Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

ఈస్టర్ సండే ఫేక్ -2

యేసు నిజంగానే చనిపోయి లేచాడా? ఆ విషయాలని అప్పటి కాలం రచయితలు కళ్లారా చూసి ఆ విషయాలని బైబిల్లో రాశారా ?

ఈ విషయాలని తెలుసుకోవాలంటే మొదట బైబిల్ తెరవండి.

ఎన్నో విస్తుపోయే నిజాలు మిమ్మల్ని వెక్కిరిస్తాయి.

ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రాయబడిన యేసు పునరుద్ధాన కట్టు కథలు మీ మనసుని గందరగోళంలో పడేస్తాయి.

ఇవన్నీ చదివిన తరవాత యేసు నిజంగానే చచ్చి లేచాడా? అనే అనుమానం రాకమానదు.

ఈస్టర్ గందరగోళంలో ఒక్కో రచయిత ఎలా చెప్పుకొచ్చాడో చూడండి

  1. సమాధి దగ్గరకి వచ్చిన స్త్రీల తర్వాత, యేసు మొదట ఎవరికి కనిపించాడు?

మత్తయి 28:16: పదకొండు మంది శిస్యులకి

(పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి.)

మార్కు 16:12,14: మొదటి ఊరిలోని ఇద్దరికి, తర్వాత 11 మంది శిష్యులకి

(ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను. మార్కు 16:12)
వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.(మార్కు 16:13)

పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను.(మార్కు 16:14)

లూకా 24:13,36: ఎమ్మాయు గ్రామములో ఇద్దరు శిస్యులకు , తర్వాత 11 మంది శిష్యులకి

యోహాను 20:19, 24: పది మంది శిష్యులకు (యూదా మరియు తోమా వారిలో లేరు )

[యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను(యోహాను 20: 24. )]

I Corinthians 15:5: పౌలు గారి మాట ప్రకారం

ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.(1 కోరింథీయులకు 15:5)

12 మంది ? యూదా చనిపోయాడు కదా ?

  1. యేసు మొదట శిష్యులకు ఎక్కడ కనిపించాడు?

మత్తయి 28:16-17: గలిలయలోని కొండ పైన (60-100 మైళ్ళ దూరం )

మార్కు 16:12, 14: ఇద్దరికి ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, పిమ్మట పదునొకండుమంది శిష్యులు
(భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై…)

లూకా 24:31, 36 : ఎమ్మాయి లో సాయంత్రం (7 మైళ్ళ దూరం ) తర్వాత మరికొందరికి జెరూసలేం గదిలో రాత్రి పూట.

యోహాను 20:19 : ఆదివారము సాయంకాలమున

  1. పునరుత్థానం తర్వాత యేసును తాకవచ్చా?

మత్తయి 28:9: ముట్టుకున్నారు

[యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను.వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా .. (మత్తయి 28:9)]

యోహాను 20:17: ఆయన్ని ముట్టుకోకూడదు

యోహాను 20:27: ఆయన్ని ముట్టుకున్నారు (నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి )

  1. యేసు కొంతకాలం భూమిపై ఉన్నాడా?

మార్కు 16:19: లేడు, ఆదివారం రోజే పైకి పోయాడు (స్వర్గానికి )

లూకా 24:50-52 : లేడు ఆదివారం రోజే పైకి పోయాడు (స్వర్గానికి )

యోహాను 20:26, 21:1-22: ఉన్నాడు , కనీశం 8 రోజులైనా

అపొ. కార్యములు 1:3 : 40 రోజులు భూమి పై ఉన్నాడు

ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.

  1. ఆరోహణం ఎక్కడ జరిగింది?

మత్తయి : ఆరోహణ జరిగినట్టు లేదు. గెలిలీ కొండపైన ఉండగానే చాప్టర్ పుస్తక సమాప్తం

మార్కు 16:19: జెరూసలేం లోపల కానీ బయట కానీ

లూకా 24:50-51: బెథానీలో (జెరూసలేం కి బాగా దగ్గర ) రాత్రి భోజన సమయం తర్వాత

యోహాను : ఆరోహణం ప్రస్తావన లేదు

పౌలు : ఆరోహణ ప్రస్తావన లేదు

అపొ. కార్యములు 1:9-12 : ఒలీవ పర్వతం పైన

గమనిక : పై విషయాలు అన్ని గమనిస్తే ఏ ఒక్క రచయితకి ఏసు ఎప్పుడు సమాధి నుండి లేచాడు? అక్కడ ఏం జరిగింది? అక్కడ ఎవరున్నారు?

అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్న విషయాలపై క్లారిటీ లేదు.

వీళ్ళు రాసిన కథల పుస్తకాలని నమ్మి మీ జీవితాలని పణంగా పెడుతున్నారేమో ఆలోచించండి.

ఎందుకంటే నిజం అనేది ఎపుడూ ఒకటే ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉండదు .

ఇదే టాపిక్ పై పార్ట్-1 LINK

https://ramananationalist.in/easter-sunday-exposed/
THANKS FOR READING

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *