
నిద్రపోని దేవుడు నిద్రపోతున్నాడు. నిద్రపోని దేవుడిని భక్తులు నిద్ర లేపుతున్నారు.
హౌ ? హౌ మచ్చ..!
జస్ట్ వెయిట్ .. ! లెట్ మీ ఎక్స్ప్లెయిన్ !
మొదట దేవుడు నిద్ర పోడు,కునకడు అని బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి.
రిఫరెన్స్ -1
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. (కీర్తనల గ్రంథము 121:4)
indeed, he who watches over Israel will neither slumber nor sleep. (Psalms 121:4)
ఇక్కడ ఇజ్రాయెల్ ని కాపాడే వాడు (ఇజ్రాయేల్ దేవుడు) కునకడు , నిద్రపోడు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది బైబిల్. కాబట్టి ఇజ్రాయెల్ దేవుడు నిద్రపోడు అని భావించాల్సి వస్తుంది.
బైబిల్లో మరో చోట ఎక్కడైనా ఇజ్రాయెల్ దేవుడు నిద్రపోతే అతను ఇజ్రాయెల్ దేవుడు (ఇజ్రాయెల్ రక్షకుడు ) కాదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే కాంట్రడిక్షణ్ అవుతుంది కదా !
సరే ఒక వ్యక్తి నిద్రపోకుండా మనం అతన్ని నిద్ర లేపగలమా?
నిద్రపోతేనే నిద్రలేపడం సాధ్యం అవుతుంది. అలాగే నిద్ర పోయిన వ్యక్తి మాత్రమే నిద్రలేవగలడు.
రిఫరెన్స్ -2
యెహోవా ను నిద్ర లేపుతున్న భక్తులు:
ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము. (కీర్తనల గ్రంథము 44:23)
Awake, O Lord! Why do you sleep? Rouse yourself! Do not reject us forever. (Psalms 44:23)
ఇక్కడ యెహోవాను భక్తులు నిద్రలేపుతున్నారు. అంటే ఆయన పడుకున్నారని అర్ధం కదా ! మరి యెహోవా ఇజ్రాయేల్ కి రక్షకుడు కాదా ?
రిఫరెన్స్ -3
బాగా మందుకొట్టి పడుకున్న వీరుడు గాఢ నిద్రలోంచి లేచినట్టు యెహోవా నిద్రలోంచి లేస్తాడంట !
అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను. (కీర్తనల గ్రంథము 78:65)
Then the Lord awoke from sleep, as a man wakes from the stupor of wine. (Psalms 78:65)
అంటే యెహోవా మందు కొట్టి పడుకున్నాడు అని అనను కానీ ఆయన నిద్రలోంచి లేస్తాడు అని బైబిల్ చెప్తోంది అని అర్తం. నిద్రపోయిన తర్వాతే కదా నిద్ర లేచేది? అంటే యెహోవా ఇజ్రాయేల్ రక్షకుడు కాదా ? ఇజ్రాయెల్ దేవుడు కాదా?
రిఫరెన్స్ -4
నిద్రపోయిన మధ్య వర్తి యేసు:
ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి–బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి. (మార్కు 4:38)
Jesus was in the stern, sleeping on a cushion. The disciples woke him and said to him, “Teacher, don-t you care if we drown?” (
Mark 4:38)
నిద్ర లేచిన యేసు.
అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను. (మార్కు 4:39)
He got up, rebuked the wind, and said to the waves, “Quiet! Be still!” Then the wind died down and it was completely calm. (Mark 4:39)
…. …. …. … ….. ….. ….
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. (కీర్తనల గ్రంథము 121:4)
అన్న స్టేట్మెంట్ ని యెహోవా జస్టిఫై చేశాడా? యేసు జస్టిఫై చేశాడా?
యెహోవా నిద్రపోయి భక్తులు నిద్రలేపితే బాగా మందుకొట్టిన వీరుడిలాగా లేస్తాడు అని బైబిల్ చెప్తోంది.
అలాగే యేసు కూడా పడవలో పడుకుని తన అనుచరులు నిద్రలేపితే లేచాడు అని బైబిల్ చెప్తోంది.
ఇంతకీ ఇద్దరిలో ఇజ్రాయెల్ రక్షకుడు ఎవరు? ఇజ్రాయెల్ దేవుడు ఎవరు ?
final proof:
