Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

అబీగయీలు దావీదుల ప్రేమ కథ! యెహోవా నడిపించిన వెరైటీ పెళ్లి కథ!



నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. (2 సమూయేలు 12:8)
“నీ మామ గారి భార్యలను, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని నీకు అప్పజెప్పాను. ఇది నీకు చాలదు అంటే ఇంకా ఇస్తాను. “
ఈ మాట యెహోవా ఎందుకు అన్నాడో తెలియాలంటే ఈ కథ అబీగయీలు – దావీదు కథ తెలుసుకోవాల్సిందే!

ఇది యెహోవా దావీదుకి పంపిన మెసేజ్.


ఒక్క మాటలో చెప్పాలంటే నాబాలు అనే వాడిని చంపి యెహోవా దావీదుకు అబీగయీలు అనే అనే ఆమెను భార్యగా ఇచ్చాడు.
పూర్తి కథ ఇక్కడ చూడండి. తరవాత మీరు యెహోవాకు ఏం పేరు పెడతారో అది మీ ఇష్టం.
ఒకప్పుడు నాబాలు అని ధనవంతుడు ఉండేవాడు. వాడికి ఒక అందమైన భార్య కూడా ఉండేది. ఆమె పేరు అబీగయీలు.
REFRENCE : 1 Samuel 25: 1-42
కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱలును వెయ్యి మేకలును ఉండెను. అతడుకర్మెలులో తన గొఱ్ఱల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను.
అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియైయుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతి వాడు.
8 ఒకసారి దావీదుకి నాబాలుకి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీ అంతు చూస్తా అన్నాడు దావీదు.
9 దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునకు తెలియజేసి కూర్చుండగా
10 నాబాలుదావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజ మానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు.
11 నేను సంపాదించుకొనిన అన్నపానము లను, నా గొఱ్ఱలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా…
13 అంతట దావీదు వారితోమీరందరు మీ కత్తులను ధరించుకొను డనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందలమంది బయలుదేరగా రెండువందల మంది సామాను దగ్గర నిలిచిరి.
దావీదు తన భర్తని చంపేస్తాడేమో అని భయపడిన అబీగయీలు, దావీదు దగ్గరకి గాడిద మీద వచ్చింది. ఇద్దరి మనసులు కలిసాయి. దావీదు ముందే అబీగయీలు తన భర్తను తిట్టడటం మొదలు పెట్టింది. ఆమె తెలివితేటలు దావీదుని ఆకట్టుకున్నాయి.
18 అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱల మాంస మును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి
19 మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి
20 గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసి కొనెను.23 అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను
24 నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము.
25 నా యేలిన వాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.

33 నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.

దావీదుని కలిసి మాట్లాడిన సంగతి అబీగయీలు నాబాలుకి చెప్పింది. అప్పటి నుండి 10 రోజులు మంచం పట్టిన నాబాలుని మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు, యెహోవా మొత్తగా అతడు చనిపోవడంతో, దావీడీకి లైన్ క్లియర్ అయింది.
37 ఉదయ మున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముచేత అతని గుండెపగిలెను, అతడు రాతివలె బిగిసికొనిపోయెను.
38 పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.
ఆమె భర్త హానిపోయిన సంగతి తెలుసుకున్న దావీదు అబీగయీలుని పెళ్లి చేసుకోవాలని ఉంది ఆమెకు కబురు పంపగా ఆమె వాయువేగంతో బయలుదేరి రాగా ప్రేమ జంట ఒక్కటయ్యింది. 9 నాబాలు చనిపోయెనని దావీదు వినియెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండ నన్ను కాపాడి, నాబాలువలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసికొనవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను.
40 దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలు నొద్దకు వచ్చిదావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లిచేసికొనుటకై తోడుకొనిరండని పంపెననగా
41 ఆమె లేచి సాగిలపడినా యేలినవాని చిత్తము; నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి
42 త్వరగా లేచి గార్దభముమీద ఎక్కితన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతో కూడ దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను.

…..
ఇప్పుడు చెప్పండి. నీకు ఎంతో మంది స్త్రీలను అప్పజెప్పాను కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని అని తాను చెప్పిన మాటను యెహోవా నిలబెట్టుకున్నాడా లేదా? ఇప్పుడు యెహోవాకు మీరు ఇచ్చే బిరుదు ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *