కార్యములు 4:12)
అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి ఎందరికో మేలు చేసి ఉండవచ్చు. కాని క్రైస్తవులు దృష్టిలో ఆయన కూడా మిగతా మతాల వారిలాగా ఒక పాపి.
మంచితనంతో సంబంధం లేకుండా మతం ఆధారంగా మనుషులని నరకంలో లేదా స్వర్గంలో పడేసే క్రైస్తవ సిద్ధాంతం, అంబేద్కర్ గారికీ రాయితీలు ఇవ్వదు కదా!
కానీ ఈరోజు మీరు అంబేద్కర్ గారిపైన క్రైస్తవులు చూపించే కపట ప్రేమని పోస్టుల రూపంలో చూపిస్తారు. అలాగే హిందువులపై తమ ద్వేషాన్ని చిమ్ముతారు.
ఇలాంటి వారిని ఖచ్చితంగా ఎండగట్టండి.
అంబేద్కర్ గారిని ఈ మతోన్మాదుల నుండి రక్షించండి
అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.
ముఖ్యంగా బైబిల్ ప్రకారం నాతోపాటు నరకానికి రాబోయే అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు