Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

బైబిల్ ప్రకారం ఇనుము ఎప్పుడు కనుక్కోబడింది? గంటా కృపారావుగారి లోగిక్స్ ప్రకారం బైబిల్ ఫేక్ హ? 3300-1200 BCE సంవత్సరాల కాలంలో కాంస్య యుగం అని ఆ తర్వాతనే ఇనుము కనుకోబడింది అని గంటా కృపారావు గారు పోస్ట్ పెట్టి సెలవిచ్చారు. కాబట్టి అంతకంటే ముందు ఇనుము మరియు ఇతర లోహాలు వాడినట్టు రాయబడినట్టు చెప్పబడే హిందూ గ్రంధాలు అన్నీ తప్పు అని గంటా కృపారావు గారి అభిప్రాయం. బాగుంది. అంటే ఆయన లెక్కప్రకారం ఎక్కడైనా 1200 BCE కంటే ముందు ఇనుము వాడినట్టు కానీ 3300 BCE కాలం కంటే ముందు రాగి వాడినట్టు కానీ రాయబడి ఉంటే ఆ కథలన్నీ ఫేక్ . అని గంటా కృపారావు గారి నిశ్చితాభిప్రాయం.

3300-1200 BCE సంవత్సరాల కాలంలో కాంస్య యుగం అని ఆ తర్వాతనే ఇనుము కనుక్కోబడింది అని గంటా కృపారావు గారు పోస్ట్ పెట్టి సెలవిచ్చారు. కాబట్టి అంతకంటే ముందు ఇనుము మరియు ఇతర లోహాలు వాడినట్టు రాయబడినట్టు చెప్పబడే హిందూ గ్రంధాలు అన్నీ తప్పు అని గంటా కృపారావు గారి అభిప్రాయం. బాగుంది.

అంటే ఆయన లెక్కప్రకారం ఎక్కడైనా 1200 BCE కంటే ముందు ఇనుము వాడినట్టు కానీ 3300 BCE కాలం కంటే ముందు రాగి వాడినట్టు కానీ రాయబడి ఉంటే ఆ కథలన్నీ ఫేక్ . అని గంటా కృపారావు గారి నిశ్చితాభిప్రాయం.

మరి అదే విషయం బైబిల్లో ఉంటే ఆయన ఏం చేస్తారు?

బైబిల్లో ఏముందో చూద్దాం.

మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా. (ఆదికాండము 4:22)

Zillah also had a son, Tubal-Cain, who forged all kinds of tools out of bronze and iron. Tubal-Cain-s sister was Naamah. (Genesis 4:22) NIV

And Zillah, she also bare Tubalcain, an instructer of every artificer in brass and iron: and the sister of Tubalcain was Naamah. ( (Genesis 4:22) KJV

ఇక్కడ తెలుగులో రాగి అని ఉన్నపటికీ అది కంచు (BRONZE ) అని ఆంగ్ల అనువాదం ద్వారా తెలుస్తోంది. తూబల్కయీను అనే వ్యక్తి ఇనుము, రాగి (కంచు) పని ముట్లన్నిటిని వాడినట్టు తెలుస్తోంది. అంటే ఈ వ్యక్తి బతికిన కాలం కూడా 3300 -1200 మధ్యలో ఉండి ఉండాలి. అంత కంటే ముందు కాలం వాడు అయితే గంటా కృపారావు గారి వాదన తప్పు అవుతుంది. ఆయన ఏ చరిత్రకారుల , పురావస్తుశాఖ వారి వాదనని ఇక్కడ బలంగా వినిపించాడో అది కూడా తప్పు అవుతుంది.

కాబట్టి మొదటి సారి ఇనుము, కంచు (BRONZE ) వాడినట్టు చెప్పబడుతున్న ఆదికాండము 4:22 కాలం నాటి తూబల్కయీను అనే వ్యక్తి 3300 -1200 BCE కాలంలో ఉండేవాడు అని అనుకుంటూ ముందుకు వెళదాం.

తూబల్కయీను 3300-1200 BCE కాలం వాడు అయితే అతని కంటే లేటుగా పుట్టిన నోవహు ఏ కాలం వాడు? 1200BCE తర్వాతనే కదా !

మరి 1200 BCE కాలం తర్వాత ప్రపంచం మొత్తం జలప్రళయంలో మునిగిపోయినట్టు ఎక్కడా ఎందుకు రాయబడ లేదు?

రీసెంట్ గా (1200 BCE) తర్వాత జలప్రళయం సంభవించినట్టు పురావస్తు ఆనవాళ్లు ఎక్కడా ఎందుకు లభించడం లేదు?

1200 BCE తర్వాత జలప్రళయం జరిగి అందులో బతికిన 10 మంది మనుషుల 3200 సంవత్సరాల్లోనే భూమి పైన ఇంత జనాభా పెరిగిందా?

జలప్రళయం జరిగినట్టు నిరూపించలేక పోతే బైబిల్ తప్పు అని ఒప్పుకుంటారా ?

1200 BCE తర్వాత జలప్రళయం వచ్చి 10 మంది మనుషులు మాత్రమే మిగిలి మళ్ళీ ఇంత విజ్ఞానం కేవలం 3200 సంవత్సరాల్లో సంపాదించుకోగలిగారా ?

ఏ ఒక్క ప్రశ్నకైనా బైబిల్ నుండి సమాధానం చెప్పండి గంటా కృపారావు గారు.

మీ ప్రశ్న, మీ అభిప్రాయం బైబిల్ నే తప్పు అని నిరూపిస్తే అది నా తప్పు కాదు అని మనవి చేసుకుంటూ మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ

మీ శ్రేయోభిలాషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *