
contradictions
దేవుడు పశ్చాత్తాప పడడు.. పశ్చాత్తాప పడితే వాడు దేవుడు కాదు – బైబిల్ స్టేట్మెంట్
సరే బైబిల్ తెరిచి చూడండి.
స్టేట్మెంట్ -1
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యాకాండము 23:19)
God is not a man, that He should lie; neither the #son of man, that He should repent. Hath He said, and shall He not do it? Or hath He spoken, and shall He not make it good? (Numbers 23:19)
మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు.(1 సమూయేలు 15:29)
And also the Strength of Israel will not lie nor repent; for He is not a man, that He should repent. (1 Samuel 15:29)
పశ్చాత్తాప పడేవాడు దేవుడు కాదు. ఎందుకు అంటే దేవుడు పశ్చాత్తాప పడడు.
ఈ వాక్యం పరిశుద్ధ ఆత్మ ద్వారా రాయబడింది అని బైబిల్ చెప్తోంది. చూద్దాము.
ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను #దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను. (యోనా 3:10)
And God saw their works, that they turned from their evil way. And #God #repented of the evil that He had said that He would do unto them, and He did it not. (Jonah 3:10)
1 సమూయేలు 15:11
సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడు చున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను.
ఆదికాండము 6:6
తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను
అంటే ఇక్కడ యెహోవా పశ్చాత్తాప పడ్డాడు. అంటే యెహోవా దేవుడు కాదు. అంతేనా?
మరి బైబిల్ యెహోవానే దేవుడు అని చెప్తోంది…?
దేవుని వాక్యం ఎందుకు తప్పయింది?
ఆలోచించండి… పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో బైబిల్ రాయబడింది అంటారా?
మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి.