
“అందరిదీ ఒకదారి అయితే ఉల్లిపొట్టుది ఒక దారి” అన్న సామెత లాగా ఉంటుంది తెలుగు బైబిల్ అనువాదాల పరిస్థితి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బైబిల్ అనువాదకులను కాదని తన సొంత కవిత్వాన్ని /పైత్యాన్ని జోప్పిస్తాడు తెలుగు బైబిల్ అనువాదకుడు.
దానికి మంచి ఉదాహరణగా ఈ బైబిల్ వాక్యాన్ని చూడండి.
కొత్త నిబంధనలోని మత్తయి 24:32 ని గమనిస్తే, ఇందులో వసంత కాలం అని ఉంటుంది. కానీ ప్రపంచంలోని అన్ని బైబిల్స్ లో గ్రీష్మ కాలం అని ఉంటుంది.
ఇంగ్లీష్:
“Now learn this lesson from the fig-tree: As soon as its twigs get tender and its leaves come out, you know that summer is near. (Matthew 24:32)
హిందీ:
अंजीर के पेड़ से यह दृष्टान्त सीखो: जब उस की डाली को मल हो जाती और पत्ते निकलने लगते हैं, तो तुम जान लेते हो, कि ग्रीष्म काल निकट है।
తెలుగు:
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. (మత్తయి 24:32)
ఇలా ఎందుకు ఉంటుందో ఎవరూ చెప్పరు. ఇది కూడా పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో జరిగింది అంటారేమో క్రైస్తవులు.
చూడాలి. వారి స్పందన ఎలా ఉంటుందో.
ఒరిజినల్ గ్రీకు అనువాదాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
https://biblehub.com/text/matthew/24-32.htm
https://www.biblestudytools.com/interlinear-bible/nas/matthew/24-32.html#google_vignette