Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

యెహోవా నియమాలు -1 దైవ దూషణ నియమం (Blasphemy ) యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. (లేవీయకాండము 24:16) Anyone who blasphemes the name of the LORD must be put to death. The entire assembly must stone him. Whether an alien or native-born, when he blasphemes the Name, he must be put to death. (Leviticus 24:16)

దైవ దూషణ నియమం (Blasphemy )

యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. (లేవీయకాండము 24:16)

Anyone who blasphemes the name of the LORD must be put to death. The entire assembly must stone him. Whether an alien or native-born, when he blasphemes the Name, he must be put to death. (Leviticus 24:16)

వివరణ:

యెహోవా పెట్టిన నియమాల్లో ఇది ముఖ్యమైనది. ఈ నియమం ప్రకారం ఎవరైనా యెహోవాను తిడితే వారిని ఇజ్రాయెల్ ప్రజలు రాళ్లతో కొట్టి చంపాలి. ఈ నియమం ప్రకారం దైవ దూషణ చేసిన స్వదేశీయులు,పర దేశీయులు కూడా మరణ శిక్షకు అర్హులు. ఇది యెహోవా స్వయంగా పెట్టిన నియమం. శిక్ష అమలు కూడా యెహోవానే చేశాడు. తన ప్రజలతో ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపించాడు.

బైబిల్ రిఫరెన్సులు:

లేవీయకాండము 24:10-23

10. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను.

11. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె
12. యెహోవా యేమి సెల విచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.
13. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
14. శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతు లుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను.
15. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.
16. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను .పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.

(మధ్యలో కొన్ని వేరే నియమాల ప్రస్తావన ఉంటుంది)

Punishment:

మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను.(లేవీయకాండము 24:22)

కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెనుశపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.(లేవీయకాండము 24:23)

IMPORTANCE:

ఈ నియమం అత్యంత ప్రమాదకరమైనది. దీన్ని అడ్డం పెట్టుకొని ఎవరినైనా చంపేయొచ్చు. మా దేవుణ్ణి తిట్టాడు కాబట్టి మేము అతన్ని చంపేశాము అని ఇప్పటికీ కొందరు మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటారు. ఈ నియమం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది.

  1. Now an Israelite woman’s son, whose father was an Egyptian, went out among the people of Israel. And the Israelite woman’s son and a man of Israel fought in the camp,
  2. and the Israelite woman’s son blasphemed the Name and cursed. Then they brought him to Moses. His mother’s name was Shelomith, the daughter of Dibri, of the tribe of Dan.
  3. And they put him in custody, till the will of the LORD should be clear to them.
  4. Then the LORD spoke to Moses, saying,
  5. “Bring out of the camp the one who cursed, and let all who heard him lay their hands on his head, and let all the congregation stone him.
  6. And speak to the people of Israel, saying, Whoever curses his God shall bear his sin.
  7. Whoever blasphemes the name of the LORD shall surely be put to death. All the congregation shall stone him. The sojourner as well as the native, when he blasphemes the Name, shall be put to death.

You are to have the same law for the alien and the native-born. I am the LORD your God. (Leviticus 24:22)

Then Moses spoke to the Israelites, and they took the blasphemer outside the camp and stoned him. The Israelites did as the LORD commanded Moses. (Leviticus 24:23)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *