Jehovah’s Mass Murders
వాడు అది నుండి నరహంటాకుడై యున్నాడు అన్న వచనం యెహోవా గురించి అని నేనంటే కాదు సైతాను నరహంతకుడు అన్న మిత్రులకు సమాధానంగా నేను పెట్టిన part-1 లో యెహోవా చేసిన చిల్లర హత్యలను ప్రస్థావించాను. ఇప్పుడు పార్ట్ -2 లో యెహోవా చేసిన mass murders అంటే ఎక్కువ మందిని ఒకేసారి లేపేసిన సంఘటనలు తెలియజేస్తాను. ఆది నుండి నరహంతకుడు యెహోవానా లేక సాతానా అన్న విషయం మీరే తేల్చుకోండి.

Point no.1 మినహాయించి యెహోవా చంపిన వారి లెక్క =2,821,364 మంది
1. Noah flood
మనుషుల్ని పుట్టించిన యెహోవా వాళ్లంతా తప్పు చేస్తున్నారని ఒక నోవా కుటుంబాన్ని తప్ప అందరినీ చంపేస్తాడు. ఒక బోట్ లో పట్టే మనసుషులు జంతువులు, పక్షులు, పురుగులు అన్నింటిని చంపేస్తాడు. ఎంతమందిని చంపాడో లెక్క బైబిల్ లో రాయలేదు కాబట్టి వదిలేద్దాం.(ఆదికాండం 7:23)
ఇలా ఎంతమందిని చంపాడో లెక్క చెప్పని సంఘటనలని పక్కన పెట్టేస్తాను.
2. ఐగుప్తిల మీదకి వారి రథాల మీదకి సముద్రపు నీళ్లు రప్పించి 600 మందిని చంపేశాడు.(నిర్గమకాండం 14:8-26)
3. దేవుని పక్షం ఉన్న వాళ్లందరూ అవతలి వర్గం వారిని చంపమని యెహోవా చెప్పడంతో 600 మంది చచ్చారు.(నిర్గమకాండం 32:27-28)
4. ధూపం వెలిగించారని 250 మందిని చంపేశాడు.( సంఖ్యా కాండం 16:35)
5. కోరా కుటుంబం అర్చకత్వం చేస్తాం అని అనడంతో యెహోవా కి కోపం వచ్చి 14,700 మందిని చంపేశాడు.
6. యెహోవా కోపం మల్లించడం కోసం pheaneas చేసిన హత్యలు. మృతులు 24,002
7.యెహో నరమేధం. 12,000 మంది(యెహోషువా 8:25)
8. యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను. 10,000 మంది చచ్చారు.(న్యాయధిపతులు 1:4)
9. యెహోవా మోయబీయులని ఓడించాడు. మరో 10,00 0 చచ్చారు.
10. ప్రతి ఒక్కడి మీదకి యెహోవా ఖడ్గం వచ్చి 1,20,000 చచ్చారు. (న్యాయధిపతులు 7:22)
11. దేవుని అపవిత్రాత్మ వలన 1001 మంది చచ్చారు. (న్యాయధిపతులు 9:23-27)
12. యెప్తాకి యెహోవా సహాయం చేయడంతో 42,000 చచ్చారు.(న్యాయధిపతులు 12:4)
13. యెహోవా ఆత్మ సంసోను మీదకి వచ్చి 30 మంది చచ్చారు. (న్యాయధిపతులు 14:19).
న్యాయధిపతులు 15:14-15 లో 1000 మంది.
న్యాయధిపతులు 16:27-30 లో 3000 మంది
యెహోవా అనుగ్రహంతో samson చంపాడు.
14. న్యాయధిపతులు 20:35-37 లో 65,100 మందిని
15. 1 సమోయేలు 2:25, 4:11 ప్రకారం 34,200 మందిని యెహోవా చంపాడు.
16. యెహోవా ark ని చూసారని 1 సమోయేలు 6:19 లో 50,070 మంది చచ్చారు.
17. దావీదు విజయం కోసం 65,500 మందిని యెహోవా చంపాడు.(2 సమోయేలు 8-10)
18. ఏదోము ప్రతి మగాణ్ణి చంపేశాడు. (2 సమోయేలు 8:13-14)
19. దావీదు యెహోవా చెప్పింది చేయడం వలన (census) 70,000 మంది చచ్చారు. (2 సమోయేలు 24:15, 1 Chr 21:14)
20.దేవుడు ఎవరో తేల్చుకునే పోటీలో ఏలీయా ప్రవక్త చేతిలో 450 మంది చచ్చారు. (1 రాజులు 18:22-40)