Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్


దైవ ప్రేరణ, లేక మానవ లోపమా? | బైబిల్ వైరుధ్యాల శోధన

క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభం: “దైవ ప్రేరణవలన కలిగిన ప్రతి లేఖనము… ప్రయోజనకరమై యున్నది” (2 తిమోతి 3:16). అంటే, బైబిల్ దేవునిచే ఉద్భవించబడింది, లోపం లేనిది (Inerrant), మరియు సంపూర్ణ సత్యమైనది.

విశ్వాసులు ఈ గ్రంథాన్ని దేవుని సంపూర్ణ వాక్యంగా, ఆరాధనకు అర్హమైన నైతిక మరియు చారిత్రక మార్గదర్శిగా పరిగణిస్తారు.

దైవ ప్రేరణ ఉంటే వైరుధ్యాలు ఎందుకు?

ఒక గ్రంథం “దైవ ప్రేరణవలన” కలిగి ఉండి, దేవుని స్వభావం మరియు ఉద్దేశాలలో సంపూర్ణతను కలిగి ఉన్నట్లయితే, ఆ గ్రంథంలో తప్పులు, లోపాలు, మరియు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఉండకూడదు కదా?

బైబిల్ నిజంగా దైవ ప్రేరణతో కలిగి ఉంటే, వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయి?

ఈ ప్రశ్న అనేకమంది మేధావులను మరియు పరిశోధకులను వేధిస్తోంది. వైరుధ్యాలు అనేవి దైవిక సంపూర్ణతకు భిన్నంగా, మానవ లోపాలకు మరియు చారిత్రక అస్థిరతలకు నిదర్శనం కావా?

వైరుధ్యాల విశ్లేషణ: మా శోధన (Our Analysis of Contradictions)

ఈ వ్యాసాల శ్రేణిలో, బైబిల్ యొక్క ‘దైవ ప్రేరణ’ సిద్ధాంతాన్ని సవాలు చేసే కొన్ని అతి ముఖ్యమైన విభేదాలను, వైరుధ్యాలను మనం నిర్మొహమాటంగా పరిశీలిస్తాం.

  1. నిద్రపోయే దేవుడు: “ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు” (కీర్తనలు 121:4) అని ఒకచోట చెప్పి, మళ్లీ “ప్రభువా, మేల్కొనుము, నీవేల నిద్రించుచున్నావు?” (కీర్తనలు 44:23) అని దేవుణ్ణి నిద్ర లేపమని ప్రార్థించడం – ఈ రెండు వాదనలలో ఏది సత్యం?
  2. రక్షణ మార్గం: రక్షణ విశ్వాసం ఒక్కటే అంటుంది ఒక వచనం. కానీ పశ్చాత్తాపం అవసరం అంటుంది మరొకటి, ఇంకోచోట ఆజ్ఞలు పాటించాలని యేసు చెబుతాడు. రక్షణ మార్గం విషయంలో బైబిల్ ఒక స్పష్టతను ఎందుకు ఇవ్వలేకపోయింది?
  3. నైతిక లోపాలు: యేసు బోధనలు మరియు ఆయన స్వంత చర్యల మధ్య వైరుధ్యం – ఇతరులను దూషించవద్దు అని చెప్పి, ఆయనే ఇతరులను నిందించడం – ఇది దైవిక బోధనలో లోపం కాదా?

ఈ మరియు ఇతర అనేక వైరుధ్యాలను పరిశీలించడం ద్వారా, బైబిల్ యొక్క దైవ ప్రేరణ మరియు అది ఆరాధనకు అర్హత గురించి లోతైన చర్చను ప్రారంభిద్దాం.

latest in contradictions:

అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిన యెహోవా/అబ్రాహాము

అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిన యెహోవా/అబ్రాహాము ?

మోసే తో యెహోవా ఇలా అంటాడు.

నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. (నిర్గమకాండము 6:3)

I appeared to Abraham, to Isaac and to Jacob as God Almighty, but by my name the LORD I did not make myself known to them. (Exodus 6:3)

అంటే అబ్రాహాముకి బైబిల్ దేవుడి పేరు యెహోవా అని తెలియదు అన్నమాట.

కానీ అబ్రాహాము కాలంలో అబ్రాహాము ఒక చోటుకి యెహోవా యీరే అనే పేరు పెట్టాడు అంటోంది బైబిల్

అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. (ఆదికాండము 22:14)

And Abraham called the name of that place Jehovahjireh [that is, The LORD will provide]; as it is said to this day, “In the mount of the LORD it shall be seen. (Genesis 22:14)

అంటే దేవుడి పేరు యెహోవా అని తెలియకుండానే అబ్రాహాము ఆ చోటుకి ” యెహోవా యీరే” అనే పేరుని పెట్టాడా?

ఇదెలా ఉందంటే బ్రహ్మానందం ఎవరో తెలియకుండానే అరగుండు బ్రహ్మానందం అని పేరు పెట్టినట్టు!!!