Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

బైబిల్లో యెహోవా చెప్పిన కంటికి కన్ను సిద్ధాంతం

  1. నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి. (ద్వితీయోపదేశకాండము 19:21)

Your eye shall not pity. It shall be life for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot. (Deuteronomy 19:21)

  1. ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను. (లేవీయకాండము 24:19-20)

If anyone injures his neighbour, whatever he has done must be done to him. fracture for fracture, eye for eye, tooth for tooth. As he has injured the other, so he is to be injured. (Leviticus 24:20)

  1. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. (నిర్గమకాండము 21:23-25)

But if there is harm, then you shall pay life for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot, burn for burn, wound for wound, stripe for stripe. ( Exodus 21:23-25)

ఖురాన్ లో అల్లాహ్ చెప్పిన కంటికి కన్ను సిద్ధాంతం

2:177 لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ

మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం- ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే.

2:178 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى ۖ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأُنثَىٰ بِالْأُنثَىٰ ۚ فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ

ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్‌) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని (మాత్రమే) హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తరువాత కూడా ఎవరయినా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది.

2:179 وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ

ఓ బుద్ధిమంతులారా! ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది – ఇలా ఉంటేనే మీరు (అమానుషాల నుండి) ఆగి ఉంటారు.

ఈ సిద్దాంతాన్ని పాటించడం ఇష్టం లేని ఎందరో నహనుభావులు వీటికి వ్యతిరేకంగా గలమేత్తారు.

యేసు ఏం చెప్పారో చూడండి.

  1. కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. ( మత్తయి 5:38-39)

“You have heard that it was said,`Eye for eye, and tooth for tooth. But I tell you, Do not resist an evil person. If someone strikes you on the right cheek, turn to him the other also. (Matthew 5:38-39)

  1. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము. (లూకా 6:29)

If someone strikes you on one cheek, turn to him the other also. If someone takes your cloak, do not stop him from taking your tunic. (Luke 6:29)

యేసు చెప్పిన ఈ మాటలనే గాంధీ లాంటి పెద్దలు కూడా quote చేశారు.

“An eye for an eye will leave the whole world blind.”- Mahatma Gandhi

కంటికి కన్ను అనే సిద్ధాంతం పాటిస్తే లోకం అంతా గుడ్డిదై పోతుంది – మహాత్మా గాంధీ

యేసు మరియు గాంధీ చెప్పిన వాక్యాలు మనకు సమ్మతమేనా? ఇప్పుడు చూద్దాం.

కంటికి కన్ను సిద్ధాంతం ఆచరణ యోగ్యం కాదు అని కొందరు భావిస్తారు. అంతే కాదు కంటికి కన్ను అనేది ఒక పనికిమాలిన సిద్ధాంతం అని భావిస్తారు. అందుకే కొన్ని సినిమాలలో దీనిపై సెటైర్లు కూడా వేస్తూ ఉంటారు.

ఈ వీడియో చూడండి. ఇందులో యెహోవా చెప్పిన కంటికి కన్ను సిద్ధాంతాన్ని ఎద్దేవా చేసిన సంగతి మీరు గమనించవచ్చు, అందుకే చాలా మంది యెహోవా చెప్పిన కంటికి కన్ను సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు.

తప్పు చేసిన క్షమించడం అనేది నేడు గొప్ప విషయమని నేటి కాలంలో భావించబడుతుంది. కంటికి కన్ను అనేది ఒక మతోన్మాద భావనగా భావించబడుతుంది.

ఉదాహరణకు యెహోవా దావీదు భార్యలను దావీదు కొడుకుతోనే రేప్ చేయించడం లాంటి చర్యలు కంటికి కన్ను క్రిందికే వస్తుంది అని మీకు తెలియంది కాదు.

https://biblexposer.com/absalom-rapes-davids-wives/

మరి కంటికి కన్ను సిద్ధాంతం గురించి మీరేమి అనుకుంటున్నారు? తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *