Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

killed by god-1

killed by god-1

యెహోవా అనే బైబిల్ దేవుడికి కోపం చాలా ఎక్కువ. బైబిల్లో ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ ప్రజలని హింసించి, వేధించి, చంపి తన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు యెహోవా. ఆ కార్యక్రమంలో భాగంగా ఒకసారి ఇలా వార్నింగ్ ఇచ్చాడు.

“పొలాల్లో పేడ పడేలా, కోతపనివారి వెనక పనలు పడేలా మనుషుల శవాలు కూలుతాయి. వాటిని పోగు చేయడానికి ఎవరూ ఉండరు.(యిర్మీయా 9:22)

“Dead bodies will lie like dung on the open field, like cut grain behind the reaper, with no one to gather them.” (Jeremiah 9:22)

ఇక్కడ యెహోవా చెప్పేది ఏమిటంటే తన మాట వినని వాళ్లని యెహోవా చంపేస్తాను అని.

వాళ్ళ సవాలు ఖాళీగా ఉండే పొలాల్లో జంతువుల పెంట ( పేడ ) పడినట్టు, పంటకోసేటప్పుడు సేనులో గింజలు ( పనలు) పడినట్టుగా సవాలు పడతాయి అని వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఆయన చంపిన తర్వాత మనుషుల శవాలని పోగు చేయడానికి కూడా ఎవరూ ఉండరు అని చెప్తున్నాడు. అంటే అనాధ సవాళ్ళ లాగా మనుషులు చస్తారు, నాశనము అవుతారు అంటున్నాడు యెహోవా.

ఇలాంటివే మరికొన్ని వాక్యాలు.

వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. (యిర్మీయా 16:4)

“They shall die of grievous deaths; they shall not be lamented, neither shall they be buried, but they shall be as dung upon the face of the earth. And they shall be consumed by the sword and by famine, and their carcasses shall be meat for the fowls of heaven and for the beasts of the earth.” (Jeremiah 16:4)

మరో వాక్యం:

ఆ రోజు యెహోవా చేత హతం అయిన వాళ్ళు భూమి ఒక అంచు నుంచి మరొక అంచు వరకూ ఉంటారు. వాళ్ళ కోసం ఎవరూ ఏడవరు. వాళ్ళను పోగుచేయరు. పాతిపెట్టరు. పెంటలాగా వారి శవాలు నేల మీద పడి ఉంటాయి.(యిర్మీయా 25:33)

At that time those slain by the LORD will be everywhere– from one end of the earth to the other. They will not be mourned or gathered up or buried, but will be like refuse lying on the ground. (Jeremiah 25:33)

ఇవి ఎక్కడ నెరవేరాయో చూద్దాం.

  1. ఎవరూ గుర్తు పట్టలేకుండా ఆమె శరీరం యెజ్రెయేలు పొలాల్లో పేడలా ఉంటుంది

యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున యిది జరిగెను. (2 రాజులు 9:37)

  1. నాశనం అయిపోతారు, నేలకు ఎరువు అవుతారు

వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి. (కీర్తనల గ్రంథము 83:10)

  1. శవాలు చెత్తలాగా పడి ఉంటాయి

దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది. (యెషయా 5:25)

అసలు ఇంత ఘోరంగా యెహోవా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?

ఇతర దేవతలను పూజించడం వల్లనే:

వాటిని తెచ్చి వారు వేటినైతే ప్రేమిస్తున్నారో, పూజిస్తున్నారో, వేటి ఎదుట విచారణ చేస్తున్నారో, నమస్కరిస్తున్నారో ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఎదుట వాటిని పరుస్తారు. వాటిని పోగు చేసి పాతిపెట్టడం జరగదు. భూమి మీద పెంటలాగా అవి పడి ఉంటాయి.(యిర్మీయా 8:2 )

యెహోవాని కాకుండా ఇతర దేవతలను పూజించే వాళ్ళ శవాలని ఖాళీగా ఉన్న పంటపొలంలో పెంట లాగా, రైతు కోస్తూ ఉంటే పడిన గింజల లాగా అనాధ శవాళ్ళ లాగా వదిలేసేలా యెహోవానే చేస్తాడు అని యెహోవా నే చెప్తున్నాడు.
అర్థం అయింది కదా..!

మనుషుల్ని భయపెట్టి, హింసించి, చంపి దారిలోకి తెచ్చుకోవాలి అనుకోవడం మనం హంతకుల్లో, శాడిస్టులలోనే చూస్తాము. మన సొంత తండ్రి మనతో ఇలా ప్రవర్తిస్తాడా? అందరికీ తండ్రి అని పిలవబడే బైబిల్ దేవుడు యెహోవా ఇలా చేయడం భావ్యమా?

అయిన ఇతర దేవతలను పూజించే వాళ్లని, ఇతర మతస్థులని చంపే వాడు దేవుడు ఎలా అవుతాడు?

బైబిల్లో యెహోవా చంపిన మనుషుల లెక్క దాదాపు 28 లక్షలు అని కొందరు లెక్క గట్టారు.

వాటికి ఆధారాలు బైబిల్లో ఉన్నాయి.

మరి ఇక్కడ ప్రస్తావించబడినట్టు యెహోవా చేతిలో ఘోరంగా చంపబడి, అనాధ శవాలుగా పొలాల్లో రాలిపోయి, మట్టిలో కలిసిపోయిన మనుషుల లెక్క ఎవరు చెప్తారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *