యెహోవా ఇచ్చిన వార్నింగ్

తల్లి తండ్రులకు తిండి లేకుండా చేసి, వారి పిల్లల మాంసం  వారే తినేలా చేసే యెహోవా భయహస్తం

(నమ్మని వారికి)

వారు తమ కూమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును”. (యిర్మియా 19:9)

And I will cause them to eat the flesh of their sons and the flesh of their daughters, and they shall eat every one the flesh of his friend in the siege and straits with which their enemies and they that seek their lives shall straiten them.(Jeremiah 19:9)

మనిషి నరమాంస భక్షణ ఎప్పుడు చేస్తాడు?

మనిషికి  ప్రాణాధారమైనది ఆహరం. తిండి లేకుండా నాలుగు రోజులు కడుపు మాడిస్తే సగటు మనుషులు ఎవరైనా సరే దారిలోకి వస్తాడు. అందుకే తనను కాకుండా ఇతర దేవతలను పూజించేవారిని యెహోవా తిండి తిప్పలు లేకుండా హింసిస్తాడు. ఆ హింస ఎంతలా ఉంటుంది అంటే పిల్లలని కన్న తల్లి తండ్రులు తమ పిల్లల మాంసం తామే వండుకుని తినే లాగా. స్నేహితులు తన స్నేహితుడి మాంసం వండుకుని తినేసేలా!

యెహోవా వార్నింగ్ ఇచ్చినట్లు నరమాంస భక్షణ జరగాలి అంటే ముందుగా ఒక ప్రాంతంలో తీవ్రమైన కరువు రావాలి. పంటలు, పొలాలు నాశనం అవ్వాలి. శత్రువులు నాలుగు వైపులా దాడి చేసి అష్టదిగ్బంధం చేసి ఎక్కడికీ పారిపోలేని పరిస్థితులు ఉండాలి. పంటలు పురుగులు పడి నాశనం అవ్వాలి. ఎవరికీ పని దొరకకూడదు. తిండి దొరకకూడదు. అప్పుడే వేరే దారిలేక తమ పిల్లల మాంసం తాము వండుకుని తినే స్థాయికి మనుషులు దిగజారుతారు.

తన మాట వినని మనుషులు నివసించే ప్రాంతాల్లో ముందుగా వర్షాలు పడకుండా చేస్తాడు యెహోవా.

మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను. (లేవీయకాండము 26:19)

నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును. (ద్వితీయోపదేశకాండము 28:23)

యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును. (ద్వితీయోపదేశకాండము 28:24)

ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును. (ద్వితీయోపదేశకాండము 28:40)

భూసారం తగ్గి పంటలు నాశనం అయ్యేలా చేస్తాడు.

మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును. (లేవీయకాండము 26:20)

ఊరిలోకి అడవి మృగాలను రప్పించి, అవిశ్వాసుల పిల్లలను చంపి తినేసేలా, పశువులను నాశనం చేసేలా చేస్తాడు.

మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. (లేవీయకాండము 26:22)

కీటకాల ద్వారా, పురుగుల ద్వారా పంటలు, పొలాలు నాశనం చేస్తాడు.

విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును. (ద్వితీయోపదేశకాండము 28:38)

ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును. (ద్వితీయోపదేశకాండము 28:39)

మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును. (ద్వితీయోపదేశకాండము 28:42)

ఊరిపైకి తెగుళ్లు, రావడం. ఊరిపై శత్రువులు దాడి చేసేలా చేస్తాడు. శత్రువుల చేతికి అందిస్తాడు.

తనకు కోపం రప్పించిన వారిని శత్రువులకు అప్పజెప్పడం యెహోవా కు అలవాటే!

మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయు డైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను. (ఎజ్రా 5:12)

అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు.

మీమీదికి ఖడ్గమును రప్పించె దను; అది నా నిబంధనవిషయమై ప్రతి దండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు.(లేవీయకాండము 26:25)

నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. (ద్వితీయోపదేశకాండము 28:33)

నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొల ముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱ మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. (ద్వితీయోపదేశకాండము 28:51)

ఆహార కొరత ఏర్పడి తిండి దొరకక ఇబ్బంది పడేలా చేస్తాడు.

నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పునమీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు. (లేవీయకాండము 26:26)

నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల

నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను. (లేవీయకాండము 26:27-28)

నీ యెద్దు నీ కన్నులయెదుట వధింపబడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొని పోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱ మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు (ద్వితీయోపదేశకాండము 28:31)

చివరకు అభం శుభం తెలియని పసిపిల్లలను చంపుకుతినే పరిస్థితికి తీసుకువస్తాడు.

మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. (లేవీయకాండము 26:29)

అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు. (ద్వితీయోపదేశకాండము 28:53)

మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మను ష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామము లన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు. (ద్వితీయోపదేశకాండము 28:54-55)

నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్ల లను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును.  (ద్వితీయోపదేశకాండము 28:56-57)

తనను నమ్మని వారిని, తన మాట వినని వారిచేతే వారి పిల్లల మాంసం తినేలా చేస్తాను అని యెహోవా చెప్పిన మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోలేదు. అనేక చోట్ల ఇవి నెరవేరినట్లు బైబిల్ ఘంటాపథంగా చెబుతోంది.

ఒక పిల్లాడి మాంసం వండుకుని తిన్న ఇద్దరు తల్లులు:

ఒకప్పుడు షోమ్రోను అనే పట్టణం శత్రువుల చేత ముట్టడి చేయబడి ఉండింది. పట్టణంలో ఎక్కడ చూసినా  తీవ్రమైన కరువు.  ధరలు ఆకాశాన్ని అంటాయి. జనుల ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు బయలుదేరిన ఇజ్రాయెల్ రాజు గారికి ఒక వింత అనుభవం ఎదురైంది. ఆకలికి తట్టుకోలేక తన కన్నబిడ్డని వంట చేసుకొని తిన్న ఒక తల్లి ఆయనకు ఎదురైంది. ఆమె రాజుతో ఇలా చెప్పింది. “నిన్న నేను ఈమే కలిసి నా కొడుకుని వండుకుని తిన్నాము. ఈరోజు ఆహారానికి తన కొడుకుని ఇవ్వడం లేదు.”  ఆమె మాటలకు విస్తుపోవడం రాజుగారి వంతు ఐంది.  కానీ మీకు యెహోవా సహాయం చేయనప్పుడు నేనెలా సహాయం చెయ్యగలను అని రాజు చేతులెత్తేశాడు.

అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మ బడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి. (2 రాజులు 6:25)

అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచిరాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని (2 రాజులు 6:26)

యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి (2 రాజులు 6:27)

నీ విచారమునకు కారణమేమని యడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు (2 రాజులు 6:28)

మేము నా బిడ్డను వంట చేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. (2 రాజులు 6:29)

రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని యింక ప్రాకారముమీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. (2 రాజులు 6:30)

నోట్:

ఇక్కడ కరువు రావడానికి కారణం శత్రువులు పట్టణంపై దాడి చేసి తిండిలేకుండా చేయడం. శత్రువుల దాడికి, కరువుకి యెహోవా ఆ పట్టణ ప్రజలకు హ్యాండ్ ఇవ్వడమే కారణం. ఆ విషయం రాజు గారి మాటల్లో బయటపడింది. 

The king replied, “If the LORD does not help you, where can I get help for you? From the threshing floor? From the winepress?” (2 Kings 6:27) NIV

ఇది జరగడానికి కారణమైన యెహోవా వాక్కు:

అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు. (ద్వితీయోపదేశకాండము 28:53)


PROOF -2

పంటలు పండక పిల్లలను వండుకుని తిన్న స్త్రీలు

యెహోవా కోపం గురించి తెలుసుకున్న భక్తుడు తల్లులే తమ పిల్లలను వండుకుని తినేలా చేయొద్దు మహాప్రభో అంటూ వేసుకునే రేరెఫెరెన్సు విలాపవాక్యములు అనే గ్రంథంలో మనం చూస్తాము.

నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగువా? (విలాపవాక్యములు 2:20)

“Look, O LORD, and consider: Whom have you ever treated like this? Should women eat their offspring, the children they have cared for? Should priests and prophets be killed in the sanctuary of the Lord? (Lamentations 2:20)

సదరు భక్తుడు చేసిన ప్రార్ధన ఫలించక పోవడం, ఆ తర్వాత కొందరు తల్లులు తమ పిల్లల మాంసం తామే తినడం అదే విలాపవాక్యములు గ్రంధంలో మనం చూస్తాము.

క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించి పోయెదరు ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు. వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. (విలాపవాక్యములు 4:9-10)

Those killed by the sword are better off than those who die of famine; racked with hunger, they waste away for lack of food from the field. With their own hands, compassionate women have cooked their own children, who became their food when my people were destroyed. (Lamentations 4:9-10)

ఇందులో కూడా యెహోవా హస్తం ఉందా? అనే అనుమానం ఉంటే ఈ రిఫరెన్స్ చూడండి.

యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సీయోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను. (విలాపవాక్యములు 4:11)

Note: ఇక్కడ శిశుమాంస భక్షణకు కారణం యెహోవా కోపాగ్ని వలన పంటలు పండగ పోవడం వలన వచ్చిన కరువు అని పై వాక్యాల వలన తెలుస్తోంది.

తనను నమ్మని వారిని, తన మాట వినని వారిని సంతాన రహితులుగా చేసే యెహోవా, పిల్లల మాంసం తల్లులతోనే తినిపించే యెహోవా తన మాట వినేవారికి మాత్రం అభయహస్తం చూపిస్తాడు.

యెహోవాని నమ్ముకున్న వారి పొలాలు సమృద్ధిగా ఉంటాయి. సమయానికి వర్షాలు పడతాయి. పిల్లలను తినే ఖర్మ వారికి పట్టదు.

మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును, (లేవీయకాండము 26:4)

యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు.  (ద్వితీయోపదేశకాండము 28:12)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *