బైబిల్ ప్రకారం గబ్బిలం ఒక పక్షి..!
నిజానికి గబ్బిలం పక్షి (bird ) కాదు. క్షీరదం ( mammal )
ఎగిరే పక్షులు Aves కేటగిరీ లోకి వస్తాయి. గబ్బిలాలు mammal కేటగిరీ లోకి వస్తుంది.
బైబిల్ ప్రకారం గబ్బిలం పక్షి అని ఎక్కడ చెప్పబడింది?
ఎవిడెన్స్ -1
లేవీయకాండము 11:13
పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
….
లేవీయకాండము 11:19
సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.
ఎవిడెన్స్ -2
ద్వితీయోపదేశకాండము 14:11
పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును.
……
అంటూ మొదలు పెట్టిన తినకూడని అపవిత్ర పక్షిగా గబ్బిలాన్ని పేర్కొన్నాడు యెహోవా.
ద్వితీయోపదేశకాండము 14:19
తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి.
కాబట్టి యెహోవా దృష్టిలో గబ్బిలం పక్షి.
Facts :
- పక్షులకు క్షీరదాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. రెండూ వేరు వేరు జాతులు.
- పక్షులు గుడ్లు పెడతాయి. క్షీరదాలు బిడ్డకు గర్భం నుండి నేరుగా జన్మ నిస్తాయి.
- పక్షులు తమ పిల్లలకు పాలు ఇవ్వవు. గబ్బిలాలు మరియు మిగతా క్షీరదాలు తమ పిల్లలకు పాలు ఇస్తాయి.
- గబ్బిలాలకు దంతాలు ఉంటాయి. పదునైన డవడ ఎముక ఉంటుంది. పక్షులకు ముక్కు ( beak ) ఉంటుంది.
కాబట్టి సండే స్కూల్ లో సైన్స్ పాఠాలు కాకుండా స్కూల్ లో చెప్పే సైన్స్ పాఠాలు ఉత్తమమైనవి అని గమనించగలరు.
మరో సైన్స్ పాఠంతో మళ్ళీ కలుద్దాం.