
దేవుడు మారిపోయాడు..!
బైబిల్ దేవుడు మారిపోయాడు!
అవును అండీ.. బైబిల్ దేవుడు పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు చిన్న చిన్న తప్పులకే చిరాకు పడి మనుషుల ప్రాణాలు తీసేసిన బైబిల్ దేవుడు, నేడు ఎన్ని పాపాలు చేసినా క్షమించేసే అంతగా మారిపోయాడు. ఈ మార్పుకి కారణం ఎమిటి?
కొన్ని పాత సినిమాలలో రేపిస్ట్ అయిన హీరో చివరికి తాను రేప్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుని ఆమె కోసం ఎన్నో ఫైట్స్ చేసే హీరోగా మారినట్టు ,
దొంగగా మొదలైన రాజా చివరికి మంచివాడిగా మారి సింగర్ సౌందర్య మనసు దోచుకున్నట్టు,
శుభలఘ్నం సినిమాలో డబ్బు పిచ్చితో భర్తను అమ్మేసిన ఆమని చివరికి భర్త విలువ తెలుసుకుని భర్తే కావాలి అన్నట్టు..
ఇలా అనేక సినిమాలలో హీరో/హీరోయిన్ పాత్రలు మారిపోయినట్టు బైబిల్ దేవుడు కూడా మారిపోయాడు.
ఉదాహరణకు:
ఒకప్పుడు మనుషులలో పాపం పెరిగిపోయింది అని భూమిపైన ఉన్న అందరినీ (ఒక ఫామిలీ ని తప్ప) జలసమాధి చేసేశాడు. ఇప్పుడు అదే దేవుడు మనుషుల్లో పాపం పెరిగిపోయింది అని మనుషుల కోసం తన ప్రాణం వదిలేశాడు అన్నది బైబిల్ వాక్యం. అంటే దేవుడు మారిపోయాడు అనే కదా !
ఒకప్పటి యెహోవా:
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక.(యిర్మియా 48:10)
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.(ఆదికాండము 6:12-13)
అంటే భూమిపైన పాపాత్ములు ఎక్కువ అయ్యారని చాలా కోపపడినట్టుగా ఇక్కడ తెలుస్తోంది. అలాగే అందరినీ చంపెయ్యాలి అని ఫిక్స్ అయినట్టుగా కూడా మనం ఇక్కడ చూశాం. తర్వాత దేవుడు ఎం చేశాడు?
యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి. (ఆదికాండము 7:1)
నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.(ఆదికాండము 7:12) పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను. (ఆదికాండము 7:22)
నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.(ఆదికాండము 7:23)
ఇలా ఉండేవాడు మన బైబిల్ దేవుడు. మనుషులు పాపాలు చేస్తే అస్సలు సహించే వాడు కాదు. అందరినీ చంపేసే వాడు. పరమ కోపిష్టి దేవుడు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం మారిపోయాడు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే అంతగా మారిపోయాడు.
ఇప్పటి యేసు :
నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. (మత్తయి 5:39)
But I tell you, Do not resist an evil person. If someone strikes you on the right cheek, turn to him the other also. (Matthew 5:39)
ఒకప్పుడు దుష్టత్వం ఎక్కువైంది అని మనుషుల్ని చంపేసిన మహానుభావుడు ఇప్పుడు దుస్తులను ఎదురించవద్దు అంటున్నాడు. అలాగే పాపులను జలసమాధి చేసినవాడు , వాళ్ళ కోసం చావడానికి వచ్చాను అంటున్నాడు.
మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. (గలతియులకు 1:4)
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.(యోహాను 3:16)
ఇతను రాజా సినిమా లో వెంకటేశా ? అపరిచితుడులో విక్రమా ?
ఏది ఏమైనా ఇలా మారేవాడు దేవుడు కాదు అని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.(హెబ్రీయులకు 13:8)
Jesus Christ is the same yesterday and today and for ever. (Hebrews 13:8) “యెహోవా ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు” యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు. (మలాకీ 3:6)
“I the LORD do not change. So you, O descendants of Jacob, are not destroyed. (Malachi 3:6)
మరి దేవుడు ఎందుకు మారిపోయాడు ? మారిపోను అని చెప్పి మారిపోతే దేవుడు ఎలా అవుతాడు. అబద్దాలు చెప్పేవాడు దేవుడు కాదు అని మరో బైబిల్ వాక్యం కూడా ఉంది.
ఇప్పుడు ఏం చేద్దాం?
ఇంద్ర సినిమాలో చిరంజీవి లాగా కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? సిలువ పై చనిపోయాడని అమాయకుడు అనుకుంటున్నారా? ఇప్పటికీ అదే వయోలెన్స్ .. పిన్ డ్రాప్ సైలెన్స్ అని డైలాగ్ చెప్తారా ?
ఏమో..!