
యేసు/యెహోవా పాపుల కోసం చనిపోయాడా? పాపులందరినీ చంపేశాడా?
ఒకప్పుడు మా దేవుడు చెడ్డవాళ్లని చంపి మంచి వాళ్ళను రక్షించాడు అనే వాదనకి బలం ఉండేది. కాల క్రమేణా(పైగా కలికాలం) భూమిపైన చెడ్డ వాళ్ళ మెజారిటీ ఎక్కువ కావడంతో మా దేవుడు పాపుల కోసం చనిపోయాడు. పాపులను రక్షించడానికే పుట్టాడు. చచ్చాడు అనే వింత వాదనతో కొత్త మతాలు పుట్టుకొచ్చాయి.
ఒకప్పుడు బైబిల్ ట్రెండ్ ఎలా ఉండేది అంటే ఎవడు చిన్న తప్పు చేసినా వాళ్ళ దేవుడికి చిర్రెత్తుకొచ్చేది.
ఉదాహరణకు:
- “వెనుకకు తిరగకు చస్తావు” అన్నాడు అనుకుందాం. ఏవరైనా ఆ మాట వినకపోతే చంపేసేవాడు.
- నా మాట వినకపోతే మీ పిల్లల మాంసం మీతోనే తినిపిస్తా అంటాడు. తినిపిస్తాడు కూడా.
- అడ్డతెర దగ్గరకు రావొద్దు అంటాడు. వస్తే చంపేస్తాడు.
- ఒక పండు తిన్న పాపానికి ఆడదానికి పురిటి నొప్పులు పెరగాలి అని శాపం పెడతాడు.
ఇలాంటి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ “దహించు అగ్ని” మనుషుల పాపాలను చూసి తట్టుకోలేక ఆత్మార్పణం చేసుకున్నాడు అంటే ఆశ్చర్యమే.
అన్నట్టు మర్చిపోయాను. ఒకసారి ఈయనకి కోపం పతాక స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు భూమిపైనా ఎక్కడ చూసిన పాపమే. లోకం పాప్మతో నిండిపోయి ఉండటం చూసి ఇలాంటి మనుషుల్ని నేను ఎందుకు పుట్టించాను . ఛీ దీనమ్మ జీవితం అనుకుని అందరిని ఒకేసారి చంపేశాడు. (నోవహు అనే ఒకటి కుటుంబాన్ని మాత్రం వదిలేశాడు)
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.(ఆదికాండము 6:12-13)
యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి. (ఆదికాండము 7:1)
నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.(ఆదికాండము 7:12
పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను. (ఆదికాండము 7:22)
నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.(ఆదికాండము 7:23)
చూశారుగా అప్పటికి ఇంకా బైబిల్ దేవుడు పాపులను చంపేసి, మంచివాళ్లను శిక్షించే ట్రెండ్ ఫాలో అయ్యేవాడు. ఒక్క ఫామిలీ తప్ప భూమిపైన మానవ జాతి మొత్తాన్ని చంపి పడేశాడు. అప్పుడు ఎంతమంది పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోయారో, ఎంత మంది స్త్రీలు గర్భవతులుగా సజీవ జల సమాధి అయ్యారో మనకు తెలియదు.
అలా మనుషుల ప్రాణాలను గడ్డిపోచ కంటే హీనంగా జమ కట్టిన ఈ పెద్ద మనిషి .. వన్ ఫైన్ మార్నింగ్ ..
పాపుల కోసం తన కొడుకు ప్రాణం తియ్యాలని ఫిక్స్ అయిపోయాడు. దానికి అతని పెట్టుకున్న సాకు ..”దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను” కనుక అతను తన కొడుకుని మన కొరకు చంపెను.
మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. (గలతియులకు 1:4)
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.(యోహాను 3:16)
ఈయన గారి లోకంపై ప్రేమ పాడుగాను. మరి ఒకప్పుడు నువ్వు భూమి పై ఉన్న మనుషులు అందరిని చంపేశావే. వాళ్ళు ఈ లోకంలోని మనుషులు కాదా ?
“లోకమంటే మట్టి కాదోయి లోకమంటే మనుషులోయి” అన్నట్టు
లోకాన్ని ఇంతగా ప్రేమించేవాడివి ఆనాడు లోకంలో ప్రాణం ఉన్న ప్రతి మనిషిని ఎందుకు చంపేశావు బాబు … !
చెప్పు నా ప్రశ్నకు సమాధానం చెప్పు ..!
అడుగుతున్నది
మీ రమణ నేషనలిస్ట్
నోట్ : పోస్ట్ నచ్చితే లైక్ చేయండి.షేర్ చేయండి . సేవ్ చేసుకోండి. అందరితో పంచుకోండి..