What Bible lied about the sun

సూర్యుడు ఎప్పుడు సృష్టించబడ్డాడు – భూమి పుట్టిన తర్వాతే
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.(ఆదికాండము 1:1)
దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. (ఆదికాండము 1:14-19)
అంటే సూర్యుడు సృష్టించబడక 4 రోజుల మునుపే భూమి సృష్టించబడింది. భూమికి వెలుగు ఇవ్వడం కోసమే సూర్యుడు సృష్టించబడ్డాడు. సూర్యుడు లేకుండా నాలుగు రోజులు గడిచాయి అన్న విషయంలో మీకు సందేహం వచ్చి ఉంటే దాన్ని అలాగే ఉంచండి. మా క్రైస్తవులు వచ్చి మంచి కవరింగ్ ఇస్తారు.
సూర్యుడు ఎందుకు సృష్టించబడ్డాడు?
దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని (సూర్యుడిని) రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని(చంద్రుడిని) నక్షత్రములను చేసెను.(ఆదికాండము 1:16) అంటే భూమికి వెలుగు ఇవ్వడానికి సూర్యుడిని పుట్టించాడు.
సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడా?
సూర్యుడుద యించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.(ప్రసంగి 1:5) ఇక్కడ సూర్యుడు ఉదయించే చోటుకి వెళ్ళడానికి త్వరపడడు అన్నారు. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.(యెహోషువ 10:13) ఇక్కడ ఒక రోజంతా సూర్యుడు అస్తమించడానికి త్వర పడలేదు అన్నారు. పై రెండు సందర్భాల్లో సూర్యుడు తన పని ( ఉదయించడం, అస్తమించడం ) పూర్తి చేయడానికి తొందర పడటం గురించి చెప్పబడింది. అంటే ఇక్కడ తిరుగుతున్నది సూర్యుడే. లాగె సూర్యుడిని ఆగిపోమ్మని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అప్పటివరకు తిరుగుతున్నది సూర్యుడే అని అందరికి అర్థం అవుతుంది. మరో సందర్భం చూద్దాము. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును.(యోబు 9:7) యెహోవా చెప్తే సూర్యుడు ఆగిపోవడమే కాదు ఉదయించడం కూడా మానేస్తాడంట. కాబట్టి తిరుగుతున్నది సూర్యుడే అని అర్థం అవుతోంది. ఫైనల్ గా ఇంకో ఉదాహరణ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును.(ఆమోసు 8:9) మధ్యాహ్నం పూట కూడా సూర్యుడు యెహోవా చెప్తే అస్తమిస్తాడు అంట.. అయితే తిరుగుతున్నది సూర్యుడే అని నిర్ధారించుకోవడం అయినది.
4. సూర్యుడు ఎక్కడ ఉంటాడు?
వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.(కీర్తనల గ్రంథము 19:4) గుడారం అంటే Tent అయితే అది ఎక్కడుందో నాకు ఐతే తెలియదు. బహుశా ఆకాశంలో వేసి ఉంటాడు.
5. సూర్యుడు మాట్లాడతాడా? పాటలు కూడా పడతాడా?
సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.(కీర్తనల గ్రంథము 148:3).నోరులేని సూర్య చంద్ర నక్షత్రాలు యెహోవా గురించి చర్చిలో పడినట్టు ఎలా పాటలు పాటి స్తుతిస్తారో, అసలు వాటికి బ్రెయిన్ ఉందా? పోనీ ఇలా రాసిన వాడికి అయినా ఉందా? చూశారు కదా.. బైబిల్ ఎన్ని అబద్ధాలు చెప్తుందో.. ఇదే దైవ గ్రంధం ఐతే ఇందులో ఇన్న అబద్ధాలు ఎందుకు ఉంటాయి?సూర్యుడు చుట్టు భూమి తిరుగుతుంది అని చెప్పిన ఎందరూ శాస్త్రవేత్తలని క్రైస్తవ మతోన్మాదులు చంపింది అందుకే. బైబిల్ లోని భూకేంద్రిక సిద్ధాంతం ఎప్పుడో కొట్టివేశారు శాస్త్రవేత్తలు.
మరికొన్ని ఆణిముత్యాలు చూద్దాం.
అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసిఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను. (ఆదికాండము 37:9)ఇది కల అన్నాడు కాబట్టి ok. లేకపోతే సూర్యుడు, చంద్రుడు,నక్షత్రాలు సాష్టాంగ నమస్కారం చేస్తాయి అన్నందుకు డిప్ప పగిలేది.నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు. (కీర్తనల గ్రంథము 147:4 )Astronomers estimate there are about 100 thousand million stars in the Milky Way alone. Outside that, there are millions upon millions of other galaxies also!ఇన్ని నక్షత్రాలకి పేర్లు పెట్టడం అంటే మాటలా నువ్వు రియల్లీ గ్రేట్. ఆ పేర్లు ఏమిటో కూడా బైబిల్ లో పెట్టి ఉంటే బాగుండేది.పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను. (ప్రకటన గ్రంథం 6:13)అంటే నక్షత్రాలు భూమి కన్నా చిన్నవా? భూమికి అంత గ్రావిటీ ఉందా?ఇలాంటి అబద్ధాలు ఎన్నో బైబిల్ బోదిస్తుంది. దాన్ని పట్టుకొని దైవ గ్రంధం అనడం అంటే మీరు నమ్మే దేవుడు కూడా అబద్దాలు చెప్తున్నాడు అని అర్థం వస్తుంది.