Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

మనకో న్యాయం పరులకొక న్యాయం తగదు అంటారు. కానీ బైబిల్ దేవుడు అన్యులను ఒకలా క్రైస్తవులను ఒకలా ట్రీట్ చేస్తాడు.

ఇతర దేవతల గుళ్లను రాళ్లు రప్పలు అని వాటిని కూల్చి వేయమంటాడు. తనకోసం మాత్రం ఒక మంచి ఆలయం కట్టమంటాడు. దాన్ని ఎలా కట్టాలో, లెక్కలు కొలతలు కూడా ఇస్తాడు. ఇలాంటి వాళ్లని ఈ కాలంలో సైకో అంటారా లేక మతోన్మాది అంటారా?

ఈ క్రింది రిఫరెన్స్లు చూడండి.

ఇతర దేవతలను ఆరాధించే వారి స్థలాలను కూల్చమంటున్నాడు యెహోవా..

మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలము లన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.

వారి బలి పీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింప జేయవలెను.(Deuteronomy 12:2-3)

ఇలాంటి వాక్యాలు మనకు అనేకం కనిపిస్తాయి బైబిల్ లో.

ఇక తనకు మాత్రం ఒక మంచి దేవాలయం కట్టమని చెప్తున్నాడు యెహోవా.

నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి.
నేను నీకు చూపించే విధంగా మందిరం స్వరూపాన్ని దాని ఉపకరణాలను చెయ్యాలి.
(Exodus 25:8-9)

అయితే ఇతర దేవతలు రాళ్లు రప్పలు.. కానీ ఒక రాయి యెహోవాకి మందిరం అవుతుందిట.

మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.(Genesis 28:22)

ఇతర దేవతల ఆలయాలను కూల్చామని చెప్పే యెహోవాకి తర్వాతి కాలంలో ఆలయం నిర్మించబడి అది అన్యుల పాలైనప్పుడు మాత్రం యెహోవా బాధ వర్ణనాతీతం.

Daniel 5:3

అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి.

ఇక్కడ ఏముంది..

“యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయం”

నీ గుడి మాత్రమే నివాస స్థలం, మరి ఇతర దేవతల గుళ్లు..?
నిన్ను నమ్ముకున్న భక్తులు ఎందుకు ఇతర దేవతల ఆలయాలను ధ్వంసం చేస్తారో ఈ వాక్యాలను చూస్తే అర్థం అవుతుంది.

మతోన్మాదానికి పునాదులు నీ గ్రంధం నిండా ఉన్నాయి. అందుకే నీ భక్తులు అలా ప్రవర్తిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *