
బైబిల్ దేవుడు యెహోవా దావీదు యొక్క యజమాని అయిన సాలు గారి భార్యలను దావీదు కౌగిటిలోకి చేర్చాడు అని బైబిల్ చెబుతోంది. అయితే సాలు దావీదుకి అసలు యజమానే కాదు అంటూ కొందరు క్రైస్తవులు వితండవాదం చేస్తున్నారు. వారికి ఇలా సమాధానం చెప్పాలి.
సౌలు దావీదుకి యజమాని అన్న బైబిల్ వాక్యం:
నాతాను దావీదును చూచిఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమ నగాఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకను గ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. (2 సమూయేలు 12:7-8)
Then Nathan said to David, “You are the man! This is what the LORD, the God of Israel, says:`I anointed you king over Israel, and I delivered you from the hand of Saul. I gave your master-s house to you, and your master-s wives into your arms. I gave you the house of Israel and Judah. And if all this had been too little, I would have given you even more. (2 Samuel 12:7-8) English NIV
సౌలు దావీదుకి యజమాని అని నిరూపణ:
1. సౌలు అతనిని చూచిచిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగాదావీదునేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను. (1 సమూయేలు 17:58)
“Whose son are you, young man?” Saul asked him. David said, “I am the son of your servant Jesse of Bethlehem.” (1 Samuel 17:58)
2. “ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా సౌలుఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను. (1 సమూయేలు 17:32-33)
David said to Saul, “Let no-one lose heart on account of this Philistine; your servant will go and fight him.” Saul replied, “You are not able to go out against this Philistine and fight him; you are only a boy, and he has been a fighting man from his youth.” (1 Samuel 17:32-33)
3. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెనుమీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱె పిల్లను ఎత్తికొని పోవుచుండగ నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. (1 సమూయేలు 17:34-35)
But David said to Saul, “Your servant has been keeping his father-s sheep. When a lion or a bear came and carried off a sheep from the flock, I went after it, struck it and rescued the sheep from its mouth. When it turned on me, I seized it by its hair, struck it and killed it. (1 Samuel 17:34-35)
ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. (1 సమూయేలు 24:6)
He said to his men, “The LORD forbid that I should do such a thing to my master, the LORD-s anointed, or lift my hand against him; for he is the anointed of the LORD.” (1 Samuel 24:6)
సౌలుకి సేవ చేసిన దావీదు:
యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు దేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది; మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచా రించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి సౌలుబాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరు డును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా నున్నాడనగా సౌలుయెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపు మనెను. అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను.
దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. (1 సమూయేలు 16:14-21)
అంతట సౌలుదావీదు నా అను గ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్ష యికి వర్తమానము పంపెను. దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. (1 సమూయేలు 16:22-23)
పై వాక్యాలలో దావీదు స్వయంగా తాను సౌలు యొక్క దాసుడిని అని చెప్పుకున్నాడు. అలాగే సౌలు తన యజమాని అని కూడా చెప్పుకున్నాడు. అతనికి సేవలు కూడా చేశాడు. అలాగే యెహోవా కూడా దావీదు కౌగిటిలోకి అతని యొక్క యజమాని భార్యలని చేర్చినట్టు చెప్పాడు.
కాబట్టి ఇకపై ఈ సందేహం ఎవరికీ ఉండబోదు అని ఆశిస్తున్నాను.