దావీదు కౌగిలిలోకి యెహోవా చేర్చిన ఆఖరి ఆడపిల్ల – అబీషగు
అబీషగు మీద కన్నేసిన దావీదు కొడుకు
తండ్రి ద్వారా సంక్రమించిన రాజ్యం పోతుంది అనే భయంతో సోదరుడిని చంపించిన దావీదు వారసుడు

కథ క్లుప్తంగా:
దావీదుకి బాగా వయసు పెరిగి ఒంట్లో వేడి తగ్గిన తర్వాత అతని శరీరంలో వేడి పుట్టించడానికి ఒక అందగత్తెను వెతికి పట్టుకుంటారు దావీదు సేవకులు. (ముసలాడి ఒంట్లో వేడి పుట్టించడానికి అందగత్తె కావాలా? ఏమో!)
రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక యుండెను. కాబట్టి వారుమా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇశ్రా యేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి, అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసికొని వచ్చిరి. (1 రాజులు 1:1-3)
దావీదుకి రాత్రి పగలు వెచ్చదనం ఇచ్చినా కూడా రాజు గారు ఆమెతో శృంగారం మాత్రం చెయ్యలేదంట. (అయ్యో పాపం. అందుకే వేడి సరిపోక చనిపోయాడా? లేక వేడి ఎక్కువై చనిపోయాడా? ఏమో! )
ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయు చుండెను గాని రాజు దానిని కూడలేదు. (1 రాజులు 1:4)
దావీదు వారసుడిని నేనే అంటూ ప్రచారం చేసుకున్నాడు దావీదు పెద్ద కొడుకు. కానీ దావీదు ఉంపుడుగత్తె (బత్షేబ) తన కొడుకే రాజు అవ్వాలని అడుగగా సోలమన్ ని రాజుని చేసేశాడు దావీదు. (ఉంచుకున్న దానికి అంత ప్రాధాన్యత? అబ్బో దావీదు చాలా గొప్పోడు)
అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినదానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్షెబ సాగిల పడి రాజునకు నమస్కారము చేసినా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను. (1 రాజులు 1:30-31)
దావీదు ఉంచుకున్నదాని దగ్గరకు దావీదు పెద్ద కొడుకు వచ్చి అమ్మా… నాకు నాన్న దగ్గర పడుకున్న అమ్మాయి కావాలి అన్నాడంట. ఆమె సరే అన్నదంట. కానీ తండ్రి కౌగిలిలో పడుకున్న దాన్ని అడగటం అంటే రాజ్యాన్ని కూడా అడగటమే అని గ్రహించి పెద్ద అన్నయ్యను చంపించేశాడు సోలోమోను. (సోలోమోను మహాజ్ఞాని ఇందుకేనేమో?)
ఆమె చెప్పుమనగా అతడురాజగు సొలొమోను షూనే మీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదనిచెప్ప డనెను బత్షెబమంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెద ననెను. (1 రాజులు 2:17-18)
అందుకు రాజైన సొలొమోనుషూనే మీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయాకొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతనికొరకును, యాజకుడైన అబ్యాతారుకొరకును, సెరూయా కుమారు డైన యోవాబుకొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. (1 రాజులు 2:22)
యెహోయాదా కుమారు డైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను. (1 రాజులు 2:25)
దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే తప్పడు. దావీదు కౌగిలిలోకి అమ్మాయిల్ని చేర్చడం దావీదు చనిపోయేవరకు ఆపలేదు యెహోవా. ఆఖరి అమ్మాయి అందగత్తె +కన్నెపిల్ల కావడం విశేషం.
నీ యజమానుని స్త్రీలను(master’s wives) నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. (2 సమూయేలు 12:8)
యెహోవా ఇలా ఎంతమందిని దావీదు కౌగలిలోకి పంపించాడో తెలియాలంటే ఈ పోస్ట్ చదవండి.
యజమాని భార్యలను తార్చిన దేవుడు
https://biblexposer.com/davidisservantofsaulproved/
సౌలు కూతురిని ఇచ్చిన దేవుడు
నాబాలు భార్యను ఇచ్చిన దేవుడు
ముసలి వయసులో కన్నెపిల్లను ఇచ్చిన దేవుడు
https://biblexposer.com/davidtheoldman/
Anyway… యెహోవా ఇజ్ గ్రేట్.