క్రీస్తు పుట్టిన రాజ్యంలో పరువు హత్య!
ముస్లిం యువకుడిని ప్రేమించిందని కన్న కూతురినే చంపేసిన క్రైస్తవ తండ్రి.
అదేంటి?
ఇతను క్రైస్తవుడు కదా!
అందరూ దేవుని బిడ్డలే అనే నమ్మే ఈ క్రైస్తవుడు, తన కూతురు మరో దేవుని బిడ్డ అయిన ముస్లిం ని పెళ్లాడతాను అంటే ఎందుకు ఒప్పుకోలేదు? ఆమెను ఎందుకు చంపేశాడు?
బైబిల్ అతనికి మంచి విషయాలు నేర్పించలేదా?
పైగా ఈ పరువు హత్య జరిగింది మనదేశంలో కాదు. క్రీస్తు పుట్టినట్టు చెప్పబడే ఇజ్రాయెల్ దేశంలో..!
అదేమిటి మన దేశంలో లాగా గొర్రెల రాజ్యంలో కూడా పరువు హత్యలు ఉంటాయా?
అలాంటి సందేహం ఉన్నవాళ్లు ఈ link లో చూడండి.
….
ఇక ఈ పరువు హత్యకి ఉన్న కారణాలు ఏమిటో చూద్దాము.
కారణం 1.
ముస్లిం ల దృష్టిలో క్రీస్తు అసలు దేవుడే కాదు. అలాగే క్రైస్తవ యువతి ముస్లిం యువకుడిని పెళ్ళాడితే ఆమె ముస్లిం గా మతం మారాలి. క్రైస్తవ మతాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అదే ఆ తండ్రి ఆవేదన. అందుకే కూతురుని చంపుకున్నాడు.
ముస్లిం అబ్బాయిని పెళ్లాడితే ఆ అమ్మాయికి yesuki/ యెహోవా కి దూరం అయిపోతుంది కాబట్టి.
ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోవద్దు అని యెహోవా ఇజ్రాయెల్ వాళ్ళకి బైబిల్లో చెప్పాడు.
ద్వితీయోపదేశకాండము 7:3
నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.
ద్వితీయోపదేశకాండము 7:4
నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.
రెండో కారణం :
ముస్లిం ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కూడా ముస్లిం అవ్వాలి కాబట్టి.
ఇప్పుడు చెప్పండి ఆ తండ్రి చేసింది బైబిల్ ప్రకారం తప్పా? ఒప్పా?
…….
మన దేశంలో కులం వేరుగా ఉన్న వాళ్ళకి పిల్లని ఎందుకు ఇవ్వరు?
ఎందుకు అంటే అమ్మాయిల పెళ్లి జరిగిన అనంతరం అబ్బాయి యొక్క కులం అమ్మాయికి వస్తుంది. అంటే ఆ అమ్మాయి కులం మారుతుంది కాబట్టి.
…..
పెళ్లితో కులం / మతం మారిపోవడం అనే పద్దతి ఉండటం వలన అలా మారకుండా ఉండాలనే అందరూ ఇలాంటి పరువు హత్యలకి పూనుకుంటున్నారు. ఇది మంచి పని కాదు.
కేవలం హిందువుల్లోనే కాదు, ఇలాంటి గొడవలు అన్ని కులాల్లో, మతాల్లో ఉన్నాయి.
ఉదాహరణలు :
సౌదీ లో మతం కోసం కూతురిని చంపిన ముస్లిం తండ్రి:
గల్ఫ్ లో క్రైస్తవురాలిగా మారింది అని కూతురుని చంపిన ముస్లిం తండ్రి.
ఇండియాలో ముస్లిం యువతిని పెళ్లాడిన హిందూ అబ్బాయిని చంపిన ముస్లిం కుటుంబం
ఇష్టానబుల్ లో ముస్లిం ని ప్రేమించిన అమ్మాయిని హతమార్చిన క్రైస్తవ కుటుంబం :
https://www.theguardian.com/uk/2012/apr/30/honour-killings-spreading-alarming-rate
కులం కోసం చంపడం తప్పు. అలాగే మతం కోసం చంపడం కూడా తప్పే!!!
అలాగే ఈ జాడ్యం క్రైస్తవుల్లోనూ, ముస్లింమ్స్ లోనూ, హిందువుల్లోనూ, ఒకరేమిటి అన్ని వర్గాల లోనూ ఉంటాయి అని గ్రహించండి.