
దేవుడి సేవకు డబ్బులెందుకు?
ఇది చాలా మంది అడిగే ప్రశ్న.
దేవుడి కార్యానికి దేవుడే డబ్బు సమకూర్చుకుంటాడు అంటారు కొందరు.
అయితే బైబిల్ ప్రకారం దేవుడు డబ్బు సేకరించడానికి రెండు మార్గాలు ఎంచుకుంటాడు.
మొదటిది భయపెట్టడం రెండోది ఆశ పెట్టడం
మొదటిది యెహోవా పద్ధతి, రెండోది యేసు పద్దతి.
యెహోవా పద్ధతి:
యెహోవా ప్రకారం దశమ భాగం (10% income) ఇవ్వని విశ్వాసులు దొంగలే..!
మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరం దురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.(మలాకీ 3:8)
Will a man rob God? Yet ye have robbed Me! But ye say, `Wherein have we robbed Thee? In tithes and offerings. (Malachi 3:8)
భావం : దేవుడిని ఎవడైనా దోచుకోగలరా? కానీ 10% ఇవ్వకుండా ఉండే అందరూ యెహోవాని దోచుకున్నట్టే లెక్క!
ఇక్కడ దేవుడు తనకు దశమ భాగాలు ఇవ్వకపోతే దొంగతనం అంటగడుతున్నాడు. బైబిల్లో దేవుడి సొమ్ము కాజేయడం మహానేరం కాబట్టి విశ్వాసులు భయంతో అయినా దశమ భాగాలు ఇస్తారు అని ఆయన ఎత్తుగడ.
ఇక రెండో పద్ధతి చూద్దాం.
దేవుని రాజ్యం పేరుతో దొరికినినంత అందిపుచ్చుకోవడం
యేసు జీవించిన కాలంలో ఇలా చేసేవాడు.
లూకా 8:1-3
వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి. వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచువచ్చిరి.
ఇక్కడ యేసు మరియు అతని అనుచరులు దేవుని రాజ్యం పేరుతో ఆస్థి కూడా తీసుకున్నారు అని రాసి ఉంది. దశమ భాగాల కంటే ఆస్తి ఎక్కువ విలువైనది కదా!
అక్కడితో యేసు ఆగిపోలేదు. యేసు ఇలా అంటాడు.
బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మింగివేసెను. (లూకా 8:4-5)
విత్తనాలు (ఆస్తి పాస్తులు ) యేసు అనే చేనులో పడాలి. అప్పుడే అది దేవుడి రాజ్యాన్ని తెస్తుంది. అది వేరే చోట ఖర్చు చేస్తే అన్యాక్రాంతం అవుతుంది.
ఇలా దేవుడి పేరుతో, పరలోకం/దేవుని రాజ్యం పేరుతో దోచుకోవడం ఎంత ఘోరమో కదా?
దేవుడి పేరుతో చనిపోయిన వారిని బతికించిన యేసుకి మనుషుల ఆస్తి అవసరమా? ఆలోచించండి.
ఇదే విధంగా అందిన కాడ దోచుకునే మతమార్పిడి ముఠా ఇలా చేయడంలో సిద్ద హస్తులు. కాదంటారా?
సోదర జయ శ్రీరామ 🙏🚩. మీ ఆలోచన చాలా బాగుంది. సైట్ ను ఇంకా డెవలప్ చేయండి. ఇంకా చాలా కంటెంకంటెంట్ ఆడ్ చేయండి. మీకు మా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది. …🗡️🚩🕉️🔥💪