రంజిత్ ఓఫిర్ గారికి నా బైబిల్ ఎన్కౌంటర్! బైబిల్ ప్రకారం చనిపోయాక ఏమి జరుగుతుంది? RAMANA NATIONALIST COUNTER TO ADDANKI RANJIT OPHIR
May be an image of text

బైబిల్ ప్రకారం చనిపోయాక ఏమి జరుగుతుంది?

దెయ్యాలు ఉన్నాయా? పునర్జన్మలున్నాయా?

బైబిల్ లో ఒక చోట దెయ్యాలు ఉన్నాయంటే మరో చోట లేవు అని ఉంటుంది. ఇవేమి లేవు అంటూ రంజిత్ ఓఫిర్ గారు రెండు వచనాలు చూపిస్తున్నారు.

1. మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును (హెబ్రీయులకు 9:27)

2.లూకా 16:22

ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.

లూకా 16:23

అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి…

కంగారు పడకండి. ఇమేజ్ లో ఉన్న లూకా 16:22,23 వచనాలను కొంచెం మార్చి సొంత కవిత్వం యాడ్ చేశారు.

సరే.. అర్థం మాత్రమే గ్రహించి ఆయన వచనాలకి కౌంటర్ ఇస్తాను.

సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. (మత్తయి 27:52-53)

ఏసుకి సిలువ వేయబడిన తరవాత సమాధుల్లోని చాలా మంది లేచి వచ్చారు కదా.. పాతి పెట్టబడిన వీరి శరీరాలు అంత కాలం కుళ్ళిపోకుండా ఎలా ఉన్నాయి?

చనిపోయి లేచేది ఒక్కసారే అయితే, చచ్చిన వాళ్లంతా మళ్లీ ఎలా లేచారు? పాతాళం నుండి వచ్చారా? పాతాళం అంటే భూమి లోపల 6 అడుగుల గొయ్య మాత్రమేనా?

వీళ్లు ఏసుని నమ్ముకోలేదు కాబట్టి వీళ్ళు నరకం నుండి వచ్చారా? లేక యెహోవాని నమ్మారు కాబట్టి స్వర్గం నుండి వచ్చారా?

…..

యేసు చావు కేకతో బయటకి వచ్చిన దెయ్యాలు!

May be a cartoon of text that says "సమాధులు తెరవబడెను: నిధ్రించిన అనేక మంది పరిశుద్దుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ద పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. (మత్తయి27:52 యేసు చావు కేకతో బయటకు వచ్చిన దెయ్యాలు! క్రైస్తవం Combo Pack =యేసు+ దెయ్యాలు మూడ నమ్మకాలు బైబిల్లో వెరైటీ దెయ్యాలు.. చెవిటి దెయ్యాలు.. మూగ దెయ్యాలు. గుడ్డి దెయ్యాలు. మూర్చ దెయ్యాలు. సాక్ష్యం చెప్పే దెయ్యాలు. కోరికలు కోరే దయ్యాలు. వీధుల్లో తిరిగే దెయ్యాలు. పందులలోకి దూరే దెయ్యాలు.. యేసు ప్రియురాలికి పట్టిన దెయ్యాలు! Ramana Nationalist"

బాగా నవ్వుకోవడానికి పూర్తిగా చదవండి.

బైబిల్ నిండా దెయ్యం కథలే..అన్నీ కామెడీ దెయ్యాలు.

పాత నిబంధనలో యెహోవా సౌలు మీదకి రెండు దెయ్యాలను పంపిస్తాడు. కొత్త నిబంధనలో యేసు దెయ్యాలతో మాట్లాడతాడు. వాళ్లు కోరిన కోర్కెలు తీరుస్తాడు.

అలాగే యేసు చనిపోగానే దెయ్యాలకి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది అంట. సమాధుల్లో నుండి దెయ్యాలు లేచి వీధుల్లోకి వచ్చి జనాలకి కనపడ్డాయాని బైబిల్ సెలవిస్తోంది?

సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. (మత్తయి 27:52-53).

నిజమా? తరువాత ఆ లేచిన దెయ్యాలు ఏమయ్యాయి?

బైబిల్లో ఇంకా చాలా రకాల కామెడీ దెయ్యాలు ఉంటాయి.

1. చెవిటి దెయ్యం:

జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.(మార్కు 9:25)

2. మూగ దెయ్యం.

ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టు చుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాట లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.(లూకా 11:14).

3. గుడ్డి + మూగ దెయ్యం

అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.(మత్తయి 12:22)

4. రోగాలు తెచ్చే దెయ్యాలు.

ఆయన మాటవలన దయ్యములను వెళ్ళ గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.(మత్తయి 8:17).

5. మూర్ఛ + మూగ + చెవిటి దెయ్యం

అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.(మార్కు 9:18).

జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.(మార్కు 9:25).

5. వీధుల్లో తిరిగే దెయ్యాలు.

ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను. (మత్తయి 8:28)

6.సాక్ష్యం చెప్పే దెయ్యాలు.

వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.(మత్తయి 8:29)

7. దెయ్యాల కోరిక తీర్చిన యేసు. పందులలోకి దూరే దెయ్యాలు.

ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.(మత్తయి 8:31).

ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.(మత్తయి 8:32)

8. యేసు ప్రియురాలికి 7 దెయ్యాలు.

పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.(లూకా 8:2)

ఇలా ఎన్నో ఘటనలు బైబిల్ దెయ్యాలనున్నాయని బలంగా నమ్ముతుంది అనడానికి సాక్ష్యం చెప్తున్నాయి.

ఇవి అన్నీ చదివితే మూఢ నమ్మకాలు ప్రభలి ప్రజలు నష్టపోవడం ఖాయం. అయినా సరే జన విజ్ఞాన వేదిక వాళ్లు వీటిని ప్రశ్నించరు.

వాళ్ళ సంగతి సరే.. క్రైస్తవులకి కూడా బుర్రలు లేవా?

Science అంతా క్రైస్తవులే సృష్టించారు కదా… మరి ఈ దెయ్యాలను ఏలా నమ్ముతున్నారు?
యేసు దేవుడు అని నిరూపించున్నదే దెయ్యాల వలన అంటారా?

అయితే బైబిల్ వొట్టి మూఢ నమ్మకాల పుట్ట అని మీరే ఒప్పుకున్నట్టు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *