సూర్యుడు లేకుండా రోజులు గడిచాయి అంటున్న బైబిల్ సైన్స్
https://www.facebook.com/106914574790243/posts/212144817600551/

సూర్యుడు లేకుండా రోజులు గడిచాయి అంటున్న బైబిల్ సైన్స్!

బైబిల్లోని సృష్టి క్రమం గురించి అడిగిన ప్రతి సారి ఒక కొత్త కథ వినిపిస్తారు పాస్టర్లు.

బైబిల్ లో తప్పుల్ని కవరింగ్ చేయడానికి తమ తెలివితేటలు మొత్తం వాడేస్తూ ఉంటారు పాస్టర్లు. కానీ బైబిల్ లోని బొక్కల్ని పూడ్చటం ఎవరి వల్లా కాదు అన్నది మాత్రం జగమెరిగిన సత్యం.

  1. మొదటి రోజు – భూమి, ఆకాశం, నీరు, వెలుగు, చీకటి
    పగలు, రాత్రి
    ఉదయం, అస్తమం జరిగింది. ఒక రోజు గడిచింది.( ఆదికాండం 1:5)
  2. రెండవ రోజు – నీటిని ( water bodies ) ని వేరు పరచాడు, విశాలం ( ఆకాశాన్ని )సృష్టించాడు.

దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. (ఆదికాండము 1:8)

  1. నీళ్లు అంతా ఒకే చోట చేరి, నేల కనపడాలని చెప్పాడు. ఆరిన నేలకి భూమి అని, నీటి సమూహనికి సముద్రాలని అని పేరు పెట్టాడు. చెట్లను, మొక్కల్ని పుట్టించాడు.

(ఒకే చోట ఉన్న నీటిని – సముద్రం అంటారా? సముద్రాలు అంటారా? అది తరువాత చూద్దాం.)

అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. (ఆదికాండము 1:13)

  1. పగటిని రాత్రిని వేరు పరచడానికి సూర్యుడిని చంద్రుడిని సృష్టించాడు. ఆకాశంలో వాటిని పెట్టాడు.(ఆదికాండము 1:18).

అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. (ఆదికాండము 1:19)

ఇప్పుడు పైన చదివిన సృష్టి క్రమంలో ఉన్న బొక్కలు చూద్దాం.

Problem -1

సూర్యుడు ఎప్పుడు పుట్టాడు?

చీకటి మొదటి నుండి ఉంది. మొదట వెలుగుని సృష్టించాడు. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు.

ఇక్కడ పగలు రాత్రిని / వెలుగు చీకటిని వేరు పరిచాడు కదా!

మళ్లీ ఆదికాండము 1:18 లో పగటిని రాత్రిని వేరు పరచడానికి సూర్యుని చంద్రుడిని పుట్టించి వెలుగుని ( వెలుగుకి అని పగలు అని పేరు ), చీకటిని ( చీకటికి రాత్రి అనే పేరు ) ఎందుకు వేరు పరిచాడు? అది కూడా 3 ఉదయాలు, 3 అస్తమాలు గడిచిన తరువాత!!!

దీనికి పాస్టర్లు చెప్పే సమాధానం ఏమిటంటే..

మొదటి రోజు బైబిల్ దేవుడు వెలుగుని కలిగించాడు. అంటే అప్పుడే సూర్యుడుని పుట్టించాడు. కానీ సూర్యుడు మబ్బుల్లో ఉన్నాడు. 4 వ రోజు యెహోవా పర్మిషన్ ఇవ్వడంతో బయటకి వచ్చాడు.

బాగుంది కదా.. కవరింగ్. అయినా సారి దీనిలో కూడా బొక్కలు ఉన్నాయి. అలా చెప్పుకున్నా కూడా భూమి పుట్టిన తర్వాత మాత్రమే సూర్యుడు పుట్టాడు. అలాగే భూమి కి వెలుగు ఇవ్వడానికి ఒక సహాయకుడిగా సూర్యుడు పుట్టాడు అనుకోవాలి. ఇది సైన్స్ ఒప్పుకోదు. సైన్స్ ప్రకారం ముందు సూర్యుడుf పుట్టాడు.

Problem -2

ఆకాశం ఎప్పుడు పుట్టింది.
మొదటి రోజు భూమిని ఆకాశాన్ని పుట్టించాడు. ( బహుశా అప్పటికి ఇంకా దానికి ఆకాశం అని పేరు పెట్టలేదేమో ).

ఆదికాండము 1:8 లో ఆకాశం అనే పేరు పెట్టడు యెహోవా.

దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.(ఆదికాండము 1:8)

అని ఉంది.

problem -3

భూమి ఎప్పుడు సృష్టించాడు?

మొదటి రోజే! సూర్యుడి తో పాటు భూమిని కూడా పుట్టించాడు. కానీ మళ్ళీ ఆరిన నెలకి భూమి అని పేరు పెట్టాడు యెహోవా మూడో రోజున.

అంటే ఒకే భూమిని రెండు సార్లు, ఒకే ఆకాశాన్ని రెండు సార్లు సృష్టించాడు. సూర్యుడుని( వెలుగుని) కూడా రెండు సార్లు సృష్టించాడా?

సమాధానం :

నిజానికి ఈ సోది అంతా రాసినవి బైబిల్ రచయితలకి ఏమీ తెలియదు. ఇదంతా మన బుర్రలో నుండి వచ్చిన ప్రశ్నలు, సమాధానాలు.

నిజానికి బైబిల్ రచయితలు అంత తెలివైన వాళ్లు కాదు. వాళ్ళ దృష్టిలో రోజులు గడవడానికి సూర్యుడు అవసరం లేదు. వర్షాకాలంలో, తుఫాన్ లాంటి సమయాల్లో అసలు సూర్యుడే కనపడడు. కానీ రోజులు గడుస్తాయి కదా… కాబట్టి పగలు, రాత్రి శాశ్వతం కనుక. వాటిని వాళ్ళ దేవుడు ముందు సృష్టించినట్టు రాసుకున్నారు. ఇవన్నీ జరగాలి అంటే భూమి, ఆకాశం వుండాలి. కాబట్టి వాటిని ఇంకా ముందు సృష్టించినట్టు రాసుకున్నారు.

అంతే.. అవి మట్టి బుర్రలు.. లేకపోతే భూమి తరువాత సూర్యుడు పుట్టాడు అని ఎందుకు రాసుకుంటారు. అక్కడ మొదలైన తప్పు.. మిగతా కథ మొత్తాన్ని చెడగొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *