
మరి యేసు కూడా కొన్ని సందర్భాల్లో కోప్పడ్డాడు. అంటే యేసుకి కూడా జ్ఞానం లేదు అని బైబిల్ చెప్తోందా?
ఒక విశ్లేషణ.
అసలు మనిషికి కోపం ఎందుకు వస్తుంది.
నేను చేస్తున్నది, చెబుతున్నది రైట్. మిగతా వాళ్ళది తప్పు అనే జడ్జిమెంట్ నుండి.
ఎవరైతే నేను మాత్రమే కరెక్ట్ అనే నమ్మకం కలిగి ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా కోపం వస్తుంది.
అలాగే అంచనాలు భారీగా ఉండి, అవి జరగకపోయినా కూడా మనిషికి కోపం వస్తుంది.
కానీ బైబిల్ ఏమంటుందో చూడండి.
రిఫరెన్స్ -1
బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును. జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. (సామెతలు 29:11)
A fool gives full vent to his anger, but a wise man keeps himself under control. (Proverbs 29:11)
కేవలం బుద్ధి హీనులు మాత్రమే కోపాన్ని బయటకు చూపిస్తాడు. జ్ఞాని తన కోపాన్ని అణుచుకుంటాడే తప్ప బయటకు చూపించడు అని పై వచనం అర్ధం .
ఫూల్ అనగా బుద్ధిహీనుడు మాత్రమే తన కోపాన్ని బయటకు ప్రదర్శిస్తాడు అన్న మాట నిజం అయితే కోపం చూపే అందరినీ బుద్ధి హీనులు అనవలసి వస్తుంది.
అయితే యేసు కూడా కొన్ని సన్నివేశాల్లో కోపం చూపించినట్టు బైబిల్ చెప్తోంది. ముఖ్యంగా ఈ క్రింది సన్నివేశంలో ..
రిఫరెన్స్ -2
యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను. (మత్తయి 21:12-13)
Jesus entered the temple area and drove out all who were buying and selling there. He overturned the tables of the money-changers and the benches of those selling doves. It is written,” he said to them, My house will be called a house of prayer,- but you are making it a den of robbers. (Matthew 21:12-13)
యెహోవా ఆలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్న చోట ఏసు కోపం కట్టలుతెంచుకుంది. ఒక్కసారిగా “క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోశాడు ” అని బైబిల్ చెప్తోంది.
అలాగే తనకు ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టుని శపించి, మాడిపోయేలా చేశాడు. (మార్కు 11:12-13), (మార్కు 11:20)
ఇలా అనేక సంఘటనల్లో యేసు తన కోపాన్ని ప్రదర్శించాడు. మరి యేసుని “బుద్ధిహీనుడు” అనగలమా ?
కోపం చూపించే ప్రతి ఒక్కడు తన కోపానికి ఏదో ఒక కారణం చెప్తాడు. అలాగే యేసు కోపానికి కూడా ఒక కారణం ఉంటుంది.
మరి
బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును. జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. (సామెతలు 29:11)
అనే వాక్యం ఎందుకు రాసుకున్నట్టు? దీని మర్మం ఏమిటి?