Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

పాస్టర్లు చెప్పని నిజాలు-2

బైబిల్ దేవుడు అందరిపైనా కనికరం చూపించమని చెప్పాడు. కనికరం చూపిస్తే మీకు కూడా ఆశీర్వాదం(కనికరం) లభిస్తుంది.

అని పాస్టర్ గారు చెప్తారు.

కానీ కనికరమైన చూపకుండా అందరినీ చంపేయమని యెహోవా చెప్పిన సంగతి ఏ పాస్టరూ చెప్పడు!

ఎందుకు అలా?

“కనికరం చూపించండి”

కనికరముగలవారు ధన్యులు; వారు #కనికరము పొందుదురు. (మత్తయి 5:7)

Blessed are the #merciful, for they will be shown #mercy. (Matthew 5:7)

మా దేవుడు చూశావా ఎంత గొప్ప మాట చెప్పాడో. అందరి పైన కనికరం చూపించమన్న మా దేవుడు గొప్పోడురా.. ఇలా చెప్పుకుంటూ పోతుంటాడు పాస్టర్ .

కానీ ఏనాడూ ఈ క్రింది వాక్యాలు లాంటివి చెప్పడు.

నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెనుమీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను #కనికరమైనను లేకుండ #అందరిని #హతము చేయుడి. (యెహెఙ్కేలు 9:5)

Then I heard the LORD say to the other men, “Follow him through the city and #kill #everyone whose forehead is not marked. #Show #no #mercy; have #no #pity! (Ezekiel 9:5)

కనికరం చూపకుండా అందరినీ చంపేయండి.

కనికరం చూపిస్తే కనికరం పొందుతారు అన్నాడు. మరి కనికరం చూపించకపోతే? ఏం పొందుతారు?

చెప్పండి ప్రియులారా! దేవుని బిడ్డలారా?

ఎందుకు ఒక వాక్యం చూపించి మరో వాక్యాన్ని దాచేస్తున్నారు పాస్టర్ గారు?

మీ రమణ నేషనలిస్ట్

Note: పోస్ట్ నచ్చితే షేర్ చేయండి. సేవ్ చేసుకోండి. అందరితో పంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *