is jesus the son of god?

is jesus the son of god?

బైబిల్ vs Quran పేరుమీద జరిగే డిబేట్ లలో ఈ ప్రశ్న తరచూ వినిపిస్తూ వుంటుంది.

ముస్లిమ్స్ మరియు క్రైస్తవుల మధ్య చీలిక రావడానికి ఈ ప్రశ్న ఒక ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు.

పాత నిబంధన కాలం లో యెహోవా నేను మాత్రమే దేవున్ని, నేను తప్ప మరొక దేవుడు లేదు అని చెప్పుకున్నట్టే, quran లో కూడా అల్లాహ్, నేను మాత్రమే దేవున్ని నేను తప్ప మరొక దేవుడు లేదు అని చెప్పుకున్నాడు.

అయితే కాలక్రమేణా క్రైస్తవులు ఏక దేవతరాధన నుండి త్రిత్వం వైపు మల్లడంతో ఏక దేవతారాధకులైన కొందరు యెహోవా పేరు బదులుగా అల్లాహ్ అని పెట్టుకొని, క్రైస్తవులు తప్పుడు గ్రంధాన్ని ఫాలో అవుతున్నారు అని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆ ప్రచార ఆయుధమే quran.

అయితే ముస్లిమ్స్ క్రైస్తవుల కంటే లేట్ గా ఖురాన్ ని రాసుకోవడం వలన బైబిల్ లోని కొన్ని తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు.అదేమిటంటే.. ఏసు దేవుడు కుమారుడు అని క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారు కదా.. ఒక వేల నిజంగానే ఏసు యెహోవా కొడుకు అయితే.. యెహోవా భార్య ఎవరు?భార్య లేని దేవుడికి ఈ కొడుకు ఎక్కడ నుండి వచ్చాడు. Quran లో ఇలా ఉంది.అల్లాహ్‌ ఎవ్వరినీ కూడా తనకు సంతా నంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాఅయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్‌! వారు కల్పించేవాటికి అతీతుడు. (Quran 23:92)

దీనిని ఆధారం చేసుకొని మరో మాట కూడా quran లో ఉంది.ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించినవాడు. నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు. ( Quran 6:101). నిజమే కదాదేవుడికి ఎవరూ కొడుకు కాదు అని quran చెప్తుంది.

కొడుకే ఉంటే భార్య కూడా వుండాలి కదా.. ఇది ముస్లిమ్స్ వేసిన ప్రశ్నఈ ఒక్క మాటతో Judaism అనే మతం రెండు ముక్కలై క్రైస్తవులు, ముస్లిమ్స్ రెండు వర్గాలుగా విడిపోయారు.అయితే మీకు మరో విచిత్రమైన విషయం చెప్తాను.యెహోవా కి బైబిల్ లో ఏసు కాకుండా చాలా మంది కొడుకులు ఉన్నారు.

వాళ్లెవరో చూడండి.

1. దావీదు యెహోవా కొడుకు

కీర్తనల గ్రంథము 2:7

కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.

2. ఇశ్రాయేలు దేవుని కొడుకు

నిర్గమకాండము 4:22

అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;

3. దేవుని కుమారులు నరుల కుమార్తెలని పెళ్లాడారు.

ఆదికాండము 6:2దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.

4. అందరూ దేవుని కొడుకులే

యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. (యోహాను 20:17)

ఇక్కడ ఏసు తో పాటు అందరూ దేవుని కుమారులే అని ఉంది. కాని క్రైస్తవులు యేసుని మాత్రమే దేవుడి కుమారుడు అని ప్రొజెక్ట్ చేశారు.ఈ వచనం చూడండి.

హెబ్రీయులకు 5:5

అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.పైన దావీదుని నేను ఈరోజు కని యున్నాను అన్నాడు. ఇక్కడ యేసుని కూడా కని యున్నాను అంటున్నాడు.

ఇలాంటి విరుద్ధమైన వాక్యాలతో ముస్లిమ్స్ దగ్గర బాగా చిన్న చూపు అయ్యారు క్రైస్తవులు.ఇక అక్కడ బేరం కుదరక మన దేశం మీద పడ్డారు. కానీ యెహోవా ఎంత గొప్ప వాడంటే తన బిడ్డలైన 28,00,000 మందిని చంపాడు, తన కొడుకు అయిన ఏసు ని చంపాడు. ఇక అల్లాహ్ తన బిడ్డలు అయిన మానవులని మతం పేరుతో చంపమని చెప్పాడుఏమిటో ఎడారిలో నీళ్లు దొరకవు, ఎడారి మతాల్లో జాలి, దయ ఉండవు.

1 thought on “దేవునికి ఎంత మంది కొడుకులు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *