
మాట తప్పిన యేసు, దేవుడు మాట తప్పుడు
WAS JESUS A LIER?
బైబిల్ ప్రకారం దేవుడు మాట తప్పడు, అబద్ధాలు చెప్పడు.
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా. (సంఖ్యాకాండము 23:19).
God is not a man, that he should lie, nor a son of man, that he should change his mind. Does he speak and then not act? Does he promise and not fulfill? (Numbers 23:19)
ఇది స్వయంగా బైబిల్ దేవుడే చెప్పాడు. ఈ వాక్యం ప్రకారం అబద్ధాలు చెప్పే ఎవరైనా దేవుడు కానట్టే..!
యేసు చెప్పిన ఈ మాట చూడండి.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.(మత్తయి 5:17)
“Do not think that I have come to abolish the Law or the Prophets; I have not come to abolish them but to fulfill them. (Matthew 5:17)
నేను ఇంతకు ముందు ఉన్న మోసే /యెహోవా ధర్మ శాస్త్రాన్ని కానీ, నా కంటే ముందు వచ్చిన ప్రవక్తల మాటలని కానీ వ్యతిరేకించడానికి రాలేదు అని యేసు చెప్పుకొచ్చాడు బైబిల్లో.
కానీ యేసు అంతక ముందు అజ్ఞాలన్నింటినీ తుంగలోకి తొక్కి తనో పెద్ద అబద్ధాలకోరు ( big lier) అని నిరూపించుకున్నాడు.
Example -1
యెహోవా చెప్పిన మోసే ధర్మశాస్త్రం:
హింసకు ప్రతి హింస చేయండి -మోసే /యెహోవా
హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. (నిర్గమకాండము 21:23-25)
“నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి. (ద్వితీయోపదేశ కాండం 19:21)
కంటికి కన్ను పంటికి పల్లు.
ఒకటి గమనించండి పంటికి పన్ను కాదు పల్లు. అంటే ఒక పన్ను ఊడగొడితే అన్ని పల్లూ ఊడగొట్టమంటున్నాడు యెహోవా.
దీనికి వ్యతిరేకంగా యేసు ఇలా చెప్తున్నాడు:
హింసకు ప్రతి హింస చేయకండి. అహింస పాటించండి.
నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. (మత్తయి 5:43-44)
నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. (మత్తయి 5:39)
ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.(మత్తయి 5:40)
ఇక్కడ మోసే /యెహోవా పెట్టిన హింసకు ప్రతి హింస అనే నియమాన్ని యేసు కొట్టివేశాడు. ఇది యేసు చెప్పిన మొదటి అబద్ధం.
Example – 2
యెహోవా ఏం చెప్పాడు.
ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును.(నిర్గమకాండము 31:15)
విశ్రాంతి దినం పాటించకపోతే మరణశిక్ష (Death penality)
ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి.(Numbers 15:32). తరువాత యెహోవా, ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.(Numbers 15:35)
యేసు ఏం చెప్పాడు:
“మరియు విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు. “(Mark 2:27)
విశ్రాంతి దినం పాటించలేదని మనిషిని చంపిన యెహోవాకి తెలియదా, మనిషి కన్నా పరిశుద్ధ దినం ఎక్కువ కాదని మోసే కి యెహోవాకి తెలియదా?
నేను ధర్మ శాస్త్రాన్ని మార్చడానికి రాలేదు అన్న యేసు ఇక్కడ చేసింది ఏమిటీ? తాను చెయ్యడానికి రాలేదు అని చెప్పి, అదే చేసి పెద్ద అబద్ధాల కోరు అని నిరూపించుకున్నట్టే కదా!
ఇప్పుడు చెప్పండి యెహోవా పెట్టిన ఆజ్ఞలని కానీ పూర్వము ఉన్న ప్రవక్తల మాటలను (ఆజ్ఞలను) కానీ కొట్టివేయడానికి నేను రాలేదు అన్న యేసు ఇక్కడ ఏం చేస్తున్నాడు.
“ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.” (యోహాను 5:18)
యేసు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అందుకే అబద్ధాలకోరు అయిన యేసుని యూదులు చంపేశారు.