ఆకాశంలోని అన్ని నక్షత్రాలకు యెహోవా పేర్లు పెట్టాడా?

ఇందులో నిజం ఎంత?

ఒక్కో సారి బైబిల్ చెప్పే విషయాలు అమాయక గొర్రెలకు కూడా అనుమానం కలిగించేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ వాక్యం ఒక ఉత్తమ ఉదాహరణగా చెప్పుకోవచ్చు

ఆకాశంలోని నక్షత్రాలకు యెహోవా పేర్లు పెట్టాడు:

నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు. (కీర్తనల గ్రంథము 147:4)

He determines the number of the stars and calls them each by name. (Psalms 147:4)

ఈ వాక్యం ప్రకారం బైబిల్ దేవుడికి ఈ సృష్టిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలిసి ఉండాలి. అలాగే అన్ని నక్షత్రాలకూ యెహోవానే పేర్లు పెట్టాడు. కాబట్టి ఏయే నక్షత్రాలకు ఏయే పేర్లు యెహోవా పెట్టాడో బైబిల్ రచయితలకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకు అంటే నక్షత్రాల సంఖ్య, నక్షత్రాల పేర్లు అన్నీ యెహోవా పెట్టినట్టు వాక్యంలో రాసుకున్నారు.

ఇది కనుక నిజం అయితే బైబిల్ రచయితలు ఆ విషయాలను(నక్షత్రాల సంఖ్య +పేర్లు ) స్వయంగా తెలుసుకొని ఈ వాక్యం రాసి ఉండాలి. అవునా ..!

ఒకవేళ నిజంగా యెహోవా వారికి ఈ జ్ఞానం ఇచ్చి ఉంటే వాటి వివరాలు బైబిల్ లో ఎక్కడ ఉన్నాయి? బైబిల్ లో లేకపోతే పోనీయండి .. యెహోవా దగ్గర విని, ఇజ్రాయెల్ ప్రజలలో ఎవరైనా అన్ని నక్షత్రాలకు పేర్లు పెట్టినట్టు ఆధారాలతో సహా చూపించగలరా?

ఖచ్చితంగా చూపించలేరు.

అందుకే ఖచ్చితంగా ఈ వాక్యం ఫేక్ అని మనం చెప్పగలం.

మనకున్న Latest ఎవిడెన్స్ ప్రకారం (NASA రీసెర్చ్ ప్రకారం) ఈ విశ్వంలో దాదాపు 200 billion trillion నక్షత్రాలు ఉన్నాయి. అంటే 200,000,000,000,000,000,000,000 నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ నక్షత్రాలు అన్నిటికీ పేర్లు పెట్టడం ఎవరికైనా సాధ్యమా?

ఇన్ని నక్షత్రాలకి పేర్లు పెట్టాలంటే ఎంత టైమ్ పడుతుంది? వాటిని ఇతరులకి యెహోవా చెప్పడం, వాటిని వాళ్ళు నోట్ చేసుకోవడం, పుస్తక రూపంలో భద్రపరచడం ఇవన్నీ సాధ్యమేనా? కాబట్టి ఈ ఎక్స్ట్రార్డినరీ క్లెయిమ్ ని నిరూపించుకోవడం క్రైస్తవుల వలన కాదు. కానీ ఇది నిజమే అని వాళ్ళ పుస్తకంలో రాయబడి ఉంది కాబట్టి మనతో వాదిస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం ఉండదు.

ఒకవేళ మనం ప్రశ్నిస్తే మనల్ని ఏదో ఒకటి అనేసి తమ ఇగో ని satisfy చేసుకుంటారు. Extraordinary claims need extraordinary proofs అన్న విషయాన్ని క్రైస్తవులు అస్సలు పట్టించుకోరు.

కానీ అసాధ్యమైన వాటిని తమ పుస్తకంలో రాసుకొని మన ఇళ్లకు వస్తారు. అది ఎలా సాధ్యం అని వారిని అడిగి చూడండి. దేవుడికి అన్నీ సాధ్యమే అన్న వాక్యం తప్ప వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *