నీకు నీ భార్యా పిల్లలు కావాలా? బానిసత్వం నుండి విముక్తి కావాలా?

నీకు నీ భార్యా పిల్లలు కావాలా? బానిసత్వం నుండి విముక్తి కావాలా?

నీకు నీ భార్యా పిల్లలు కావాలా? బానిసత్వం నుండి విముక్తి కావాలా?

ఒకవేళ భార్యా పిల్లలు కావాలంటే జీవితాంతం బానిసగా ఉండు.

ఇది బైబిల్ దేవుడి ఆజ్ఞ.

అమాయక పేద ప్రజలని బానిసలుగా చేసుకోవడమే కాకుండా వాళ్ల కుటుంబాలతో, భార్యా పిల్లలని అడ్డం పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం ఎలాగో స్వయంగా దేవుడే చెప్పడం ఒక హైలైట్
ఇక్కడ హీబ్రూ బానిస ఎంతకాలం బానిసగా ఉండాలి, అతని విడుదల సమయంలో భార్యా పిల్లలు ఉంటే అతని పరిస్థితి ఏమిటి విషయాలు దేవుడు చెప్తున్నాడు.

ఈ క్రింది వచనాలు చూడండి.

నిర్గమకాండం 21వ అధ్యాయం 1-6 వచనాలు.

  1. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా
  2. నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.
    యోహాను 8:35
  3. వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.
  4. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.
  5. అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల
  6. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.

అర్ధం అయ్యింది కదా.

ఇప్పుడు ఆ వ్యక్తి తనకు భార్యా పిల్లలు కావాలనుకుంటే జీవితాంతం బానిసగా బతకాలా?

ఒకవేళ అతను భార్యా పిల్లలు వద్దు అనుకొని వెళ్ళిపోతే అతని భార్యా పిల్లలు యజమానికి దగ్గర ఊడిగం చెయ్యాలా?

బానిసత్వాన్ని ఇంతగా సపోర్ట్ చేయడం దేవుడని చెప్పుకునే యెహోవాకి తగునా?

ఒకసారి తన భార్యా పిల్లల కోసం మళ్లీ బానిసత్వంలోకి పోయే ఆ అమాయక బానిస భర్త స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోగలరా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *