god and satan both are friends

god and satan both are friends

యోబు అనే భక్తుడి జీవితంతో ఆడుకున్న సైతాను మరియు యెహోవా! god and satan both are friends

సాధారణంగా భక్తులకు సాతాను వలన వచ్చే కష్టాలను యెహోవా తప్పిస్తాడు అనేది భక్తుల విశ్వాసం.

ఐతే బైబిల్లో దేవుడే భక్తుడి కుటుంబం పైన పందెం కాయడం ఒక వింత.

ద్రౌపదిని, రాజ్యాన్ని జూదంలో పెట్టిన ధర్మ రాజులాగా, యెహోవా తన భక్తుడైన యోబు కుటుంబంపై bet కాస్తాడు.

ఫలితంగా యోబు తన కుటుంబ సభ్యులను, తనకున్న సర్వస్వాన్ని కోల్పోతాడు.  దేవుడు మరియు సాతాను యోబు ఏడుగురు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలను చంపారని మనకు తెలుసు. అయితే యోబు చాలా మంది బానిసలను కూడా కలిగి ఉన్నాడు, వారు సాతానుతో దేవుని పందెంలో చంపబడ్డారు, అయితే బైబిల్ ఎంతమందిని చెప్పలేదు. 50 మంది బానిసలు చనిపోయారని నేను ఊహిస్తాను.

ఇక అసలు కథలోకి వెళదాం.

ఒకరోజు యెహోవా ఆకాశంలో తన దేవదూతలతో మీటింగ్ పెట్టుకుంటాడు. అక్కడకి అయన ప్రియతమ దేవదూత అయిన సైతాను కూడా వస్తాడు. వారిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత భూలోకంలో యెహోవాకు అత్యంత ప్రియభక్తుడైన యోబు గురుంచి ప్రస్తావన వస్తుంది.

యోబు 7 కుమారులు, 3 కుమార్తెలు, 7000 గొర్రెలు, 3000 ఒంటెలు, 500 ఎద్దులు, 500 గాడిదలు మరియు చాలా మంది బానిసలతో పరిపూర్ణమైన వ్యక్తి. (యోబు 1:1-3)

దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. (యోబు 1:6)

అతనిలాగా ఉండేవాళ్ళంటే తనకిష్టం అనే టైపు లో యెహోవా మాట్లాడుతాడు. అప్పుడు సైతాను ” నువ్వు వాడికి అన్ని ఇచ్చావు. వాడిని బాగా ఆశీర్వదించావు కాబట్టి నిన్ను పూజిస్తున్నాడు.ఒకసారి వాడి దగ్గర ఉన్నవి అన్నీ లాగేసుకో. అప్పుడు తెలుస్తుంది నీ భక్తుడి సంగతి అంటాడు సైతాను.

అయితే నేను రెడీ పందానికి అన్నట్టు యెహోవా సైతానుతో కలిసి, ఒక ప్రణాళిక ప్రకారం యోబు కుటుంబాన్ని నాశనం చేస్తారు.

యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.(యోబు 1:12)

ఇందులో యెహోవా ఏం చేశాడో చూడండి.

అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చిదేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.(యోబు 1:16)

అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చికల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను. (యోబు 1:17)

తన కష్టాలకు, తన వారి ప్రాణాలు పోవడానికి కారణం యెహోవా -సైతాను మధ్య జరిగిన బెట్టింగే కారణం అని తెలియని యోబు యెహోవాకు మొరబెట్టుకుంటాడు. తానేదో తప్పు చేసుంటాను అందుకే దేవుడు నాపై కోపంగా ఉన్నాడు అనే అమాయకత్వం యోబు గారిది.

అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను.(యోబు 1:20)

నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.(యోబు 1:21-22)

యెహోవా -సైతాను పెట్టుకున్న పోటీలో/ పందెంలో యోబు పిల్లలు,పనివాళ్ళు, జంతువులు, ఆస్తి అన్నీ పోయాయి( పిల్లలు, పనివాళ్ళు చనిపోయారు).

ఎక్కడ కూడా యోబు తొందర పడలేదు. దేవుడే ఇచ్చాడు. దేవుడే తీసేసుకున్నాడు అన్నది యోబు ఫీలోసఫీ.

కాబట్టి గెలిచాడు. యోబు వలన. సైతాను ఓడిపోయాడు. దేవుడు మళ్ళీ యోబుకి మళ్ళీ సంపద, కొత్త పనివాళ్ళు, కొత్త పిల్లల్ని ఇస్తాడు. యోబు అన్నీ మూసుకుని అవి తీసుకుని హ్యాపీ గా ఉంటాడు. అలాగే హ్యాపీ గా చనిపోతాడు. కథ ముగుస్తుంది.  

మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. (యోబు 42:10

)

అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క చెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతని మీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను .(యోబు 42:11)

యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.(యోబు 42:12

)

మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.(యోబు 42:13)

ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.(యోబు 42:15)

అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.(యోబు 42:16)

కాబట్టి దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా దేవుడిని పట్టుకొని వేలాడాలి. ఇది యాబు గారి సారాంశం.

ఇక్కడ యోబు జీవితాన్ని నాశనము చేసింది యెహోవా మరియు సైతాను. ఒక మనిషి జీవితంతో bet కాయడం కరెక్టేనా?

లాస్ట్ పంచ్:  బహుశా అప్పట్లో కష్టాలు వస్తే మతం మారిపోయే బ్యాచ్ లేరు అనుకుంటాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *