బైబిల్ దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తోంది. కానీ ఆ ప్రేమ కేవలం కన్నెపపిల్లల మీదే చూపిస్తుంటాడు బైబిల్ దేవుడు. అదే విచిత్రం. మిగతా స్త్రీలు ఆయన దృష్టిలో చెడ్డ వాళ్లు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. కన్నె పిల్లలు అంటే యెహోవా కి ఎంతో ప్రేమ.(1 యోహాను 4:8) ఒక సందర్బంలో పెళ్లి కాని ఆడవాళ్ళని ( కన్నీపిల్లలని మినహాయించి మిగతా ఆడవాళ్లు అందరినీ చంపేయమంటాడు యెహోవా. అలా ఒక్క వేటులో 32,000 మంది పెళ్లి అయిపోయిన స్త్రీలను చంపించాడు

కన్నెపిల్లలు – కరుణామయుడు!

బైబిల్ దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తోంది. కానీ ఆ ప్రేమ కేవలం కన్నెపపిల్లల మీదే చూపిస్తుంటాడు బైబిల్ దేవుడు. అదే విచిత్రం. మిగతా స్త్రీలు ఆయన దృష్టిలో చెడ్డ వాళ్లు.

దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
కన్నె పిల్లలు అంటే యెహోవా కి ఎంతో ప్రేమ.(1 యోహాను 4:8)

ఒక సందర్బంలో పెళ్లి కాని ఆడవాళ్ళని ( కన్నీపిల్లలని మినహాయించి మిగతా ఆడవాళ్లు అందరినీ చంపేయమంటాడు యెహోవా. అలా ఒక్క వేటులో 32,000 మంది పెళ్లి అయిపోయిన స్త్రీలను చంపించాడు అపర కరుణామయుడు, ప్రేమ స్వరూపి అయినా బైబిల్ దేవుడు.

కన్నె పిల్లలని కాపాడిన బైబిల్ దేవుడు:

ఒక రాజ్యం మీద పడి దోచుకోమని ఇజ్రాయెల్ ప్రజలను పురిగొల్పుతున్న యెహోవా.

ఇజ్రాయెల్ ప్రజలకు చేసిన హింసకు ప్రతి హింస చేయమని చెప్తున్న యెహోవా.

మరియు యెహోవామిద్యానీయులు ఇశ్రాయేలీ యులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి.(Numbers 31:1)

యెహోవా చెప్పినట్టే 12,000 మందితో బయలుదేరిన మోసే:

అట్లు గోత్రమొక్కంటికి వేయిమందిచొప్పున, ఇశ్రాయేలీయుల సేనలలో నుండి పండ్రెండువేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా..(Numbers 31:5)

మోసేకి యెహోవా చెప్పినట్టే మగాళ్లందరినీ చంపిన ఇజ్రాయెల్ ప్రజలు:

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధముచేసి మగవారినందరిని చంపిరి.(Numbers 31:7)

దొరికిన ప్రతి స్త్రీని, పిల్లల్ని, వస్తువుల్ని, పశువుల్ని దోచుకున్న ఇజ్రాయెల్ ప్రజలు:

అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱ మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.

ఆడవాళ్ళని చంపేయలేదు కదా అని వాకబు చేస్తున్న మోసే:

మోషే వారితోమీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా?(Numbers 31:15)

మగవాళ్లంతా చనిపోగా మిగిలిన మగపిల్లల్ని కూడా చంపేయమంటున్న మోసే, పెళ్లి కానీ ఆడవాళ్ళని మీకోసం బతకనివ్వండి అంటున్నాడు.

కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి.

పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.
(Numbers 31:17-18)

ఇక ఆఖరి అంకం… దోపిడీ సొమ్ము వాటాలు పంచుకోవడం.

యెహోవా ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు.

మరియు యెహోవా మోషేకు ఈలాగుసెలవిచ్చెను.(Numbers 31:25).

నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలో నేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధ మునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను.
మరియు సేనగా బయలు దేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకల లోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగ ములోనుండి తీసికొని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.

మనుష్యుల లోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజ కుడైన ఎలియాజరును చేసిరి.

ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది..
6,000,75 గొఱ్ఱమేకలును, 72,000 పశువులును, 61,000 గాడిదలును, 32,000 మంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,
అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా 3,37,500.

ఆ గొఱ్ఱ మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675.

ఆ పశువులు 36,000. వాటిలో యెహోవా పన్ను 72.

ఆ గాడిదలు 30,500. వాటిలో యెహోవా పన్ను 61.

మనుష్యులు( స్త్రీలు) 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32 మంది.

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను.

సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చెను.

ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది..

మొత్తానికి అర్చకులకు ఎంత వాటా వచ్చింది?

The warriors had to give 1/500th of their spoils as a tribute to the priests (who didn’t take part in the campaign) while the rest of the Israelites had to give 1/50th. Being that there were 32,000 women taken captive who were divided into two equal parts of 16,000, that leaves us with a tribute of 32 women from the warriors (16,000/500) and 320 from the rest of the Israelites (16,000/50). So the total of women the priests got as their part in the spoils was actually 352.

So, 352 అమ్మాయిలు యెహోవా గుళ్లో అర్చకులకి దొరికారు.

మొత్తం 32,000 పెళ్లి కానీ అమ్మాయిలను ఇలా దోచుకొమ్మని చెప్పిన యెహోవా, ఎంత దయామయుడు!

తన వాటాకింద వచ్చిన స్త్రీలను కూడా తన గుళ్లో అర్చకులకు అప్పజెప్పిన యెహోవా నిజంగా కరుణామయుడే కదా!!!

యెహోవా ఇలా 32,000 మంది స్త్రీల జీవితాలతో ఆదుకోవడం కరెక్టేనా?

పెళ్లి కానీ స్త్రీలు 32,000 మంది. మరి పెళ్లి అయిన స్త్రీల సంఖ్య ఎంత? ఎంత మందిని యెహోవా చంపించాడు?

ఆ అర్చకులు ఆ 352 మంది స్త్రీలను ఏం చేస్తారు?

ఆ ఇజ్రాయెల్ వీరులు ఆ 31,648 మంది స్త్రీలను ఏం చేస్తారు?

ఇలా కన్నీపిల్లలని మాత్రమే కాపాడే యెహోవా ఎంత ప్రేమ స్వరూపో కదా!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *