క్రైస్తవ మతం ఎలా పుట్టుంది?
మోసే మాటల నుండి.. మాయల నుండి!
అంతే..!
ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే మోసే తన కుటుంబ సభ్యులు బాగుపడటం కోసమే క్రైస్తవ మతం పుట్టింది. క్రైస్తవ మతానికి మూలమైన యూయుల మతం ( judaism ) మోసే సెలవే. ఐతే ఉందులో దైవ ప్రేరణ ఉందా? లేకపోతే తన సొంత కుటుంబం అభివృద్ధి కోసమే ఒక కొత్త దేవున్ని మోసే సృష్టించాడా? అనేది ఇప్పుడు చర్చిద్దాం!
మోసే ఎవరు?
1300 BCE లో నివసించిన ఒక వ్యక్తి అంటారు కొందరు. అతను ఈజిప్ట్ లో బానిసలుగా ఉన్న ఇజ్రాయెల్ వాళ్లని విడిపించి, వాళ్ళకి సొంత రాజ్యం ఇస్తా అని మాట ఇస్తాడు. అతనికి దేవుడు ( దేవుడి దూత ) వినపడినట్టు, తను దేవుడి ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నట్టు జనాలకి నమ్మ బలకు తాడు.
బయటపడ్డ మోసే సొంత ఎజెండా :
మొదట్లో అంతా ఇజ్రాయెల్ వాళ్ళ కోసమే చేస్తున్నట్టు చెప్పుకున్న మోసే, మెల్లగా తన కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతాడు. దాంతో మోసే మోసపూరితంగా ఇదంతా చేసినట్టు మనకు అర్ధం అవుతుంది.
మోసే నత్తి వాడు.
మోషే చిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.(నిర్గమకాండము 6:30)
మోసేకి నత్తి ఉంది. ఏదైనా విషయం చెప్పాలంటే న.. న.. అంటాడు. దాంతో అతని పెద్ద తమ్ముడు అహరోను సహాయం తీసుకుంటాడు మోసే. ఏదైనా సభలో మాట్లాడాలంటే నత్తి అడ్డురావడంతో అహరోను సహాయం తప్పనిసరి. అలా కొంత కాలం అయ్యాక అహరోను లేకుండా సభలే గడిచేవి కావు.
అహరోను కుటుంబానికి అర్చకత్వం
అహరోను ప్రాధ్యాన్యత మనకి, ఈ నత్తి విషయం లోనూ, మోసే కొండ మీదకి పోయి చాలా రోజులు కనపడకుండా పోయినప్పుడు జనాలని కంట్రోల్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇక తమ్ముడుని విడిచిపెట్టడం కుదరదు అనుకున్న మోసే తమ్ముడుకి సరైన పదవి కోసం ఆలోచించాడు. యెహోవా అనే దేవుడు (దేవ దూత ) తనకి టచ్ లో ఉన్నట్టు జనాలని నమ్మించాడు కాబట్టి ఇక యెహోవా తన తమ్ముడు అహరోను, అహరోను కుటుంబాన్ని అర్చకులుగా నియమించారని, వాళ్లు తప్ప ఇంకెవరూ అర్చకత్వం చేయకూడదు అని, అలా ఎవరైనా ఆజ్ఞ అతిక్రామిస్తే యెహోవా చంపేస్తాడు అని చెప్పాడు.
నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.(సంఖ్యాకాండము 3:10)
అహరోను కోసమే మోసే హత్యలు :
అహరోను కుటుంబం అర్చకులుగా స్థిర పడ్డాక జంతు బలులు, నైవేద్యాలు, పిండి వంటలు ఒకటేముటి అన్నిటిలోనూ అహరోను కుటుంబానికి వాటా దక్కింది. దాంతో మోసే తమ్ముడు కుటుంబం సంతోషంగా గడిపేది. కానీ కొంత మంది మేము కూడా అహరోను లాగా అర్చకత్వం చేస్తాము అని బయటకి వచ్చారు.
మోసే వారిని నిర్ధాక్షిణం హతమార్చాడు. దేవుడే చంపాడు అని జనాలని నమ్మించాడు. కోరహు (korah ) తో పాటు 249 మందిని యెహోవా చంపిన సంఘటన దీనికి మంచి ఉదాహరణ.
బైబిల్ లో కుల వ్యవస్థ :
అహరోను కుటుంబంలో పుట్టిన వాళ్లు మాత్రమే అర్చకులు కావడం అంటే, కేవలం పుట్టుక ఆధారంగా అర్చకత్వం ఇవ్వడమే కదా. దీనినే మన దేశంలో కుల వ్యవస్థ అంటారు. అలా కాకుండా వ్యక్తి యొక్క విద్య ఆధారంగా, పాండిత్యం ఆధారంగా అర్చకత్వం ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ క్రైస్తవులు తమ మతంలో ఉన్న కుల జాడ్యాన్ని వదిలి, మిగతా వారిపై పడతారు.
Noah -ఆగరోనుల మధ్య ఉన్న పుట్టుక( వంశం / కులం ) తేడా = కూల్ వ్యవస్థ
ఇలాంటి ఎన్నో నియమాలు, సున్నతి ఆచారం, కథలు, హత్యలు చేసి క్రైస్తవుల మూల మతం అయిన యూదుల మతాన్ని సృష్టించాడు మోసే.
మోసే చేసిన మరిన్ని మాయలు next post లో చూద్దాం
బైబిల్ లోని కుల వ్యవస్థ గురించి పూర్తి వివరాలు ఈ కింది post లలో చూడండి.
https://www.facebook.com/106914574790243/posts/199722538842779/
https://www.facebook.com/106914574790243/posts/154537870027913/