యెహోవా కంటికి కన్ను సిద్ధాంతాన్ని క్రైస్తవులు పాటించాలా? పాటించకూడదా?

పాత నిబంధనలో యెహోవా పెట్టిన అనేక నియమాలలో ఒకటి. కంటికి కన్ను సిద్ధాంతం. అయితే దీన్ని తరువాత కాలంలో యేసు కొట్టిపారేశాడు.

యేసు – యెహోవా ఒక్కరే అని క్రైస్తవుల నమ్మకం కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఆజ్ఞల్లో దీనిని క్రైస్తవులు పాటించాలి? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అందుకే ఈ పోస్టు.

యెహోవా కంటికి కన్ను సిద్ధాంతం ఎక్కడ చెప్పాడు?

  1. నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి. (ద్వితీయోపదేశకాండము 19:21)

Your eye shall not pity. It shall be life for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot. (Deuteronomy 19:21)

  1. ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను. (లేవీయకాండము 24:19-20)

If anyone injures his neighbour, whatever he has done must be done to him. fracture for fracture, eye for eye, tooth for tooth. As he has injured the other, so he is to be injured. (Leviticus 24:20)

  1. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. (నిర్గమకాండము 21:23-25)

But if there is harm, then you shall pay life for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot, burn for burn, wound for wound, stripe for stripe. ( Exodus 21:23-25)

ఈ రిఫరెన్స్ ల ప్రకారం కంటికి కన్ను అనే ప్రత్తిపాదన చేసింది యెహోవా నే అని తెలుస్తోంది. యెహోవా చెప్తేనే మోసే లాంటి ప్రజలకు బోధించారు అని బైబిల్ చెప్తోంది కదా. దేవుడు తన మాటనే ప్రవక్తల ద్వారా చెప్పించాడు అంటారు సగటు క్రైస్తవులు.

ఇక యేసు ఏం చెప్పారో చూడండి.

కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. ( మత్తయి 5:38-39)

“You have heard that it was said,`Eye for eye, and tooth for tooth. But I tell you, Do not resist an evil person. If someone strikes you on the right cheek, turn to him the other also. (Matthew 5:38-39)

  1. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము. (లూకా 6:29)

If someone strikes you on one cheek, turn to him the other also. If someone takes your cloak, do not stop him from taking your tunic. (Luke 6:29)

యేసు చెప్పిన ఈ మాటలనే గాంధీ లాంటి పెద్దలు కూడా quote చేశారు.

“An eye for an eye will leave the whole world blind.”- Mahatma Gandhi

కంటికి కన్ను అనే సిద్ధాంతం పాటిస్తే లోకం అంతా గుడ్డిదై పోతుంది – మహాత్మా గాంధీ

ఇప్పుడు క్రైస్తవులు యెహోవా చెప్పిన మాట వినాలా? యేసు చెప్పిన మాట వినాలా? గాంధీ గారిని ఫాలో అవ్వాలా?

Hint : ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. (మత్తయి 5:17)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *