
అనాధలు, అభాగ్యులను కాపాడే దేవుడు మా దేవుడు అంటూ ప్రచారం చేస్తారు. కానీ అభాగ్యులపై వారి దేవుడి వైఖరిని పూర్తిగా భహిర్గతం చేయరు.
“అనాధలకు, విధవలకు మా దేవుడే తండ్రి”
తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు. (కీర్తనల గ్రంథము 68:5)
A #father to the #fatherless, a defender of #widows, is God in his holy dwelling. (Psalms 68:5)
ఈ బైబిల్ వాక్యం చాలా అనాధ ఆశ్రమాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్యం చూసిన ఎవరైనా సరే, బైబిల్ దేవుడు అనాథలను, విధవలను తండ్రి లాగా దయతో చేసుకుంటాడేమో అని అందరూ అనుకుంటారు.
అందుకే అభాగ్యులను సేవ పేరుతో మతం మార్చాలి అనుకునే పాస్టర్లు ఇలాంటి వాక్యాలను బ్రహ్మాస్త్రం లాగా వాడుతారు.
అనాధలకు తండ్రి దేవుడు కాబట్టి వాళ్ళ ఆలనా పాలనా చూసేది కూడా ఈ దేవుడే అని మీరు అనుకుంటే,
మీరు పప్పులో కాలేసినట్టే.
ఈ వాక్యం చూడండి.
వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యౌవనస్థులను చూచి సంతోషింపడు వారిలో #తలిదండ్రులు లేనివారియందైనను వారి #విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. (యెషయా 9:17)
Therefore the Lord will take #no pleasure in the young men, #nor will he pity the #fatherless and #widows, for everyone is ungodly and wicked, every mouth speaks vileness. Yet for all this, his anger is not turned away, his hand is still upraised. (Isaiah 9:17)
ఇక్కడ తన మాట వినని వాళ్ళు అనాధలైనా, విధవలైనా సరే వాళ్లపై దయ చూపించే ప్రసక్తే లేదు అని స్వయంగా దేవుడే చెప్తున్నాడు.
తప్పు చేసినవాళ్లు ఎవరైనా ఆయన దృష్టిలో ఒకటే అయినప్పుడు స్పెషల్ గా అనాధలకు, విధవలకు అయన వలన ఒరిగింది ఏముంది? అనాధల, అభాగ్యుల తప్పుల్ని క్షమించి విడిచి పెడుతున్నాడా? లేదే !
మరో చోట విధవల గురుంచి యెహోవా/యేసు ఏమంటున్నాడో చూడండి.
నావలెనుండుట (పెళ్లి చేసుకోకుండా ఉండటం) వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను. (1 కోరింథీయులకు 7:8)
అర్థం : విధవలు పెళ్లి చేసుకోకూడదు. కానీ కామం ఎక్కువ అయ్యి తట్టుకోలేక పోతే తప్పదు కాబట్టి అప్పుడు పెళ్లి చేసుకోవాలి.
అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు. (1 కోరింథీయులకు 7:9)
అంటే పెళ్లి అనేది sex కోసమే. లేదా కామ కోరికలు ఉన్న విధవలు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. Nuns వ్యవస్థ ఇక్కడ నుండే పుట్టింది.
మరి ఆ విధవరాలు ఎవరిని పెళ్లి చేసుకోవాలి?
మరో ఉదాహరణ
విధవరాలు అయిన క్రైస్తవ స్త్రీ క్రైస్తవులని మాత్రమే రెండో పెళ్లి చేసుకోవాలి.!!!
భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను. (1 కోరింథీయులకు 7:39)
ఇలా అనేక వాక్యాలు విధవలకు వ్యతిరేకంగా యెహోవా చెప్పడం మనం బైబిల్లో చూస్తాము.
సరే విధవలు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చా?
లేదు.
మరో ఉదాహరణ
యెహోవా గుళ్లో యాజకులను( PRIEST లను) విధవలు పెళ్లాడ లేరు.
విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొన వలెను. (లేవీయకాండము 21:14)
తన సేవ చేసే యాజకులు విధవలను ఎందుకు పూజించకూడదు? వాళ్ళకి ఏం తక్కువైంది? మిగతా స్త్రీలకు వాళ్ళకి ఏమిటి తేడా ?
మరో ఉదాహరణ
విధవలకి ప్రత్యేక వస్త్రాలు (తెల్ల చీర?)
అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన.. (ఆదికాండము 38:14).
యూదా కోడలు 2 భర్తలు చనిపోయిన తరువాత విధవ వస్త్రాలు ధరించి ఉండేది అని పై వాక్యం చెప్తోంది. అంటే తామారు తెల్ల చీర లాంటివి కట్టుకునేదా?
Summary :
యెహోవా/యేసు అనాధలని విధవలని రక్షించాలంటే వాళ్లు క్రైస్తవులు అయ్యి వుండాలి. విధవరాలు క్రైస్తవులనే పెళ్లాడాలి. మారు పెళ్లి అయ్యేంతవరకు విధవ వస్తాలు ధరించాలి. Sex కోరికలు ఎక్కువ అయితే అప్పుడు పెళ్లి చేసుకోవాలి. యెహోవా గుళ్లో పూజరులు మాత్రం కన్నె పిల్లలనే పెళ్లాడాలి. మిగతా వాళ్లు విధవలని పెళ్ళాడవచ్చు.
అనాధలను, అభాగ్యులను దేవుడు తండ్రిలా కాపాడతాడు అని జరిగే ప్రచారానికి, బైబిల్లో ఉన్న వాక్యాలకు ఎంత వ్యత్యాసం ఉందో స్వయంగా మీరే స్వయంగా చదివి తెలుసుకోండి.
ఇట్లు మీ రమణ నేషనలిస్ట్
పోస్ట్ నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. సేవ్ చేసుకోండి. అందరితో పంచుకోండి.