అవును. క్రైస్తవుల బైబిల్ ప్రకారం దెయ్యం పడితే మనుషులు మూగవాళ్ళు అయిపోతారు.
మళ్ళీ ఆ దెయ్యం వదిలిపోగానే మాటలు వచ్చేస్తాయి.
అయితే ఈ భూత వైద్యం కేవలం మూగతనాన్నే కాదు గుడ్డి, చెవిటి, పక్షవాతం, పీరియడ్స్ ప్రాబ్లెమ్స్, ఫిస్ట్, నరాల బలహీనత మొదలైన అన్ని జబ్బులకి పనిచేస్తుంది.
(రిఫరెన్స్ లు ఆఖరిలో ఇస్తాను)
యేసు భూత వైద్యం వెనుక ప్లాన్ ఏమిటి?
యేసు, తాను దేవుడ్ని అని యూదులని నమ్మించడానికి ఎంచుకున్న మార్గాల్లో భూత వైద్యం ఒక్కటి. ఉమ్మి వేసి వైద్యం చేయడం, గట్టిగా అరిచి దెయ్యాలని వదలగొట్టడం ఇలాంటి పనులు యేసు చేసేవాడు. అయితే భూత వైద్యం చేస్తే యేసు దేవుడు/దేవుని కొడుకు అయిపోతాడా?
అవుతాడు. ఎందుకు అంటే దెయ్యాలని కంట్రోల్ చేయగలిగే శక్తి యెహోవా కి ఉంది. అతను దెయ్యాలను మనుషుల్లోకి పంపించగలడు. మళ్ళీ బయటకు పంపించేయగలడు అని యూదుల నమ్మకం.
సౌలు శరీరంలోకి ప్రేతాత్మ ని పంపి, మళ్ళీ తొలగించిన యెహోవా:
యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులుదేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది.
(1 సమూయేలు 16:14-15)
కాబట్టి యేసు కూడా దేవుని కుమారుడు కావాలంటే దెయ్యాలని వదలగొట్టాలి.
అయితే యేసు దెయ్యాలని వదలగొట్టడం మొదలు పెట్టాక మరో విషయం బయటపడింది.
బయెల్జెబూలు అనే దేవత కూడా దెయ్యాలని కంట్రోల్ చేయగలదు. యూదులు, యేసు కూడా ఆ దేవత అనుచరుడు అనుకున్నారు. కానీ యేసు నేను దేవుని కొడుకుని కాబట్టి దెయ్యాలని వదిలిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. అందుకోసం దెయ్యం పట్టిన ( రోగం వచ్చిన వాళ్లని ) నయం చేస్తున్నట్టు శిష్యులతో డ్రామా స్టార్ట్ చేశారు.
మత్తయి 12:24
పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్య ములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.
మత్తయి 12:27
నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు.
మత్తయి 12:28
దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది.
నిజానికి దెయ్యం పట్టడం అనేది ఒక నరాల బలహీనత. అది హిస్టీరియా అనే మానసిక వ్యాధి.
ఇశ్రాయేలులో అది ఒక సాధారణ జబ్బు.
కాని విచిత్రం ఏమిటంటే, జనం నవ్వుతారు అని కూడా తెలుసుకోకుండా రకరకాల వింత దెయ్యాలని సృష్టించి వాటి వల్లనే ఈ రోగాలు వచ్చాయని, యేసు అండ్ బ్యాచ్ జనాలని మూఢ నమ్మకాల్లో ముంచి దశమ భాగాలు వసూలు చేశారు. ఈ ఆచారం ఇప్పటికి కొనసాగడం గమనార్హం.
రిఫరెన్స్ లు :
- చెవిటి తనానికి భూత వైద్యం
జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.(మార్కు 9:25)
- మూగ తనానికి భూత వైద్యం
ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టు చుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాట లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.(లూకా 11:14).
- గుడ్డి + మూగ తనాలకి భూత వైద్యం
అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.(మత్తయి 12:22)
- మూర్ఛ + మూగ + చెవిటి తనానికి భూత వైద్యం
అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.(మార్కు 9:18).
జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.(మార్కు 9:25).
ఫిస్ట్ వస్తే కూడా దెయ్యం పట్టింది అనుకున్న ఇశ్రాయేలు ప్రజలు
ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదల కుండును.(లూకా 9:39)
నురగలు కారుతోంది అంటే ఏంటి? అతనికి ఫీట్స్ వచ్చాయని అర్థం కదా! మరి వీళ్లేంటి దెయ్యం పట్టింది అంటున్నారు. వీళ్ళు సరే వెర్రి మాలోకాలు. యేసు కూడా దీన్ని దెయ్యం కింద జమ కట్టి భూత వైద్యం చేశాడు.
ఇప్పటికైనా దెయ్యాలు పట్టడం అనేది మూఢ నమ్మకం అని ప్రజలు గ్రహించాలి.
ఒకవేళ నిజంగానే దెయ్యాల వల్లనే మూగతనం వస్తే, పాస్టర్ లు ప్రార్ధనలు చేసి మూగవాళ్ళతో మాట్లాడించగలరా?