పెళ్లి చేసుకోవడం పాపమా? అవును.. బైబిల్ ప్రకారం పెళ్లి చేసుకోవడం పాపమే. కావాలంటే ఈ వాక్యం చూడండి. 1 కోరింథీయులకు 7:34 అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.

పెళ్లి చేసుకోవడం పాపమా?

అవును.. బైబిల్ ప్రకారం పెళ్లి చేసుకోవడం పాపమే.

కావాలంటే ఈ వాక్యం చూడండి.

1 కోరింథీయులకు 7:34

అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.

చూశారు కదా..!

ఈ వాక్యంలో “శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు”

శరీర పరంగా, ఆత్మ పరంగా పవిత్రంగా ఉండాలంటే పెళ్లి చేసుకుండా ఏసు గురించి ఆలోచిస్తూ వుండాలి అని చెప్తోంది.

ఇదే వాక్యాన్ని ఎందరో పెళ్లి కానీ అమ్మాయిలకి చెప్పి విదేశాల్లో nun వ్యవస్థని స్థాపించారు.

పేద కుటుంబంలో నుండి వచ్చిన స్త్రీలకి పెళ్లి భారం అయినప్పుడు ఈ వాక్యం చాలా సంతోషాన్ని ఇస్తుంది. పెళ్లి చేసుకొని మొగుణ్ణి సుఖపెట్టే బదులు, యేసయ్యని స్మరించుకుంటే మేలు అనుకునేలా చేస్తుంది. ఫాదర్ మాటలు బాగా పనిచేస్తే Nun గా మారి చర్చి లో ఫ్రీ గా పనిచేయడానికి ఒక స్త్రీ దొరికినట్టే.

అన్నట్టు ఇలాంటి వాక్యాలు మగాళ్ళకి కూడా ఉన్నాయి.

1 కోరింథీయులకు 7:33

పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.

ఈ వాక్యాన్ని నమ్మితే ఇక మగాడు పెళ్ళాం పిల్లల్ని వద్దు అనుకుని, లేదా పెళ్లే వద్దు అనుకొని father అవతారం ఎత్తుతాడు.

పైగా దేవుని కోసం నపుంచకులుగా మారితే స్వర్గం అని మరో వాక్యం కూడా ఉంది.

మత్తయి 19:12

తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసి కొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.

అంటే ఇప్పుడు ఆడ, మగ ఎవరైనా పెళ్లి పెటాకులు మానేసి యేసయ్యా.. యేసయ్యా అంటూ తమ జీవితాన్ని ధారపోస్తే వాళ్ళకి స్వర్గం లభిస్తుంది అన్నమాట!

మరి చర్చి ఫాదర్ లు, పాస్టర్లు క్రైస్తవులకి పెళ్లిళ్లు ఎందుకు చేస్తున్నారు?

దీనికి కూడా సమాధానం చెప్తాను.

ఎందుకు అంటే sex కోరికలు కంట్రోల్ చేసుకోవడం కష్టం కాబట్టి. Sex కోరికల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే పెళ్లి చెసుకోవచ్చు. అని తర్వాత వాక్యాల్లో ఉంటుంది.

1 కోరింథీయులకు 7:36
అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును

కాబట్టి నా కూతురు పెళ్లి చేసుకోకుండా ఉంటే తప్పు చేసేలా ఉంది అనిపిస్తే పెళ్లి చేసేయవచ్చు. అది పాపము కాదు

కానీ పెళ్లి చేసుకుండా ఉంటేనే ఉత్తమం

ఎందుకు అంటే పెళ్లి కానీ స్త్రీ శరీరం విషయంలోనూ, ఆత్మ విషయంలోనూ పవిత్రరాలై ఉంటుంది. కానీ పెళ్లి అయింది కేవలం మొగుడు సుఖం గురుంచి ఆలోచిస్తుంది.

ఇప్పుడు ఇక్కడ పెళ్లి అయిన స్త్రీ పాపాత్మురాలా?
పెళ్లి కాని స్త్రీ పాపాత్మురాలా?

అన్నట్టు ఈ మధ్య కొంత మంది నన్స్ అండ్ ఫాథర్స్ లైంగిక నేరాలతో జైలు పాలు అయ్యారు.

వాళ్లు అలా sex కోరికలు కంట్రోల్ చేయలేక జైలు పాలు అయ్యారా? పెళ్లి తప్పు అనుకోని చర్చి కి వచ్చిన nun లని వాడుకొని పాపము చేశారా? అసలు స్త్రీ అయినా పురుషుడు అయినా sex కోరికల్ని కంట్రోల్ చేసుకోగలరా?

ఏమో.. అంతా ప్రభువు మాయ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *