
పరమాత్మ కి చావు లేదు. పుట్టుక లేదు.
పుట్టిన వానికి మరణం తప్పదు అని సనాతన ధర్మం చెబుతోంది. యేసు పుట్టాడు అని బైబిల్ చెబుతోంది.అంటే యేసు కి మరణం తప్పదా? దేవుడుకి మరణం ఉంటుందా?
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।।
పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.( భగవద్గీత 2:27)
సనాతన ధర్మం ప్రకారం దేవుడికే కాదు. ఆత్మకి కూడా చావు లేదు. పుట్టుక లేదు.
న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ।। భగవద్గీత 2: 20 ।।
ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.
ఎందుకు అంటే చావు ఉండాలంటే పుట్టుక కూడా ఉండి తీరాలి.
కాబట్టి మానవుడికి చావు వుంటుంది. కానీ దేవుడికి, ఆత్మకి చావు ఉండదు. అవి రెండు పుట్టుకలేనివి, చావు లేనివి.
కానీ బైబిల్ ప్రకారం ఆత్మకి చావు ఉంది.
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. (మత్తయి 10:28)
కాబట్టి ఈ వచనం ప్రకారం బైబిల్ ఆత్మకి చావు ఉంది అని నమ్ముతోంది. అంటే ఆత్మ కి పుట్టుక ఉంది అని అర్ధం. యెహోవా మనిషి ముక్కులో గాలి ఊది ఆత్మని ప్రవేశ పెట్టాడు కాబట్టి ఆ గాలిని ( ఆత్మని ) చంపే శక్తి యెహోవాకి ఉంది అని వారి వాదన.
పుట్టుక ఉంది అని వాదిస్తే చావు కూడా ఉన్నట్టు చెప్పేయొచ్చు. ఇందులో పెద్ద logic అవసరం లేదు.
ఉదాహరణకు యేసుకి జన్మ ఉంది. భూలోకంలో మాత్రమే కాదు స్వర్గంలో కూడా యేసుకి జన్మ ఉంది.
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. (కొలొస్సయులకు 1:15)
He is the image of the invisible God, the firstborn of every creature. (Colossians 1:15)
ఇక్కడ క్లియర్ గా యేసు కి జన్మ ఉంది అని చెప్పబడింది. అంటే అన్ని ఆత్మల లాగే యేసుకి కూడా చావు ఉంది అని సనాతన ధర్మం ప్రకారం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దేవుడుకి చావు ఉంది అని ఎలా భావించగలం?
కాబట్టి నిత్యం ఉండే పరమాత్మ ని మాత్రమే పూజించండి.
ప్రజా పతిశ్చరతి గర్భే అంతర జాయమానో బహుదా విజాయతే (యజుర్వేదం 31-19)
పరమాత్మ కి జన్మ లేదు. కాబట్టి చావు కూడా లేదు.
అలాగే పుట్టుక ఉన్న ప్రతి వ్యక్తి కి చావు కూడా ఉంటుంది. అది ఒక స్టాండర్డ్ నియమం.
ఎవరిని పూజించాలో ఇక మీ ఇష్టం.