అన్నా చెల్లెళ్ళు ముద్దు పెట్టుకోవచ్చా?
ఈ ప్రశ్న నాది కాదు ఒక విదేశీయుడు ఆన్లైన్ లో అడిగిన ప్రశ్న. విదేశీయుల విచిత్రమైన ( చెత్త ) ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఏముంటుంది? అందుకే ఒకసారి వాళ్ళ గ్రంధాన్నే పరిశీలించా!
నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు. (పరమగీతము 8:1)
If only you were to me like a brother, who was nursed at my mother-s breasts! Then, if I found you outside, I would kiss you, and no-one would despise me. (Song of Songs 8:1)
“నువ్వు మా అమ్మపాలు తాగిన నా అన్నవైనా బాగుండేది, అప్పుడు నిన్ను నేను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నా ఎవడూ నన్ను ప్రశ్నించేవాడు కాదు”
సమాధానం అయితే పక్కాగా దొరికింది. ఈ వాక్యం బైబిల్ ప్రకారం మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాసింది.
ఆయన దృష్టిలో అన్నా చెల్లెళ్ళు ముద్దు పెట్టుకోవచ్చు. చెల్లెని పెళ్ళాం అనవచ్చు/ పెళ్ళాన్ని చెల్లి అనవచ్చు.
నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి. (పరమగీతము 4:9)
You have stolen my heart, my sister, my bride; you have stolen my heart with one glance of your eyes, with one jewel of your necklace.
(Song of Songs 4:9)
ఏంటో విదేశీ పుస్తకాల్లో అన్నీ విచిత్రమైన వాక్యాలు, వరసలు.
సర్లే సొలొమోను ఏమైనా తప్పుగా సమాధానం చెప్తున్నాడేమో అని అబ్రాహాము దగ్గరకు వచ్చాను.
అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది. (ఆదికాండము 20:12)
Besides, she really is my sister, the daughter of my father though not of my mother; and she became my wife. (Genesis 20:12)
అన్నా చెల్లెళ్ళు ముద్దులు ఏం ఖర్మ, పెళ్లి కూడా చేసుకుంటారా?
పోనీలే అబ్రాహాము కాలానికి ప్రజలంతా అనాగరికులు, దావీదు కాలానికి వద్దాం అని ఆలోచించా!
దావీదు కూతురు తన అన్నతో ఇలా అంటుంది.
2 సమూయేలు 13:13
నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగు దువు; అయితే ఇందునుగూర్చి రాజుతో ( నాన్నతో ) మాటలాడుము. అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను.
అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.
నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడు అని స్వయంగా చెల్లి అన్నతో చెప్పడమా?
ఇక నా వల్ల కాదు.. మీ విదేశీ పుస్తకాన్ని మడిచి ఎక్కడైనా పెట్టుకోండి.
…
https://www.elle.com/life-love/ask-e-jean/advice/a14476/ask-e-jean-kissing-siblings/