అబద్దం చెప్పిన యెహోవా, నిజం కక్కించిన సైతాను!
ఏదేను తోటలో ఉన్న జ్ఞానఫలం తింటే చస్తారు అని హవ్వ ఆదాములనువ్వు భయపెడతాడు బైబిల్ దేవుడు యెహోవా.అప్పుడు రంగంలోకి తీగుతాడు సైతాను. ఏదోలా కన్విన్స్ చేసి హవ్వ ఆదాముల చేత పండు తినిపిస్తాడు. దాంతో వాళ్లకు జ్ఞానం వచ్చేస్తుంది. దాంతో కోపం వస్తుంది. క్లుప్తంగా ఇది కథ…..
మొదటి lie detection Test :అయితే యెహోవా చెప్పినట్టు ఆ పండు తిన్న రోజున హవ్వ ఆదాములు చావరు. పైగా 950 ఏళ్ల వరకూ ఆదాము బతికాడు అని బైబిల్ చెప్తోంది. ఇది అందరూ చెప్పుకునేదే. ఇది ఒక అబద్దం.అయితే సైతాను యెహోవా అబద్దం చెప్పిన సంగతి యెహోవాతోనే చెప్పింది.. బెస్ట్ lie detecter అనిపించుకుంది.
రిఫరెన్స్ :యెహోవా ఇలా చెప్పాడు.అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. (ఆదికాండము 2:17)
అయితే సైతాను ఇది అబద్దం అని హవ్వ ఆదాములతో చెప్పింది.సైతాను ఏం చెప్పిందో చూద్దాము.ఆదికాండము 3:4-5అందుకు సర్పము మీరు చావనే చావరు.ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా..
అర్ధం అయింది కదా మీరు చావరు, పైగా మీరు దేవతల వలే అవుతారు అని చెప్పింది సైతాను.తర్వాత పండు తినడం ఆ కథ అంతా మీకు తెలుసు.
యెహోవా తాను చెప్పిన అబద్దాన్ని ఇలా ఒప్పుకున్నాడు.
అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.( ఆదికాండము 3:22-23)
ఇక్కడ మనలో ఒకని వంటి వాడు ఆయెను.మనలో అంటే యెహోవాతో పాటు ఇతర దేవతల వలే అని అర్ధం.కొందరు.. ఇక్కడ మనలో అంటే యేసు & యెహోవా అంటారు. అలా చూసిన దేవతల వలే అనే అర్ధమే వస్తుంది. కాకపోతే క్రైస్తవులు కూడా ఎక్కువ మంది దేవుళ్ళని పూజించే వాళ్లు అని ఒప్పుకోవాల్సి వస్తుంది.
కాబట్టి సైతాను ( ఆదికాండం 2:17లో ) చెప్పినట్టు వాళ్ళు దేవతల వలే అయ్యారు అని యెహోవా ఒప్పుకున్నాడు కాబట్టి యెహోవా అబద్ధం చెప్పాడు అని కంఫర్మ్ అయింది.అయితే మరో మెలిక ఉంది.అబద్దాలు చెప్పేవాడు దేవుడే కాదు అంటాడు యెహోవా.
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యాకాండము 23:19)
కాబట్టి యెహోవా దేవుడే కాదు అని సైతాను నిరూపించాడు అన్నమాట!
గ్రేట్ కదా!!!
మీకు ఓపిక ఉంటే ఇదే logic ప్రకారం యేసు కూడా దేవుడు కాదు అని నిరూపించే పోస్ట్ ఇంకొకటి ఉంది. అది కూడా చూడండి.
