
మగవాడికి అవసరం లేని తలమీద ముసుగు స్త్రీకి మాత్రమే ఎందుకు?
కొత్త నిబంధనలోని అనేక వివక్షాపూరితమైన వాక్యాల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
ముసుగులేని స్త్రీ తల గుండుతో సమానం:
ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. (1 కోరింథీయులకు 11:5)
ఇంకో వచనం చూడండి.
స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను. (1 కోరింథీయులకు 11:6)
అంటే తల మీద ముసుగు స్త్రీలు వేసుకోకపోతే వాళ్ళు గుండు గీసుకోవాలి అని అర్థం అయింది కదా!
ఇంకొంచెం క్లారిటీ కోసం ఇది చూడండి.
ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.(1 కోరింథీయులకు 11:3)
అంటే స్త్రీకి పురుషుడే యజమాని, మగవాడికి మాత్రం క్రీస్తు యజమాని. కాబట్టి స్త్రీ కంటే పురుషుడు గొప్పవాడు అని తెలియడానికి స్త్రీలు ముసుగు తప్పనిసరిగా వేసుకోవాలి. లేదా గుండు గీసుకోవాలి.
అంత వరకూ అయితే ok, కానీ పురుషుడు తల ముసుగు వేసుకోవడం అవమానం అని చెప్తోంది బైబిల్.
ఏ పురుషుడు తలమీదముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.(1 కోరింథీయులకు 11:4)
మగవాడికి అవమానం అయినది స్త్రీకి మాత్రం గౌరవం ఎలా అవుతుంది?

ఇది కేవలం స్త్రీని తక్కువ చేయడమే!
పైగా మగవాడు దేవుని పోలిక అంట!
ఇక్కడ పోలిక అంటే ఏమిటి? మగవాడి శరీరం లాగా యెహోవా కి కూడా మగ శరీరం ఉంటుందా?
మగవాడు డైరెక్ట్ గా దేవుడు పుట్టిస్తే పుట్టాడు. స్త్రీ మాత్రం మగాడి అవసరం కోసం, మగాడి కోసం పుట్టింది.
ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు. (1 కోరింథీయులకు 11:8-9)
మగాడి కోసం స్త్రీ పుట్టిందే తప్ప, స్త్రీ కోసం మగాడు పుట్టలేదు.
అంటే స్త్రీ పుట్టుకకి మగాడే కారణం తప్ప, ఆమె పుట్టుకకి సరైన కారణం లేదు. ఇంతకంటే స్త్రీలకి అవమానం ఏముంటుంది.
ఇప్పటికి అయిన ఇంతగా అవమానిస్తున్న ” తలమీద ముసుగుని ” తీసివేసి స్త్రీ పురుష సమానత్వాన్ని చాటండి. బానిసత్వాన్ని వీడండి.
ముందు బైబిల్ చదవండి.!