

1. ఎద్దుని చంపితే మనిషిని చంపినట్టే!
ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే. గొఱ్ఱె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే. నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి. (యెషయా 66:3).
అరెరే జంతు బలి అంటే యెహోవా కి ఎంత అయిష్టమో అనుకుంటున్నారా?
అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అంటే జంతు బలి లేకపోతే యెహోవాకి ముద్ద దిగదు. జంతు బలి అందులోనూ మూగ జీవాలని దహనబలిగా స్వీకరించడం యెహోవా అత్యంత ఇష్టమైనది.
రిఫరెన్స్:
నెలనెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను, నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను.
(సంఖ్యాకాండము 28:11-12)
యెహోవాకి ఇష్టమైన దహన బలులు
రిఫరెన్స్:
బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. (నిర్గమకాండము 29:18)
యెహోవాకి ఇంపుగా అనిపించే దహన బలి వాసన.
రిఫరెన్స్:
అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించిఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను. (ఆదికాండము 8:21)
ఎద్దుని తనకు దహన బలి ఇమ్మని చెప్తున్న యెహోవా.
రిఫరెన్స్:
చేసిన పాపం పోవాలంటే రోజుకొక ఎద్దుని బలివ్వండి!
ప్రాయశ్చి త్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. (నిర్గమకాండము 29:36)
ఇలా అనేక రిఫరెన్స్ లు యెహోవా స్వయంగా ఎద్దు, గొఱ్ఱె, పావురాలు మొదలైన జంతువులని తనకు బలిగా ఇమ్మని చెప్పాడు అని బైబిల్ లో మనం చూస్తాము.
మరి ఎద్దుని చంపితే మనిషిని చంపినట్టే, గొర్రెని చంపితే కుక్క మెడ విరిచినట్టే.. ఇలాంటి సుత్తి అంతా చెప్తాడేంటి?
ఇదంతా తన ప్రమేయం లేకుండా జరిగినట్టు యెహోవా చెప్పడం అతి పెద్ద అబద్దం. ఎందుకు అంటే ఆదాము, హవ్వ కొడుకుల దగ్గర మొదలు పెట్టి మేరీ వరకు.. అందరి దగ్గర నుండి జంతు బలి వసూలు చేశాడు యెహోవా.
ప్రతి అమావాస్యకి యెహోవా కి జంతుబలి ఇచ్చి తీరాలి. బిడ్డని కన్న ప్రతి తల్లి బలి అర్పించాల్సిందే. జబ్బు తగ్గిన ప్రతి రోగి బలి ఇవ్వాల్సిందే.
ఇలా లక్షల జంతువులని చంపిన యెహోవా, బలి అర్పణ తనకు ఇష్టం లేదని చెప్పడం నిజంగా పెద్ద అబద్దం. లేవీయ కాండం మొదటి అధ్యాయం నుండి మొదలు పెట్టి ఆ అధ్యాయం మొత్తం తనకు బలి ఎలా కావాలో మోరపెట్టుకుంటాడు యెహోవా.
కాబట్టి యెహోవా దేవుడుకి మతిమరుపు అయినా ఉండి వుండాలి. లేదా అబద్దాలు చెప్పే అలవాటైనా ఉండి వుండాలి.
లేకపోతే బైబిల్ రచయితలకి అయినా పిచ్చి ఉండి తీరాలి. బైబిల్ దేవుడు అంటే పూటకో మాట మార్చే దేవుడు. ఇది మాత్రం కంఫర్మ్
bull sacrifice in the bible ramana nationalist www.ramananationalist.in